వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాఫ్ట్ వేర్ అల్లుడా?.. వద్దు బాబోయ్: కాలం మారింది.. ఐటీ 'కళ' చెదిరింది

2017ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఆయా మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా కుదిరిన వివాహ బంధాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది.

|
Google Oneindia TeluguNews

ముంబై: ఒకప్పుడు ఐటీ ఎంత వెలుగు వెలిగిందో.. ఇప్పుడంత నేల చూపులు చూస్తోంది. లక్షల్లో జీతాలు, హైఫై లైఫ్.. సాఫ్ట్ వేర్ జాబ్ అంటే చాలు.. పిల్లనివ్వడానికి అమ్మాయిల తల్లిదండ్రులు పోటీ పడేవారు. కానీ కాలం మారింది. పరిస్థితుల్లో వేగంగా మార్పు వచ్చింది. పిల్లనివ్వడానికి ఎగబడ్డ తల్లిదండ్రులే.. ఇప్పుడు సాఫ్ట్ వేర్ అల్లుడా? మాకొద్దు బాబోయ్ అంటూ వెనుకడగు వేస్తున్నారు.

2017ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఆయా మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా కుదిరిన వివాహ బంధాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. చాలావరకు అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు సాఫ్ట్ వేర్ అబ్బాయిలను మరో ఆలోచన లేకుండా వద్దని చెప్పేశారట. ఎప్పుడు ఊడుతుందో తెలియని ఉద్యోగం.. ఆటోమేషన్ ప్రభావం, విదేశాల్లో వీసాల గొడవలు.. ఇదంతా ఎందుకొచ్చిన గొడవ అనుకుంటున్నారట అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు.

డిమాండే లేకుండా పోయింది:

డిమాండే లేకుండా పోయింది:

ఇలాంటి పరిస్థితుల్లో మ్యాట్రిమోనియల్ మార్కెట్లో సాఫ్ట్ వేర్ అల్లుళ్లకు బొత్తిగా డిమాండే లేకుండా పోయిందంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. సాఫ్ట్ వేర్ అబ్బాయిల కంటే సివిల్స్ ఉద్యోగాలు చేసేవారిని, డాక్టర్లను, బిజినెస్ మెన్ లను పెళ్లి చేసుకోవడానికే అటు అమ్మాయిలూ మొగ్గుచూపుతున్నారట.

ఐటీ అంటే చాలు.. అమ్మాయిలు 'నో'

ఐటీ అంటే చాలు.. అమ్మాయిలు 'నో'

ఐటీ ప్రొఫెషనల్స్ అంటే చాలు.. జస్ట్ 'నో' చెప్పి పక్కనపెట్టేస్టున్నారట అమ్మాయిలు. షాదీ.కామ్ సీఈవో గౌరవ్ రక్షిత్ తాజాగా ఇదే విషయాన్ని వెల్లడించారు. ఐటీతో పాటు, ఎన్నారై సంబంధాల పట్ల మోజు తగ్గిపోయిందని, అటువంటి సంబంధాల విషయంలో ఎక్కువశాతం మంది వెనుకడుగే వేస్తున్నారని అంటున్నారు. గతేడాది నవంబర్ నుంచి ఐటీ ఉద్యోగులకు మ్యాట్రిమోనియల్ మార్కెట్లో అసలు డిమాండే లేకుండా పోయిందన్నారు.

పెళ్లి కాని ప్రసాదులేనా?:

పెళ్లి కాని ప్రసాదులేనా?:

గతేడాది నవంబర్ లో 11శాతం మేర ఐటీ ప్రొఫెషనల్స్ కు డిమాండ్ తగ్గిపోగా.. ఇప్పుడది 15శాతానికి చేరుకుందని, దీంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు పెళ్లంటేనే భయపడాల్సిన పరిస్థితి తలెత్తుందని పరిశీలకులు చెబుతున్నారు. జీవన్‌సాథి.కామ్ లో కూడా ఇదే తరహా ట్రెండ్ కొనసాగుతుందని సమాచారం. మొత్తం మీద సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఇక పెళ్లి కాని ప్రసాదులు అని పిలిపించుకోవాల్సిన సందర్భం వచ్చిందేమో!

ఐటీ ఉద్యోగం.. గాల్లో దీపంలా?:

ఐటీ ఉద్యోగం.. గాల్లో దీపంలా?:

ఐటీ సంస్థలు సైతం ఉద్యోగాల కోత పెడుతుండటం.. విదేశాల్లోను అక్కడివారికే ప్రాధాన్యం ఇవ్వడంతో.. ఐటీ జీవులు విలవిల్లాడుతున్నారు. ఒకవేళ ఉద్యోగాల్లో కొనసాగినా.. జీతం పెరగక, ప్రమోషన్లు లేక ఎదుగు బొదుగూ లేని జీవితంలా మారిపోయే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇక స్కిల్స్ విషయంలో తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగించేందుకు సంస్థలు ఏమాత్రం వెనుకాడం లేదు. దీంతో ఐటీలో ఉద్యోగమంటే గాల్లో దీపం లాగే తయారైంది పరిస్థితి.

English summary
ITengineers, once hot property in the marriage market, are no longer such a prize catch, going by matrimonial website trends and even traditional matchmakers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X