• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వ్యాక్సిన్ల కొరత: భారత్‌కు భారీ ఊరట -Hyderabadకు అతిపెద్ద లోడ్ -30లక్షల Sputnik V డోసులు

|

దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి తగ్గుముఖం పట్టినా, మూడో వేవ్ తప్పదన్న హెచ్చరికల నడుమ వ్యాక్సిన్ల కొరత అందరినీ కలవరపెడుతున్నది. జాతీయ వ్యాక్సిన్ విధానంలో లోపాలను ఎత్తిచూపుతూ అటు సుప్రీంకోర్టు కేంద్రాన్ని తలంటగా, విదేశాల నుంచి సొంతగా టీకాలను దిగుమతి చేసుకోవాలనుకుంటోన్న రాష్ట్రలు సిండికేట్ గా ఏర్పడే దిశగా అడుగులు వేస్తుండటం వివాదాస్పదంగా మారింది. కేంద్రం లెక్కల ప్రకారం సోమవారం నాటికి దేశవ్యాప్తంగా 21.60కోట్ల డోసులను మాత్రమే పంపిణీ చేశారు.సరిగ్గా ఈ దశలో దేశానికి భారీ ఊరట కల్పిస్తూ, రష్యా తయారీ స్పుత్నిక్ వి వ్యాక్సిన్ల అతిపెద్ద లోడు హైదరాబాద్ లో ల్యాండైంది..

మోదీకి భారీ షాక్ :రాష్ట్రాల సిండికేట్ -వ్యాక్సిన్ల కోసం బీజేపీయేతర 11 సీఎంల ఐక్యత -విజయన్ సంచలన లేఖలుమోదీకి భారీ షాక్ :రాష్ట్రాల సిండికేట్ -వ్యాక్సిన్ల కోసం బీజేపీయేతర 11 సీఎంల ఐక్యత -విజయన్ సంచలన లేఖలు

షాక్: భారత్‌లో వ్యాక్సిన్‌పై తొలి ఫిర్యాదు -కొవిషీల్డ్‌తో యాంటీబాడీలు రాలేదు -సీరం, కేంద్రంపై చర్యలుంటాయా?షాక్: భారత్‌లో వ్యాక్సిన్‌పై తొలి ఫిర్యాదు -కొవిషీల్డ్‌తో యాంటీబాడీలు రాలేదు -సీరం, కేంద్రంపై చర్యలుంటాయా?

శంషాబాద్ పోర్టులో ల్యాండ్..

శంషాబాద్ పోర్టులో ల్యాండ్..

దేశంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సిన్‌ దిగుమతులకు శంషాబాద్ ఎయిర్ పోర్టులోని జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయిర్‌ కార్గో(జీహెచ్‌ఏసీ) వేదికైంది. రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వి టీకాలు మంగళవారం భారత్‌కు చేరుకున్నాయి. మూడో విడతలో మరో దాదాపు 30 లక్షల టీకా డోసులు దిగుమతయ్యాయి. రష్యా నుంచి ప్రత్యేక చార్టర్డ్ ఫ్రైటర్ ఆర్‌యూ-9450 ద్వారా బట్వాడా అయిన టీకాలు మంగళవారం తెల్లవారుజామున 3.43 గంటల ప్రాంతంలో జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయిర్‌ కార్గోకు చేరుకుంది..

రెడ్డీస్ ల్యాబ్‌కు తరలింపు..

రెడ్డీస్ ల్యాబ్‌కు తరలింపు..

ప్రత్యేక విమానంలో రష్యా నుంచి హైదరాబాద్ చేరిన స్పుత్నిక్ టీకాలను భారత్ లో భాగస్వామి అయిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కు తరలించారు. 90 నిమిషాల్లో దిగుమతి ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ టీకాలను డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ ప్రాంగణాలకు తీసుకెళ్లారు. రెడ్డీస్ ల్యాబ్, రష్యా మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం మేరకు ఇప్పటికే తొలి విడతలో 1.5లక్షల టీకాలు, రెండో విడతలో 60వేల డోసులను దిగుమతికాగా, మూడో విడతలో అతిపెద్ద కంటైన్మెంట్ గా 30 లక్షల డోసులు వచ్చాయి. నాలుగో విడతలో భాగంగా జూన్‌లో మరో 50లక్షల డోసులను పంపిస్తామని రష్యా ఇదివరకే వెల్లడించింది. ఇప్పటికే కంద్రం నుంచి అనుమతి లభించిన దరిమిలా జూన్‌ రెండోవారం నుంచి స్పుత్నిక్ వి టీకాల పంపిణీని ప్రారంభించనున్నారు.

 హైదరాబాద్ కేంద్రంగా టీకాల జోరు..

హైదరాబాద్ కేంద్రంగా టీకాల జోరు..

భారత్ ఇప్పటివరకు సీరం వారి కొవిషీల్డ్, భారత్ బయోటెక్ వారి కొవాగ్జిన్, రష్యా తయారీ స్పుత్నిక్ వి వ్యాక్సిన్లకు అనుమతినివ్వగా, ఇప్పటి వరకు దేశానికి వచ్చిన వ్యాక్సిన్ల అతిపెద్ద దిగుమతి ఇదే. రాబోయే రోజుల్లో హైదరాబాద్, చుట్టుపక్కల ఉన్న ప్రధాన ఫార్మా కంపెనీలు 3.5 బిలియన్ల డోసుల వివిధ రకాల కొవిడ్‌ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడం లేదా దిగుమతి చేసుకోనున్నాయి. వ్యాక్సిన్ల దిగుమతిని సజావుగా నిర్వహించేందుకు అన్ని వనరులను సమకూర్చుకుంటున్నట్లు జీహెచ్‌ఏసీ పేర్కొంది. ఎయిర్‌కార్గోలో టెంపరేచర్ కంట్రోల్డ్ మౌలిక సదుపాయాలను విస్తరిస్తున్నామని, టెర్మినల్ నుంచి విమానానికి సరుకులను సురక్షితంగా రవాణా చేయడానికి టెంపరేచర్ కంట్రోల్డ్ ‘కూల్ డాలీ'ను ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. దీని వల్ల ట్రక్కు ఆఫ్‌లోడింగ్ పాయింట్ నుంచి విమానం లోడింగ్ వరకు వ్యాక్సిన్లు, ఔషధాల ఎలాంటి ఆటంకాలూ లేని కోల్డ్ చెయిన్ సదుపాయాలను అందిస్తోంది.

English summary
The third and largest consignment of Russian Covid-19 vaccine Sputnik V landed in Hyderabad from Russia in the wee hours of Tuesday. The latest consignment comprises nearly 3 million doses of the Sputnik V as well as bulk substance that is meant for fill-finish at Panacea Biotec, sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X