వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా బారినపడిన కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ కరోనా బారినపడ్డారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆయనే ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. నిబంధనల ప్రకారం ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు.

ఇటీవల కాలంలో తనను కలిసిన వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని కోరారు లవ్ అగర్వాల్. కరోనాతో విధించిన లాక్‌డౌన్ సమయంలో దేశ వ్యాప్తంగా కరోనా పరిస్థితి, కేంద్రం తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై ఆయన తరచూ మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే.

ఇది ఇలావుండగా, హోంమంత్రి అమిల్ షా ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా, తాను కరోనా నుంచి కోలుకున్నట్లు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు.

Lav Agarwal, Union Health Ministry Joint Secretary, Tests Positive for Corona

అయితే, వైద్యుల సలహా మేరకు మరికొన్ని రోజులపాటు హోం ఐసోలేషన్‌లో హోం ఐసోలేషన్‌లో ఉండనున్నట్లు అమిత్ షా చెప్పారు. దేవుడి తయతో తాను కోలుకున్నట్లు తెలిపారు. తాను ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. తనకు వైద్యం అందించిన మేదాంత ఆస్పత్రి వైద్యులు, వైద్య సిబ్బందికి కేంద్రమంత్రి అమిత్ షా కృతజ్ఞతలు తెలిపారు. ఆగస్టు 2న తనకు కరోనా సోకినట్లు అమిత్ షా స్వయంగా వెల్లడించారు.

దేశంలోని పలువురు ప్రముఖులు కూడా కరోనా బారినపడ్డారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, తమిళనాడు గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్, కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప తోపాటు పలువురు సీనియర్ నాయకులు కరోనా బారినపడ్డారు. శివరాజ్ సింగ్, యడ్యూరప్ప ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నారు.

కాగా, దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 24,83,567 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 6,64,033 యాక్టివ్ కేసులున్నాయి. 17,70,682 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా బారిన పడి ఇప్పటి వరకు 48,367 మంది మరణించారు.

English summary
Union Health Ministry Joint Secretary Lav Agarwal has tested positive for the novel coronavirus infection.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X