• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ తేడానా..? భార్య చెబుతున్నదేమిటి..?

|

పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తన విశిష్ట శైలితో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. పెళ్లి చేసుకుని ఏడాది కాకముందే తనకు భార్య నుంచి విడాకులు కావాలంటూ పేచీ పెట్టిన సంగతి తెలిసిందే. పండంటి కాపురాన్ని తన చేజేతులా నాశనం చేసుకున్నట్లు సమాచారం.

పెళ్లయిన ఏడాదికే విబేధాలు

పెళ్లయిన ఏడాదికే విబేధాలు

పెళ్లయిన ఏడాదిలోపే లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ - ఐశ్వర్యల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. తేజ్‌ప్రతాప్ యాదవ్ భార్య ఐశ్వర్య రాయ్ అతనిపై ఫిర్యాదు చేసేందుకు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. తనను తేజ్‌ప్రతాప్ యాదవ్ వేధించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. గృహహింస చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేసింది. పెళ్లి అయిన కొద్ది కాలానికే తేజ్‌ప్రతాప్ అసలు రంగు బయటపడిందని ఐశ్వర్య తెలిపారు. తేజ్ ప్రతాప్‌కు గంజాయి తీసుకునే అలవాటు ఉందని ఎప్పుడూ మత్తులోనే జోగుతుంటాడని ఆమె పేర్కొంది. ఆ మత్తులోనే తాను శివుడి వేషం వేసి తనను తాను శివుడిగా చెప్పుకుంటూ తిరుగుతుంటాడని ఆమె చెప్పారు. ఈ ఒక్క వేషమే కాదని తను వేసిన వేషాధారణలన్నీ మత్తులో ఉన్నప్పుడు వేసినవే అనీ ఐశ్వర్య ఫిర్యాదులో పేర్కొన్నారు. కొన్ని సార్లు రాధా మరియు కృష్ణుడు వేషాలు వేసేవాడని చెప్పిన ఐశ్వర్య... కొన్ని సార్లు చీరలు కూడా కట్టుకుని తనను తాను ఒక దేవతగా చెప్పుకు తిరిగేవాడని పేర్కొంది.

<strong>భారత్ పై పాక్ ప్రధాని పిచ్చి కూతలు..పుల్వామా తరహా దాడులు కావాలా? అంటూ బెదిరింపులు </strong>భారత్ పై పాక్ ప్రధాని పిచ్చి కూతలు..పుల్వామా తరహా దాడులు కావాలా? అంటూ బెదిరింపులు

 గంజాయి సేవించి గాగ్రా ఛోళీ ధరించేవాడట

గంజాయి సేవించి గాగ్రా ఛోళీ ధరించేవాడట

ఓసారి గంజాయి సేవించి మహిళలు ధరించే గాగ్రా చోళీ ధరించాడని ఐశ్వర్య చెప్పారు. అంతేకాదు మేకప్ వేసుకుని విగ్ ధరించి అచ్చం అమ్మాయిలా తయారయ్యాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ వింత ప్రవర్తన చూసి తన అత్త మామల దృష్టికి తాను తీసుకెళ్లగా వారెవరూ పట్టించుకోలేదని ఐశ్వర్య ఫిర్యాదులో తెలిపారు. అప్పటికీ తేజ్ అలా ప్రవర్తించడని వారు చెప్పినప్పటికీ అతనిలో ఏమాత్రం మార్పురాలేదని ఐశ్వర్య చెప్పారు. పైగా నన్నే సముదాయించే ప్రయత్నం అత్తమామలైన లాలూ, రబ్రీదేవీలు చేశారని ఐశ్వర్య చెప్పుకొచ్చింది. ఇక ఇలా కాదని ఇవన్నీ మానేయాలని తానే నేరుగా కాస్త గట్టిగా చెప్పినట్లు చెప్పారు. అయితే గంజాయి శివేడి అర్పణ అని దాన్ని కాదనలేనని సమాధానంగా తేజ్ చెప్పేవాడని ఐశ్వర్య వెల్లడించింది.

అత్తమామలకు చెప్పినప్పటికీ ఫలితం లేకపోయింది

అత్తమామలకు చెప్పినప్పటికీ ఫలితం లేకపోయింది

ఇక తన చదువును గురించి పదే పదే చులకన చేసి మాట్లాడేవాడని ఐశ్వర్య చెప్పుకొచ్చారు. తను కేవలం వంట గదికి పరిమితమై పిల్లలను కనేందుకు మాత్రమే పనికిరావాలని చాలా ఘాటుగా చెప్పేవాడని ఐశ్వర్య ఫిర్యాదులో పేర్కొంది. ఐశ్వర్యను మానసికంగా, శారీరకంగా, ఎమోషనల్‌గా వేధించినప్పటికీ సర్దుకు పోయినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఇదిలా ఉంటే గతేడాది మేలో ఒక్కటైన తేజ్‌ప్రతాప్ యాదవ్, ఐశ్వర్యలు ఐదు నెలలు తిరగక ముందే విడాకులు కావాలంటూ గతేడాది నవంబర్‌లో పాట్నా కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు తేజ్ ప్రతాప్ యాదవ్.

English summary
RJD chief Lalu Prasad Yadav elder son Tej Pratap Yadav marriage life seems to be in danger with wife Aishwarya filing a complaint on him in a family court. Aishwarya said that Tej was addicted to drugs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X