వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీరం దాటుతోన్న నివర్ సైక్లోన్.. ప్రచండ గాలులతో భీతావాహ వాతావరణం

|
Google Oneindia TeluguNews

నివర్ తుఫాన్ తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తీరం దాటే సమయంలో ప్రచండ గాలులు 145 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం దాటుతోందని చెన్నే వాతావరణ శాఖ అధికారి ఎస్ బాలచంద్రన్ తెలిపారు.

Landfall process of severe cyclonic storm Nivar has started

పుదుచ్చేరిలో గల కరైకల్, మమల్లాపురం మధ్య తీరం దాటుతోంది.కడలూరుకు తూర్పు ఆగ్నేయంలో 50 కిలోమీటర్ల దూరంలో.. పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరో 3 గంటల్లో పుదుచ్చేరి సమీపంలో తీరం దాటనుందని వెల్లడించారు.

తుఫాన్ తీరం దాటే సమయంలో వీచే గాలితో భారీ వృక్షాలు నెలకొరిగే అవకాశం ఉంది. పంటలు/ తోటలకు నష్టం వాటిల్లుతోంది. కరెంట్ స్తంభాలు విరిగిపడే ఛాన్స్ ఉంది. అయితే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న జనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. అయితే ఆస్తినష్టం మాత్రం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

Recommended Video

#NivarCyclone : పెను తుఫాన్‌గా మారుతోన్న Nivar.. 34 రైళ్లు రద్దు చేసిన రైల్వేశాఖ!

English summary
Landfall process of severe cyclonic storm Nivar has started IMD Chennai, S Balachandran said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X