వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా లాలు ప్రసాద్ యాదవ్... నిరసన

|
Google Oneindia TeluguNews

కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు ప్రకంపనలు ఈశాన్య రాష్ట్రాలతో పాటు బీజేపీయోతర పాలిత రాష్ట్రాల్లో సైతం నిరసనలు చెలరేగాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు ఇతర రాష్ట్రాల్లో కూడ పలు రాజకీయా పార్టీలు అందోళనలు కొనసాగిస్తున్నారు. ఈనేపథ్యంలోనే అనారోగ్యం పాలైన బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా స్పందించారుఈ సంధర్బంగా ప్రభుత్వ వైఖరిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పలు పార్టీలు నిర్వహించాయి. దీంతో జైలు జీవితం గడుపుతూ... అనారోగ్యంతో ఉన్న లాలు ప్రసాద్ సైతం స్పందించారు. ఈ నేపథ్యంలోనే వెయ్యి గాయాలకు గురైనప్పటికి శత్రువులను ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు తనకు ఉన్నాయని అన్నారు. ఆయన కార్యాలయం నిర్వహించే ట్విట్టర్‌ నుండి ఓ పోస్ట్‌ చేశారు. దీంతో నా కళ్లు ఇంకా ప్రకాశవంతగా మండితున్నాయి. నా సిద్దాంతాలు, సూత్రాలు సజీవంగానే ఉన్నాయని తెలిపారు.

Lalu Yadav against the newly amended Citizenship Act

ఇక అనారోగ్యానికి గురైన వ్యక్తి ఇంకా బతికి ఉన్నారని విపక్షాలు నిరాశకు గురి కావద్దని పేర్కోన్నారు. తాను వెయ్యి గాయాలకు గురైనప్పటికి శత్రువులతో పోరాడే సామర్థ్యం ఉందని చెప్పారు. నా అత్మగౌరవం చెక్కుచెదరకుండా ఉందని ఇందుకుకోసం దేవునికి కృతజ్ఝతలు తెలుపుతున్నానని పేర్కోన్నారు. ఇందుకోసం తాను గతంలో మైనార్టీలకు మద్దతుగా మాట్లాడిన వీడియోను ఒకదాన్ని పోస్ట్ చేశారు. ఈ సంధర్భంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ , బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. కాగా పశుగ్రాసం కేసులో లాలు ప్రసాద్ యాదవ్ శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే..

English summary
Jailed Bihar politician Lalu Yadav on Friday joined several other opposition leaders in standing against the newly amended Citizenship Act
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X