వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తరాఖండ్‌లో మళ్లీ విలయం! చిక్కుకుపోయిన 15000 మంది భక్తులు

ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌లో అంతర్భాగమైన విష్ణుప్రయాగ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడటంతో 1500 మంది చార్‌ధామ్‌ యాత్రికులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌లో అంతర్భాగమైన విష్ణుప్రయాగ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో బద్రీనాథ్‌కు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా మూసుకుపోయింది. భారీ ఎత్తున కొండచరియలు విరిగిపడటంతో చార్‌ధామ్‌ యాత్ర నిలిచిపోయింది.

రహదారి మూసుకుపోవడంతో కనీసం 15 వేల మంది యాత్రీకులు ఎక్కడి వారు అక్కడే ఆగిపోవాల్సివచ్చింది. వందల సంఖ్యలో వాహనాలు బారులుతీరాయి. సమాచారం అందిన వెంటనే విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి, రహదారిని పునరుద్ధరించే పనిలో నిమగ్నం అయ్యాయి.

 Landslide in Uttarakhand, several tourists stuck

అయితే కొండ చరియలు విరిగి పడిన ఘటనలో యాత్రికులు ఎవరైనా చనిపోయారా? గాయపడ్డారా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. నాలుగేళ్ల కిందట చార్‌ధామ్‌ యాత్రలో పెనువిలయం సంభవించి వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

English summary
The Char Dham Yatra to Badrinath got disrupted on Friday afternoon after a massive landslide occurred at Hathi Parvat, near Vishnuprayag, about 9 km from Joshimath in Chamoli district. About 13,500 tourists are stuck, according to preliminary estimates.Incidentally, the debris brought down by the landslide affected almost 150 meters of area and also damaged 60 meters of Rishikesh-Badrinath National Highway. However, no pilgrim sustained any injuries in the landslide. "Border Roads Organization (BRO) and police personnel are at the spot and trying to manage the situation. We are trying to ensure that debris is cleared and traffic movement is restored soon," said Tripti Bhatt, Superintendent of Police (SP) Chamoli.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X