సీఎంతో సౌత్ ఇండియా సూపర్ స్టార్ సతీమణి లతా రజనీకాంత్ భేటీ, ఎందుకంటే !
చెన్నై: సౌత్ ఇండియా సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామితో భేటీ అయ్యారు. చెన్నైలోని తమిళనాడు సచివాలయంలో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, లతా రజనీకాంత్ భేటీ అయ్యి చాల సమయం చర్చించారు.
అయోధ్య తీర్పు: సోషల్ మీడియాలో ఫ్రీ అని పాటుపడితే నో వార్నింగ్, నో వారెంట్, డైరెక్టుగా జైలే!
సీఎం ఎడప్పాడి పళనిస్వామితో భేటీ తరువాత ఆ విషయంపై లతా రజనీకాంత్ ట్విట్టర్ లో స్పంధించారు. తమిళనాడు రాష్ట్ర స్థాయిలో పిల్లల కోసం ఓ ప్రత్యేక కమిటీ వెయ్యాలని సీఎం ఎడప్పాడి పళనిస్వామికి తాను మనవి చేశానని లతా రజనీకాంత్ వివరించారు.

పిల్లలను అన్ని విధాలుగా కాపాడడంలో తమిళనాడు, తమిళ ప్రజలు ఇతర రాష్ట్రాలకు, దేశానికి ఆదర్శంగా ఉండాలని, ఈ విషయంపై ప్రభుత్వం సహకరించాలని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి తాను మనవి చేశానని లతా రజనీకాంత్ సోషల్ మీడియాలో వివరించారు.
మొండి మొగుడు పెంకి పెళ్లాం: పాడు పంచాయితీ, అక్కడ కాపురం, ఇక్కడ విడాకులా, పవార్!
పిల్లల కోసం ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కమిటీ వేస్తామని సీఎం ఎడప్పాడి పళనిస్వామి హామీ ఇచ్చారని, తప్పకుండా ప్రభుత్వంతో కలిసి తాము పిల్లలకు సేవ చెయ్యడానికి అన్ని విధాలుగా సిద్దంగా ఉంటామని లతా రజనీకాంత్ వివరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, లతా రజనీకాంత్ భేటీకి ప్రాధాన్యత సంచరించుకుంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!