వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్ఎస్ఎస్‌ను చూసి నేర్చుకొండి.. పార్టీ శ్రేణులకు పవార్ సూచన..

|
Google Oneindia TeluguNews

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవంపై పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్న ఎన్సీపీ పనిలో పనిగా భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఏడాది చివరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మరోసారి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

అసెంబ్లీ ఎన్నికల కోసం శక్తివంచన లేకుండా కృషి చేయాలన్న శరద్ పవార్ పార్టీ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డాలని సూచించారు. ఇందులో భాగంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అనుసరిస్తున్న విధానాలను అనుసరించాలని అన్నారు. దీనికి సంబంధించి ఓ బీజేపీ నేత తనతో పంచుకున్న విషయాలను పవార్ గుర్తు చేసుకున్నారు.

Learn from RSS : Sharad Pawar tells NCP workers

"ఎన్సీపీ కార్యకర్తలు ఓటర్ల దగ్గరకు వెళ్లినప్పుడు ఇంట్లో ఎవరు లేకపోతే పాంప్లెట్‌ను అక్కడ వదిలేసి వెళ్లిపోతారు. అదే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఒకవేళ ఓటర్లు ఇంట్లో లేకపోతే సాయంత్రం వెళ్తారని, అప్పుడు కలవకపోతే మరుసటి రోజు వెళ్తారు. అలా వాళ్లను కలిసే వరకు ఆ ఇంటికి వెళ్తూనే ఉంటార"ని బీజేపీ నేత చెప్పినట్లు శరద్ పవార్ పార్టీ శ్రేణులతో అన్నారు.

ఆర్ఎస్ఎస్ నుంచి అన్ని విషయాలు నేర్చుకోమని తాను అనడం లేదని శరద్ పవార్ అన్నారు. కానీ ఓటర్లను కలిసే విషయంలో మాత్రం ఆర్ఎస్ఎస్ చూపే నిబద్ధత పట్టుదలను చూపాలని సూచించారు.

Learn from RSS : Sharad Pawar tells NCP workers

ప్రధాని కేదార్‌నాథ్ పర్యటనకు వెళ్లడంపై శరద్ పవార్ మండిపడ్డారు. టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందిన తర్వాత కూడా ప్రధాని గుహల్లోకి వెళ్లి ధ్యానం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని ప్రమాణస్వీకారానికి హాజరుకాకపోవడంపై స్పందించిన పవార్ తనకు ఐదో వరుసలో సీటు కేటాయించినందునే ఆ కార్యక్రమానికి హాజరుకాలేదని చెప్పారు.

రంగంలోకి ఆర్ఎస్ఎస్.. రాజ్‌నాథ్‌కు పెరిగిన ప్రాధాన్యంరంగంలోకి ఆర్ఎస్ఎస్.. రాజ్‌నాథ్‌కు పెరిగిన ప్రాధాన్యం

English summary
NCP Chief Sharad Pawar asked his party cadre to learn from RSS swayamsevaks. Sharad Pawar said that NCP workers could learn persistence, patience and consistency from RSS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X