వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాన్స్ నాయక్ హనుమంతప్ప కన్నుమూత

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సియాచిన్ మంచుకొండల్లో చిక్కుకుపోయి ఆరు రోజుల తర్వాత బయటపడిన జవాను లాన్స్ నాయక్ హనుమంతప్ప గురువారం కన్నుమూశారు. అతను ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.అతను ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం గం.11.45ని.లకు కన్నుమూశారు. అతను కోలుకోవాలని భారత్ యావత్తు పూజలు, ప్రార్థనలు చేసింది.

జమ్మూ కాశ్మీర్‌లోని సియాచిన్ ప్రాంతంలో మంచు చరియలు విరిగిపడ్డ ఘటనలో పదిమంది ఆర్మీ జవాన్లలో హనుమంతప్ప సజీవంగా బయటపడ్డారు. లాన్స్ నాయక్ హనుమంతప్ప ఆరు రోజులుగా మంచు చరియల కింద సజీవంగానే ఉన్నాడు.

Lance Naik Hanamanthappa has passed away

పది రోజుల రోజుల క్రితం మంచు చరియలు విరిగిపడిన ఘటనలో సుమారు పది మంది జవాన్లు చిక్కుకున్నారు. సియాచిన్ ప్రాంతంలో తాము రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తుండగా లాన్స్ నాయక్ హనమంతప్ప సజీవంగా కనిపించారని, మిగిలినవాళ్లంతా మరణించారని జీఓసీ నార్తన్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హూడా మంగళవారం తెలిపారు.

Lance Naik Hanamanthappa has passed away

సియాచిన్ ఘటనలో మిగతా తొమ్మిది మంది జవాన్లు మృత్యువాతపడ్డారు. అయితే సహచరులు ఏ ఒక్కరైనా బతికి ఉంటారన్న ఆశతో సైనికులు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. సుమారు 25 ఫీట్ల మంచు కింద హనమంతప్ప రెస్క్యూ సిబ్బందికి సజీవంగా కనిపించాడు. అతను ఈ రోజు ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

English summary
Lance Naik Hanamanthappa has passed away
Read in English: Siachen soldier passes away
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X