Leader: అధికార పార్టీ లీడర్ ఆత్మహత్య, భార్యకు నోటీసులు, ప్రియురాలు, భార్య ఆడియో వైరల్, ఏం జరిగిదంటే !
బెంగళూరు/తిరుపతి: ఐటీ హబ్ బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ లీడర్ అనంతరాజు ఆత్మహత్య కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. అనంతరాజు ఆమె ఫేస్ బుక్ ప్రియురాలితో అక్రమ సంబందం పెట్టుకుని ఆమె టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని అనంతరాజు భార్య, కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే బీజేపీ లీడర్ ను అతని భార్య సుమా టార్చర్ పెట్టడం వలనే ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు రావడం కలకలం రేపింది. ఇదే సమయంలో అనంతరాజు భార్య సుమా, అతని ప్రియురాలు అంటున్న రేఖా మాట్లాడుకున్న ఆడియో క్లిప్పింగ్ బయటకు రావడంతో కలకలం రేపింది. ఇప్పటికే కేసు విచారణ చేస్తున్న పోలీసులు బీజేపీ లీడర్ భార్యకు నోటీసులు ఇచ్చి విచారణ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. ఆనంతరాజు ఆత్మహత్య చేసుకునే ముందు 40 రోజులు ఇంటి నుంచి బయటకురాలేదని, ఎవ్వరి ఫోన్ కాల్స్ కూడా రిసీవ్ చెయ్యలేదని, ఎవ్వరినీ కలవలేదని వెలుగు చూడటంతో కథ కొత్త మలుపుతిరిగింది.

బీజేపీ లీడర్ ఆత్మహత్య
ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని బ్యాడరహళ్ళిలో నివాసం ఉంటున్న బీజేపీ నాయకుడు అనంతరాజు (46) ఈనెల 12వ తేదీన ఆయన నివాసం ఉంటున్న ఇంటిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన అనంతరాజు ఆత్మహత్య చేసుకోవడంతో సొంతపార్టీ నేతలు షాక్ అయ్యారు. అనంతరాజు పూర్వికులు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు అని స్థానికలు అంటున్నారు.

ప్రియురాలు టార్చర్ పెట్టిందని ఫ్యామిలీ ఆరోపణలు
బీజేపీ
నాయకుడు
అనంతరాజుకు
ఫేస్
బుక్
లో
పరిచయం
అయిన
బెంగళూరులోని
కేఆర్
పురం
నివాసి
రేఖాతో
అక్రమ
సంబంధం
ఉందని
ఆరోపణలు
ఉన్నాయి.
రేఖా,
అనంతరాజు
ఏకాంతంగా
ఉన్న
సమయంలో
వీడియోలు
తీశారని,
ఆ
వీడియోలు
అడ్డంపెట్టుకుని
రేఖా,
ఆమె
భర్త,
మరో
మహిళ
బ్లాక్
మెయిల్
చేశారని,
అందుకే
అనంతరాజు
ఆత్మహత్య
చేసుకున్నాడని
ఆయన
కుటుంబ
సభ్యులు
ఆరోపిస్తున్నారు.

భార్య సుమా, రేఖాల ఆడియో వైరల్
బీజేపీ లీడర్ అనంతరాజు ఆత్మహత్య కేసులో కేఆర్ పురం నివాసి రేఖాను పోలీసులు విచారణ చేసి వివరాలు సేకరించారు. ఇదే సమయంలో అనంతరాజు భార్య సుమా, రేఖాలు ఇటీవల మొబైల్ ఫోన్ లో మాట్లాడుకున్న సమయంలో రికార్డు అయిన ఆడియో క్లిప్పింగ్ బయటకు రావడం కలకలం రేపింది.

ఏం మాట్లాడుకున్నారంటే ?
నీ భర్త అనంతరాజు అమాయకుడని, తప్పు అంతా నాదే అని, నువ్వు అంటే ఆయనకు ప్రాణం అని రేఖా సుమాకు చెప్పినట్లు ఆడియో క్లిప్పింగ్ ఉంది. నా భర్త అనంతరాజుకు ఇంట్లోనే నరకం చూపించి అతను ఆత్మహత్య చేసుకునేలా చేస్తానని, నిన్నుకూడా సామన్యంగా వదిలిపెట్టనని, నీ అంతు చూస్తానని సుమా రేఖాకు వార్నింగ్ ఇచ్చిందని ఆడియోలో ఉందని ఆరోపణలు ఉన్నాయి.

40 రోజులు బయటకురాలేదు
ఆడియో
క్లిప్
ను
ఇప్పటికే
ఫోరెన్సిక్
ల్యాబ్
కు
పంపించామని
అనంతరాజు
ఆత్మహత్య
కేసు
విచారణ
చేస్తున్న
పోలీసు
అధికారులు
అంటున్నారు.
బీజేపీ
లీడర్
అనంతరాజు
ఆత్మహత్య
చేసుకునే
ముందు
40
రోజులు
ఇంటి
నుంచి
బయటకురాలేదని,
ఎవ్వరి
ఫోన్
కాల్స్
కూడా
రిసీవ్
చెయ్యలేదని,
ఎవ్వరినీ
కలవలేదని
పోలీసుల
విచారణలో
వెలుగు
చూసింది.

బీజేపీ లీడర్ భార్య సుమా విచారణ
కేసు విచారణ చేస్తున్న పోలీసులు బీజేపీ లీడర్ భార్యకు నోటీసులు ఇచ్చి విచారణ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. బ్యాడరహళ్లి పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ రవికుమార్ ముందు హాజరైన అనంతరాజు భార్య సుమా పోలీసు అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిందని తెలిసింది. బీజేపీ లీడర్ అనంతరాజు ఆత్మహత్యకు ఆయన ప్రియురాలు రేఖా కారణమా ?, భార్య సుమా కారణమా ? అనే విషయాలు పోలీసుల విచారణలో వెలుగు చూస్తుందని ఆయన సన్నిహితులు అంటున్నారు.