వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జవాన్ల వల్లే దేశం.. దేశం వల్లే మనం: సైన్యానికి లతామంగేష్కర్‌ ‘భాయ్‌దూజ్‌’ శుభాకాంక్షలు

నేడు భాయ్‌దూజ్‌.. అంటే భగిని హస్త భోజనం అని అర్థం. దీపావళి రెండో రోజు జరుపుకునే ఈ పర్వదినాన అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ముల్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టి, వారు ఎల్లప్పుడూ బాగుండాలని పూజలు చేస్తుంటారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ముంబై: నేడు భాయ్‌దూజ్‌.. అంటే భగిని హస్త భోజనం అని అర్థం. దీపావళి రెండో రోజు జరుపుకునే ఈ పర్వదినాన అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ముల్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టి, వారు ఎల్లప్పుడూ బాగుండాలని పూజలు చేస్తుంటారు.

ఈ 'భాయ్‌దూజ్‌' పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ భారత జవాన్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఫేస్‌బుక్‌లో ప్రత్యేక వీడియో సందేశాన్ని ఆమె పోస్టు చేశారు.

'భారత జవాన్లకు నమస్కారం. 'భాయ్‌దూజ్‌' శుభాకాంక్షలు. నేనూ మీ సోదరిమణుల్లో ఒకరినే. మీరంటే నాకు చాలా గౌరవం. మన జవాన్లు ఎల్లప్పుడూ ఆనందంగా, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నా..' అని తెలిపారు.

అంతేకాదు, 'ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. జవాన్ల వల్లే ఈ భారతదేశం ఉంది. భారతదేశం వల్లే మనమంతా ఉన్నాం. ఇది నిజం. దేశం కోసం పోరాడుతున్న జవాన్లకు సెల్యూట్‌ చేస్తున్నాను. వారికి నాదో విన్నపం.. నా నుంచి ఏమైనా సాయం కావాల్సి వస్తే అడగండి, అందుకు నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను...' అని లతా మంగేష్కర్‌ తన ఫేస్ బుక్ వీడియోలో చెప్పారు.

English summary
Legendary singer Lata Mangeshkar has sent out a special video message for Indian soldiers to greet them ahead of the festival of Bhai Dooj. In the video, which she shared on Friday night on Twitter, Mangeshkar greeted the soldiers and said: "I salute the soldiers of our Indian Army. I am one of your sisters, who really respect you. It's a truth. India is because of its soldiers. And we are because of India." she added. The 88-year-old singer, who has sung scores of immortal patriotic songs in her singing career, also said she was always ready to do anything for the soldiers. This is not the first time the iconic singer has displayed her love for the soldiers. Last year the Bharat Ratna awardee had appealed to her fans celebrating her birthday to remember and donate for the brave Indian soldiers guarding the borders
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X