వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

14 రోజులు కీలకం: ల్యాండర్‌తో కనెక్ట్ అయ్యేందుకు శాస్త్రవేత్తల ప్రయత్నం

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: చంద్రయాన్-2 ప్రయోగం పై ఆశలు ఇంకా మిగిలే ఉన్నాయని చెబుతున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. సెప్టెంబర్ 7వ తేదీన ల్యాండర్ విక్రమ్‌ నుంచి ఎలాంటి సంకేతాలు వెలువడకపోవడం.. ఆ తర్వాత అది తప్పిపోవడంతో శాస్త్రవేత్తలు కొంత నిరాశకు గురయ్యారు. అయితే ల్యాండర్‌ను గుర్తిస్తూ ఆర్బిటార్ పంపిన ఫోటోలతో ఇస్రో శాస్త్రవేత్తలు మళ్లీ వారి ప్రయత్నాలను చేస్తున్నారు. చంద్రయాన్-2తో తిరిగి కనెక్ట్ అయ్యేందుకు శాస్త్రవేత్తలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. విక్రమ్ ల్యాండర్ హార్డ్ ల్యాడింగ్ తర్వాత చంద్రుడి ఉపరితలంపైనే ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మహిళా నీకు వందనం: పైలట్ ఉద్యోగం పొందిన తొలి గిరిజన యువతి అనుప్రియమహిళా నీకు వందనం: పైలట్ ఉద్యోగం పొందిన తొలి గిరిజన యువతి అనుప్రియ

విక్రమ్‌ ల్యాండర్‌ ముందుగా అనుకున్న ల్యాండింగ్ ప్రాంతంలో కాకుండా మరో చోట హార్డ్ ల్యాండింగ్ అయ్యిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది ఆర్బిటార్ పంపిన ఫోటోల ద్వారా తెలుస్తోందని చెప్పారు.అయితే ల్యాండర్ విరిగిపోవడం కానీ ధ్వంసం అయినట్లుగా కానీ ఎక్కడా కనిపించడం లేదని చెప్పారు. అయితే ల్యాండర్ కాస్త వంగి ఉన్నట్లుగా కనిపిస్తోందని చెప్పారు. ల్యాండర్‌తో తిరిగి కనెక్ట్ అయ్యేందుకు తమ శాయశక్తులా కృషిచేస్తున్నట్లు ఓ శాస్త్రవేత్త తెలిపారు. ఇస్రో టెలీమెట్రీలో ట్రాకింగ్ అండ్ కమాండింగ్ నెట్‌వర్క్‌పై ఇస్రో బృందం పనిచేస్తోందని చెప్పారు.

Lander in a tilted position, Isro team working hard to establish link

ఇదిలా ఉంటే చంద్రయాన్-2లో ఆర్బిటార్, ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రగ్యాన్‌లు ఉన్నాయి. ల్యాండర్ మరియు రోవర్ జీవితకాలం చంద్రుడిపై పోలిస్తే ఒకరోజు అదే భూమితో పోలిస్తే 14 రోజులు. ఈ 14రోజుల సమయంలో తిరిగి ల్యాండర్‌తో కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు ఇస్రో అధినేత శివన్. ల్యాండర్‌లో సున్నితమైన పరికరాలన్నీ బాగా ఉంటే తిరిగి సంబంధాలు నెలకొనేందుకు అవకాశం ఉంటుందని అయితే హార్డ్ ల్యాండింగ్ అయినందున ఆ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని ఓ శాస్త్రవేత్త చెప్పారు.

గతంలో అంతరిక్షంలో ఉండగా తప్పిపోయిన ఉపగ్రహాలను తిరిగి సరైన మార్గంలో పెట్టగలిగిన అనుభవం ఉన్నప్పటికీ ల్యాండర్‌ను తిరిగి సరైన మార్గానికి తీసుకురావడం చాలా కష్టమని ఓ శాస్త్రవేత్త తెలిపారు. ఇప్పటికే అది చంద్రుడి ఉపరితలంపై ఉందని తిరిగి ముందుగా అనుకున్న ప్రాంతానికి తీసుకురావడం చాలా కష్టమని చెప్పారు. ఇక అన్నిటికంటే కీలకమైన విషయం ల్యాండర్‌కు అమర్చిన యాంటెన్నాలు గ్రౌండ్ స్టేషన్‌తో అన్న సంబంధాలు కలిగి ఉండాలి లేదా ఆర్బిటర్‌తో నైనా సంబంధాలు కలిగి ఉండాలి. ఇది చేయాలంటే నిజంగానే కష్టమైన పని అని ఓ శాస్త్రవేత్త చెప్పారు. అదేసమయంలో ఇది సాధ్యం కాదని కూడా చెప్పలేమన్నారు.

English summary
Not losing hope, the Indian Space Research Organisation (Isro) continued to make all-out efforts to establish link with Chandrayaan-2's 'Vikram' lander, now lying on the lunar surface after a hard-landing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X