వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికల బరిలోకి లాలూ కూతురు, భార్య (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

పాట్నా: లోకసభ నుంచి ఆర్జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తాను లోకసభ నుంచి ఉద్వాసనకు గురైనప్పటికీ నిరుత్సాపడడం లేదు. పార్టీ బలహీన పడుతున్నా వెనక్కి తగ్గడం లేదు. మంగళవారంనాడు లాలూ ప్రసాద్ యాదవ్ ఆరుగురు శాసనసభ్యులతో రాజభవన్‌కు ర్యాలీ తీశారు.

వచ్చే లోకసభ ఎన్నికల బరిలోకి తన కూతురు మిసా భారతిని, భార్య రబ్రీదేవిని దింపడానికి లాలూ సిద్ధపడ్డారు. డిఎన్ఎ మీడియా ఈ మేరకు ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. మిసా పాటలీపుత్ర నుంచి, రబ్రీదేవి ఛాప్రా నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

వారిద్దరు లోకసభకు ఎన్నిక కావడానికి వీలైన వ్యూహాన్నే లాలూ ప్రసాద్ యాదవ్ అనుసరిస్తున్నారు. ఛాప్రా నుంచి గత ఎన్నికల్లో లాలూ విజయం సాధించారు. పార్టీకి అది కంచుకోటలాంటిది. ముఖ్యమంత్రిగా పనిచేసిన రబ్రీ దేవి కూడా ఈ శాసనసభా నియోజకవర్గం నుంచే మూడు సార్లు గెలిచారు.

కాగా, పాటలీపుత్ర 2009లో జెడియుకు బలమైన నియోజకవర్గంగా నిలిచింది. ఇక్కడి నుంచి ఎన్నికైన రంజన్ ప్రసాద్ యాదవ్ ప్రజాదరణ కోల్పోతున్నారు. దీంతో తన కూతురు మిసా ఇక్కడి నుంచి విజయం సాధించడం సులభమని లాలూ భావిస్తున్నట్లున్నారు.

పాట్నాలో.. 1

పాట్నాలో.. 1

పార్టీపై తిరుగుబాటు చేశారని భావించిన తొమ్మిది శాసనసభ్యులతో మంగళవారంనాడు లాలూ ప్రసాద్ యాదవ్ రాజభవన్ ఆవరణలో ఇలా..

పాట్నాలో 2

పాట్నాలో 2

తన పార్టీ శాసనసభ్యులతో పాట్నాలో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జెడి) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఇలా..

పాట్నాలో 3

పాట్నాలో 3

కొంత మంది శాసనసభ్యులు తన పార్టీ నుంచి తప్పుకున్న తర్వాత పాట్నాలో మంగళవారంనాడు రాజభవన్ వద్ద రిక్షాలో లాలూ ప్రసాద్ యాదవ్ ఇలా..

పాట్నాలో ఇలా.. 4

పాట్నాలో ఇలా.. 4

పార్టీ నుంచి కొంత మంది శాసనసభ్యులు తప్పుకున్న తర్వాత పాట్నాలోని రాజభవన్ వద్ద ఆర్జెడి చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఇలా.

 పాట్నాలో ఇలా... 5

పాట్నాలో ఇలా... 5

తన పార్టీ నుంచి తప్పుకున్న తిరుగుబాటు వర్గంతో చేతులు కలిపారని భావిస్తున్న కొంత మంది శాసనసభ్యులతో రాజభవన్ ఆవరణలో లాలూ ప్రసాద్ యాదవ్...

పాట్నాలో ఇలా.. 6

పాట్నాలో ఇలా.. 6

పాట్నాలోని స్పీకర్ నివాసంపై కొంత మంది ఆర్జెడి కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నివాసం వద్ద భద్రతను పెంచారు.

English summary
Lalu Prasad Yadav may have been ousted from the Lok Sabha elections, but he is not broken. His party is thinning down, but he has not lost hopes. Proof? the Raj Bhawan march yesterday with the 6 MLAs who got back to RJD after dissociating from it to join Nitish Kumar's JD(U).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X