కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎఫెక్ట్ : కడప జేసీపై బదిలీవేటు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ఎన్నికల నియామవళి ఉల్లంఘిస్తోన్న వారిపై ఎన్నికల సంఘం కొరడా ఝులిపిస్తోంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా కఠిన చర్యలు తీసుకుంటుంది. నేతలే కాదు అధికారులపై కూడా కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా కడప జిల్లా జాయింట్ కలెక్టర్‌పై బదిలీ వేటు వేసింది.

laxmis ntr effect .. kadapa jc transfer

కడపలో మాత్రం ప్రదర్శన
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం నిషేధించింది. అయితే కడపలోని కొన్ని థియేటర్లలో సినిమా ప్రదర్శించారు. దీంతో ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా థియేటర్లలో మూవీ రిలీజైతే ఏం చేస్తున్నారని జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావును ప్రశ్నించింది. దానికి జేసీ ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని ఈసీ ... ఆయనను బదిలీ చేసింది. అంతేకాదు ఎన్నికల విధులకు కూడా దూరంగా ఉంచాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు కూడా జారీచేసింది.

ఆది నుంచి కాంట్రవర్సీ
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీని తెరకెక్కించాడు. ఈ మూవీ తొలి నుంచే కాంట్రవర్సీ అయ్యింది. ఈ క్రమంలో కొందరు కోర్టును ఆశ్రయించగా సినిమా విడుదల నిలిపివేయాలని స్పష్టంచేసింది. అయితే ఏపీ మినహా దేశవ్యాప్తంగా విడుదలకు తెలంగాణ హైకోర్టు అనుమతిచ్చింది. ఏపీలో మాత్రం హైకోర్టు విడుదలకు అంగీకరించలేదు. దీంతో వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో కడపలోని థియేటర్లలో సినిమా విడుదలవడం సంచలనం సృష్టించింది. దీనిపై స్పందించిన ఈసీ నివేదిక ఇవ్వాలని కోరింది. ఈ మేరకు జేసీపై చర్యలు తీసుకుంది.

వర్మ తరహాలో ..
లక్ష్మీఎస్ ఎన్టీఆర్ సినిమాలో వర్మ ఉన్నది ఉన్నట్టు చూపించాడని .. చంద్రబాబుకు వ్యతిరేకంగా తెరకెక్కించాడని సినిమాను ఏపీ సర్కార్ నిలిపివేసింది. దీంతో కోర్టులకెళ్లడం ... ఏపీలో మాత్రం విడుదలకు లైన్ క్లియర్ కాలేదు. ఈ క్రమంలోనే కడపలో సినిమా విడుదలై .. ఎన్నికల్లో ప్రభావం చూపస్తోందనే కారణంతో ధియేటర్లు పర్యవేక్షించాల్సిన జేసీ నిర్లక్ష్యం ఉందని నిర్ధారణకు వచ్చి చర్యలు తీసుకున్నారు.

English summary
The Election Commission has been whipping up the violators of the election campaign. It takes strenuous action without the difference between small and big. Not only leaders but also strict officers. Recently Kadapa Joint Collector has been transferred.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X