వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాలూకు ఝలక్ :అఖిలేష్ కు ఫోన్ చేసిన లాలూ, 'ఎన్నికలయ్యే వరకు నేనే పార్టీ చీఫ్'

సమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభంపై లాలూ జోక్యం చేసుకొన్నాడు. తండ్రికి పార్టీ పగ్గాలివ్వాలని అఖిలేష్ కు సూచించాడు.అయితే ఎన్నికలయ్యాకే పార్టీ పగ్గాలను ములాయం కు ఇస్తానని అఖిలేష్ .

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో :సమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఆర్ జె డి చీప్ లాలూ ప్రసాద్ యాదవ్ ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు ఫోన్ చేశాడు. పార్టీలో నెలకొన్న సంక్షోభం దృష్ట్యా ఆయన సలహలు ఇచ్చారు.అయితే లాలూ చేసిన సూచలను స్వీకరిస్తూనే ఆయన కు సున్నితంగానే ఝలక్ ఇచ్చాడు అఖిలేష్ యాదవ్ .

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు ప్రయోజనం కలిగేలా కుటుంబసమస్యలు వీధిన పడడం సరికాదని ఆర్ జె డి చీఫ్ లాలూ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ కుటుంబీకులకు సర్ధిచెప్పారు.

ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని తాజాగా అఖిలేష్ యాదవ్ కు ఆర్ జె డి చీఫ్ లాలూ యాదవ్ పోన్ చేశాడు. పార్టీ పగ్గాలను ములాయం కు అప్పగించాలని సూచించాడు.

అయితే పార్టీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తన తండ్రిని గౌరవిస్తూనే ఉంటానని అఖిలేష్ లాలూకు చెప్పాడు. అఖిలేష్ సున్నితంగానే లాలూకు ఘాటైన సమాధానం ఇచ్చాడు.

లాలూకు ఝలక్ ఇచ్చిన అఖిలేష్ యాదవ్

లాలూకు ఝలక్ ఇచ్చిన అఖిలేష్ యాదవ్

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభానికి వారం రోజుల గడువే ఉంది. ఈ నేపథ్యంలో పార్టీలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులను చక్కదిద్దేందుకుగాను ఆర్ జె డి చీఫ్ లాలూ కూడ చొరవచూపారు. గతంలో తనయుడు అఖిలేష్ పై సోదరుడు రామ్ గోపాల్ యాదవ్ పై పార్టీచీఫ్ ములాయం సింగ్ యాదవ్ సస్పెన్షన్ వేటు వేయడంతో లాలూ చొరవచూపాడు. ఈ చోరవ కారణంగానే వీరిద్దరిపై సస్పెన్షన్ వేటును ములాయం సింగ్ యాదవ్ ఎత్తివేశాడు. రెండు రోజుల క్రితం పార్టీలో సంక్షోభ పరిస్థితులు తగ్గినట్టుగా కన్పించాయి.దరిమిలా లాలూ యాదవ్ అఖిలేష్ కు మంగళవారం నాడు ఫోన్ చేశాడు. పరిస్థితి చేయి దాటిపోయిందని లాలూకు అఖిలేష్ యాదవ్ ధీటైన జవాబిచ్చాడు.

అఖిలేష్ ఇచ్చిన సమాధానంతో షాకైన లాలూ

అఖిలేష్ ఇచ్చిన సమాధానంతో షాకైన లాలూ

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ లో నెలకొన్న సంక్షోభ నివారణకు తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు లాలూ. రాజకీయ ప్రత్యర్థి బిజెపికి ప్రయోజనం కలగకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే సమాజ్ వాదీ పార్టీ సంక్షోభ నివారణకు ప్రయత్నాలను ప్రారంభించాడు. సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని అఖిలేష్ కు కట్టబెడుతూ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం ఏకగ్రీవంగా తీర్మాణం చేసింది. అయితే పార్టీ భాద్యతలను తండ్రి ములాయంకు అప్పగించాలని లాలూ అఖిలేష్ కు సూచించాడు. 'మీరు చెప్పే మాటలను శిరసావహిస్తాను, కాని ఎన్నికల వరకు పార్టీ పగ్గాలు నా చేతుల్లోనే ఉంటాయి,. ఎన్నికల తర్వాతే పార్టీ పగ్గాలను సగౌరవంగా తన తండ్రి ములాయంకు' అప్పగిస్తానని అఖలేష్ సున్నితంగానే లాలూకు చెప్పాడు.

పార్టీ పగ్గాలను అఖిలేష్ ఎందుకు తీసుకొన్నాడు

పార్టీ పగ్గాలను అఖిలేష్ ఎందుకు తీసుకొన్నాడు

సమాజ్ వాదీ పార్టీలో తనకు రాజకీయంగా చెక్ పెట్టేందుకు సవతి తల్లి ప్రయత్నిస్తోందని అఖిలేష్ గుర్తించాడు. పార్టీ తన చేతుల్లోకి తీసుకోకపోతే పార్టీ ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెల్టివేయబడే పరిస్థితులు ఉంటాయని ఆయన అనుమానిస్తున్నాడు. అదే తరుణంలో పార్టీలోకి మాఫియాలు, తన వర్గానికి ప్రాధాన్యం లేకుండా బాబాయ్ శివపాల్ యాదవ్ చెక్ పెట్టడం కూడ మరో కారణం. ఈ పరిస్థితుల నేపథ్యంలో అఖిలేష్ పార్టీ పగ్గాలను తన చేతుల్లోకి తీసుకొన్నాడు.

ఎన్నికల తర్వాత ములాయంకు పగ్గాలివ్వనున్నఅఖిలేష్

ఎన్నికల తర్వాత ములాయంకు పగ్గాలివ్వనున్నఅఖిలేష్

బాబాయ్ శివపాల్ రాష్ట్రంలో తన వర్గానికి టిక్కెట్లు దక్కకుండా చేయడం అఖిలేష్ కు ఇబ్బందిగా మారింది. అసెంబ్లీలోనూ, పార్టీలోనూ తన వర్గానికి ప్రాతినిథ్యం దక్కకుండా శివపాల్ వ్యూహత్మకంగా అడుగులువేస్తున్నాడు. పార్టీ ప్రకటించిన జాబితాలో అఖిలేష్ వ్యతిరేకులకే పెద్ద పీట వేశాడు. ఈ పరిస్థితుల నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ పార్టీని తన చేతుల్లోకి తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరో వైపు పార్టీ తన చేతుల్లో ఉంటే టిక్కెట్ల కేటాయింపుతో పాటు ఇతర అంశాల్లో తన వర్గానికి సముచిత ప్రాధాన్యం దక్కేలా చూసే అవకాశం ఉంటుంది. ఈ మేరకు ఆయన పార్టీ పగ్గాలను తీసుకొన్నాడు. మరో వైపు ఎన్నికల తర్వాత పార్టీ పగ్గాలను ములాయం సింగ్ యాదవ్ కు అఖిలేష్ ఇస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.అయితే అప్పటి పరిస్థితుల ఆదారంగా అఖిలేష్ ఈ విషయమై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

English summary
lalu phones akhilesh Yadav, says bring back mulayam as party chief, after elections i will hand over the party chief post to mulayam said akhilesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X