గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెన్నై ఎక్స్‌ప్రెస్ దోపిడీ: స్టూవర్ట్‌పురం గ్యాంగ్ పనే?

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: చెన్నై ఎక్స్‌ప్రెస్ రైలు దోపిడీ కేసులో పోలీసులు ముందడుగు వేశారు. రైలులో దోపిడీకి పాల్పడింది స్టువర్డుపురం గ్యాంగ్‌గా పోలీసులు నిర్దారించినట్లు వార్తలు వస్తున్నాయి. రైలులో దొంగతనం అనంతరం బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించిన రైల్వే పోలీసులు సెల్ సిగ్నల్ ఆధారంగా నిందితులను గుర్తించినట్లు తెలుస్తోంది.

దోపిడీ గ్యాంగ్ నిడుబ్రోలులో ప్రయాణికుల్లాగా రైలు ఎక్కినట్లు పోలీసులు తెలిపారు. గ్యాంగ్‌లో మహిళ, ఐదుగురు పురుషులు ఉన్నారు. ఓ మహిళా ప్రయాణికురాలు వద్ద నుంచి దోపిడీ చేసిన సెల్ నుంచి పిడుగురాళ్లలో గ్యాంగ్ పలువురికి ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీని ఆధారంగానే పోలీసులు విచారణ జరిపి దోపిడీకి పాల్పడింది స్టువర్డుపురం గ్యాంగ్‌గా నిర్దారించారు.

Leads in Chennai Express robbery

మరో రెండు రోజుల్లో నిందితులను అదుపులోకి తీసుకునేందుకు రైల్వే పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మంగళవారంనాడు చెన్నై ఎక్స్‌ప్రెస్‌లోని ఆరు బోగీల్లో దోపిడీ పాల్పడిన దుండగులు భారీగా నగదును అపహరించిన విషయం తెసిందే.

గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ సమీపంలోని తుమ్మల చెరువు వద్ద చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ దోపిడీ జరిగింది. ఈ ఘటన ఈ రోజు తెల్లవారుజామున 2.10గంటల సమయంలో జరిగింది. రైల్లో ప్రయాణిస్తున్న సుమారు 10 మంది దుండగులు తుమ్మలచెరువు వద్ద చైన్ లాగి రైలుని నిలిపి వేసి దోపిడీకి పాల్పడ్డారు.

English summary
It is said police have come into a conclusion that Stuvartupuram gang has robbed the Chennai Express train in Guntur district
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X