వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హ్యాపీగా జైల్లో లాలూప్రసాద్ గార్డెనింగ్, రూ.14 సంపాదన

By Srinivas
|
Google Oneindia TeluguNews

రాంచీ: దాణా కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తున్న రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడి) అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ హోత్వార్‌లోని బిర్సా ముండా కేంద్ర కారాగారంలో గార్డెనింగ్ చేస్తున్నారు. లాన్స్‌లో గార్డెనింగ్ చేస్తూ లాలూ రోజుకు పద్నాలుగు రూపాయలు సంపాదిస్తున్నారు.

జైలు అధికారులు లాలూకు గార్డెనింగ్ చేసే పనిని వారం రోజుల క్రితం అప్పగించారు. ఈ పనిని లాలూ జార్ఖండ్ హైకోర్టు తన బెయిల్‌ను తిరస్కరించిన తర్వాత రోజు నుండి చేయడం ప్రారంభించారు. ఐదు రోజుల నవంబర్ 30న ఆయన బెయిల్‌ను కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో ముగ్గురు ఐఏఎస్, ఒక ఐఆర్ ఆఫీసర్‌లు నిందితులుగా ఉన్నారు. వీరు జైలులో ఉపాధ్యాయులుగా మారారు.

Lalu Prasad

జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... లాలూ తన పనిని ఎంజాయ్ చేస్తున్నారు. గార్డెనింగ్ చేస్తున్న అతను పనిలో ఆనందాన్ని పొందడమే కాకుండా గార్డెనింగ్ చేస్తున్న ఇతరులకు సూచనలు చేస్తున్నారు. లాలూకు వారంలో ఒకరోజు సెలవు ఉంటుంది. 52 ఏకరాలు ఉన్నా జైలులో లాన్లు, గార్డెన్స్, కూరగాయల మొక్కలు ఉన్నాయి.

English summary
Serving time for the multi-crore fodder scam, RJD president Lalu Prasad earns Rs 14 a day for gardening and is apparently happy with tending lawns, flower beds and vegetable patches at the Birsa Munda Central Jail in Hotwar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X