వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమిలి ఎన్నికలు సాధ్యం కాదు: తేల్చిచెప్పిన లాకమిషన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలు సాధ్యం కాదని లా కమిషన్ తేల్చి చెప్పింది. లోకసభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిపై లా కమిషన్‌ గురువారం స్పష్టతనిచ్చింది. జమిలి ఆలోచన మంచిదే కానీ, మన రాజ్యాంగానికి లోబడి అది సాధ్యం కాదని చెప్పింది.

దీనిపై లోతుగా చర్చించాలని, రాజ్యాంగ నిపుణుల సమక్షంలో నిర్ణయాలు తీసుకోవాలని అభిప్రాయపడింది. జమిలి ఎన్నికలపై తయారు చేసిన డ్రాఫ్టును గురువారం లాకమిషన్‌ కేంద్రానికి సమర్పించింది. ఎన్నికల నిర్వహణ, సెక్యూరిటీపరమైన అంశాలకు సంబంధించి ఇది సాధ్యం కాదని చెప్పింది.

Law Commission endorses proposal for simultaneous Lok Sabha, assembly polls

లా కమిషన్‌ ముసాయిదా ప్రకారం జమిలి ఎన్నికల ప్రతిపాదన కేవలం ప్రభుత్వానికి సంబంధించిన అంశం మాత్రమే కాదని, ఇందులో అందరి అభిప్రాయాలు సేకరించాలని, దీనిపై తుది నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రభుత్వం అందరికీ సమాధానం చెప్పుకునేదిగా ఉండాలని, జమిలి ఎన్నికల ఆలోచన చాలా మంచిదని, దీని వల్ల ప్రజాధనం ఆదా అవుతుందని, పరిపాలనా వ్యవస్థ మీద భారం తగ్గుతుందని, కానీ ఒకేసారి ఎన్నికలు జరిపితే భద్రతాపరమైన చిక్కులను ఎదుర్కోవాల్సి వస్తుందని, మన రాజ్యాంగ పరిమితులకు లోబడి జమిలి అసాధ్యమి చెప్పింది.

English summary
In its draft report submitted to the government, the Law Commission has endorsed simultaneous elections to Lok Sabha and state assemblies. Recommending changes in the Constitution and the electoral law to hold simultaneous polls, the panel said that it can prevent the country from being in constant election mode.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X