వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాలూకు కోలుకోలేని దెబ్బ -ఎమ్మెల్యేతో బేరాల ఆడియోపై జార్ఖండ్ దర్యాప్తు -బీహార్‌లో మరో ఎఫ్ఐఆర్

|
Google Oneindia TeluguNews

దాణా కుంభకోణం కేసులో దోషిగా జైలు శిక్ష అనుభవిస్తోన్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్(72) మళ్లీ కోలుకోలేని విధంగా మరో అక్రమాల ఊబిలో కూరుకుపోయినట్లు కనిపిస్తోంది. కొద్ది గంటలుగా సంచలనం రేపుతోన్న 'ఎమ్మెల్యేలతో లాలూ బేరసారాల ఆడియో' వ్యవహారంలో లాలూకు వ్యతిరేకంగా ప్రభుత్వాల యంత్రాంగాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. అటు జార్ఖండ్, ఇటు బీహార్ రాష్ట్రాల్లో లాలూపై చట్టపరమైన చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు. తాజా నేరం నిరూపణ అయితే లాలూ ఇప్పుడప్పుడే విడుదలయ్యే అవకాశాలుండవు. వివరాల్లోకి వెళితే..

తిరుపతిలో జగన్‌కు డ్యామేజ్ -జనం మాటిదే -వెంకయ్యతో తీవ్ర విభేదం: వైసీపీ ఎంపీ<br>తిరుపతిలో జగన్‌కు డ్యామేజ్ -జనం మాటిదే -వెంకయ్యతో తీవ్ర విభేదం: వైసీపీ ఎంపీ

 ఎమ్మెల్యేలతో మంతనాలు..

ఎమ్మెల్యేలతో మంతనాలు..

ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడిన ఆర్జేడీ.. వెంట్రుకవాసిలో అధికారానికి దూరమైపోవడం తెలిసిందే. అయితే, అధికార ఎన్డీఏ కూటమిలో పదవులు దక్కని అసంతృప్త ఎమ్మెల్యేలను ఆర్జేడీ వైపు లాగేందుకు లాలూ విశ్వప్రయత్నం చేస్తున్నారని, జార్ఖండ్ లోని జైలు నుంచే బీహార్ బీజేపీ, జేడీయూ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తున్నారని బీహార్ బీజేపీ సీనియర్ నేత సుశీల్ మోదీ ఆరోపించారు. పిర్పాయింట్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే లల్లన్ పాశ్వాన్‌తో లాలూ సంభాషించినట్లుగా చెబతోన్న 30 నిమిషాల ఆడియో టేపును కూడా మోదీ విడుదల చేశారు. దీనిపై..

జార్ఖండ్ సర్కారు కీలక ఆదేశం..

జార్ఖండ్ సర్కారు కీలక ఆదేశం..

దాణా కేసులో దోషిగా తేలిన లాలూ.. రాంచీలోని బిర్సా ముండా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే, కొంతకాలం కిందట ఆరోగ్యం చెడిపోవడంతో ఆయనను రాజేంద్ర మెడికల్ ఇనిస్టిట్యూట్(ఆర్ఎంఐ)కి తరలించారు. ఆస్పత్రిలో సిబ్బందికి కరోనా సోకడంతో లాలూను వార్డు గది నుంచి.. ఆస్పత్రి ప్రాంగణంలోనే ఉండే ఆర్ఎంఐ డైరెక్టర్ బంగళాకు తరలించారు. ఉండేది గెస్ట్ హౌజ్ లోనే అయినా, జైలులో అమలయ్యే అన్ని నిబంధనలు అమలు కావాల్సి ఉంటుంది. కానీ లాలూ మాత్రం, ఛాన్స్ తీసుకుని సెల్ ఫోన్లు వాడుతూ, ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. లాలూ ఆడియో క్లిప్ వైరల్ కావడంతో ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశిస్తున్నట్లు జార్ఖండ్ ప్రభుత్వం ప్రకటన చేసింది.

లాలూపై చర్యలు తప్పవు..

లాలూపై చర్యలు తప్పవు..

జైలు శిక్షలో భాగంగానే లాలై యాదవ్ ను ఆర్ఎంఐ డైరెక్టర్ బంగళాలో ఉంచామని, ఆయనకు సంబంధించిన వ్యవహారాలన్నీ జైళ్ల శాఖ పరిధిలోకే వస్తాయని, ఖైదీగా ఉంటూ ఫోన్లు వాడటం నిషేధమని, లాలూ పని చేసినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంామని జార్ఖండ్ జైళ్ల శాఖ ఐజీ వీరేంద్ర భూషణ్ మీడియాకు చెప్పారు. లాలూ ఆడియో వ్యవహారంపై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించామని, రాంచీ డిప్యూటీ కమిషనర్, ఎస్పీ, బిర్సా ముండా జైలు సూపరింటిండెంట్‌ను కూడా విచారిస్తున్నామని ఐజీ చెప్పారు. లాలూను ఆస్పత్రి బంగళాలో కాకుండా మళ్లీ జైలుకు పంపాలని రాంచీ హైకోర్టులో ఓ పిటిషన్ కూడా దాఖలైంది. మరోవైపు..

ఆర్జేడీ అధినేతలపై ఎఫ్ఐఆర్..

ఆర్జేడీ అధినేతలపై ఎఫ్ఐఆర్..

బీహార్ లోని పిర్పాయింట్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే లల్లన్ పాశ్వాన్ గురువారం పాట్నా సిటీ పరిధిలోని నిగ్రానీ పోలీస్ స్టేషన్ లో లాలూ ప్రసాద్ పై ఫిర్యాదు చేశారు. జైలులో ఉన్న లాలూ ఫోన్ ద్వారా తనతో మాట్లాడారని, బీజేపీని వీడి, ఆర్జేడీకి మద్దతిచ్చేలా బేరాలకు దిగాడని, ఈ చర్యలు ప్రజా తీర్పును అవమానించినట్లే అవుతాయని ఎమ్మెల్యే పాశ్వాన్ ఆరోపించారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు లాలూపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, త్వరలోనే దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు. జైలు శిక్ష అనుభవిస్తోన్న లాలూకు కావాలనే ఎవరైనా ఫోన్లు అందించి ఇరికించారా? లేక నిజంగానే ఆయన నేరానికి పాల్పడ్డారా? అనేది దర్యాప్తులో తేలనుంది. నేరం రుజువైతే లాలూ ఇప్పట్లో బయటికొచ్చే దారులు మూసుకుపోతాయి.

రాజధానిపై బీజేపీ భారీ మెలిక -పవన్ వత్తాసు -'జగనన్నతోడు', వీసీల భర్తీ కథ తెలుసా: ఎంపీ రఘురామరాజధానిపై బీజేపీ భారీ మెలిక -పవన్ వత్తాసు -'జగనన్నతోడు', వీసీల భర్తీ కథ తెలుసా: ఎంపీ రఘురామ

English summary
The Jharkhand government on Wednesday ordered a probe into RJD president Lalu Prasad allegedly telephoning a NDA MLA in Bihar asking him to abstain from voting during election to Speaker of the assembly. Bihar BJP MLA Lalan Paswan files FIR against Lalu Yadav in audio clip row. jarkhand Inspector General, Prisons, Virendra Bhusan told PTI- Bhasha that he has asked Ranchi Deputy Commissioner, Superintendent of Police and Superintendent of Birsa Munda jail to inquire into the matter and if the allegations are found true initiate lawful action.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X