వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిజిటల్ మీడియాను మొదట కట్టడి చేయండి, లేదంటే మాకు వదిలేయండి: సుప్రీంలో కేంద్రం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: డిజిటల్ మీడియా "పూర్తిగా అనియంత్రితమైనది", విషపూరిత ద్వేషం, హింసను వ్యాప్తి చేయడమే కాకుండా ప్రజల ఖ్యాతిని తీవ్రంగా దెబ్బతీస్తోందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సమర్పించింది.డిజిటల్ మీడియా నిబంధనలు కూడా చట్ట సభలు పరిశీలించాల్సిన అంశమని తెలిపారు.

ముందు డిజిటల్ మీడియాను కట్టడి చేయాలి..

ముందు డిజిటల్ మీడియాను కట్టడి చేయాలి..


ఒకవేళ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటి మీడియాకు మార్గదర్శకాలను రూపొందించాలనుకుంటే.. మొదట వెబ్ బేస్డ్ డిజిటల్ మీడియా కట్టడికి రూపొందించాలని సుప్రీంకోర్టుకు కేంద్రం తన అఫిడవిట్ లో పేర్కొంది.
లేదంటే ఈ సమస్యను ప్రభుత్వానికి వదిలేయాలని కోర్టుకు సూచించింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాపై, అంతకంటే ముందు డిజిటల్ మీడియా నియంత్రణకు మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఇలాంటి కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న బ్రాడ్‌కాస్టర్, పబ్లిషర్ నిఘా పరిధిలోకి వచ్చినప్పుడు.. అంతకుమించి ఉల్లంఘనలకు పాల్పడుతున్న డిజిటల్ మీడియా నియంత్రణకు మొదట చర్యలు తీసుకోవాలని కేంద్రం తన అఫిడవిట్‌లో పేర్కొంది.

ప్రస్తుతం ఉన్న చట్టాలు వీటికి చాలు..

ప్రస్తుతం ఉన్న చట్టాలు వీటికి చాలు..

సివిల్ సర్వీసులలో ముస్లింలు అనే కార్యక్రమాన్ని ప్రసారం చేసిన సుదర్శన్ టీవీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వెంటనే ఆ కార్యక్రమాన్ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు సందర్భంగానే కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఏం చేస్తుందని ప్రశ్నించింది. అంతేగాక, మీడియాపై కేంద్రం నిఘా ఉందా? అని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టుకు కేంద్రం ఈ మేరకు వివరణ ఇచ్చింది. ప్రస్తుతానికి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాను నియంత్రించేందుకు, స్వీయ నియంత్రణ విధానం కోసం కొత్త మార్గదర్శకాలు ఏమీ అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పుడున్న నిబంధనలు అమలు చేస్తే సరిపోతుందని తెలిపింది. జాతీయ భద్రతా గురించిన అంశాలను పరిగణలోకి తీసుకుని హోంమంత్రిత్వశాఖ పరిశీలన అనంతరమే కేంద్ర ప్రభుత్వం ఒక న్యూస్ ఛానల్‌‌కు అనుమతిస్తుందని తెలిపింది.

చట్ట సభలకు వదిలేయండి..

చట్ట సభలకు వదిలేయండి..


ప్రస్తుతం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలను నియంత్రించేందుకు స్వల్ప మొత్తం జరిమానా సరిపోతుందని కేంద్రం అభిప్రాయపడింది. కోర్టులు ఈ అంశాన్ని వదిలివేస్తే.. చట్టసభలు నియంత్రణ చర్యలకు ఉపక్రమిస్తాయని తెలిపింది.
డిజిటల్ మీడియాను కూడా క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. ఇప్పటి వరకు వీటిపై తగిన నియంత్రణలేకపోవడాన్ని కీలకంగా ప్రస్తావించింది.

Recommended Video

Rakul Preet Singh Plea : ప్రసారభారతికి, ప్రెస్‌ కౌన్సిల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు!! || Oneindia
వెబ్ ఆధారిత డిజిటల్ మీడియా నియంత్రణే కీలకం..

వెబ్ ఆధారిత డిజిటల్ మీడియా నియంత్రణే కీలకం..


ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు తరచూ వాటి సరిహద్దులను దాటి నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాయి. వీటిపై కోర్టులు తరచూ కలుగజేసేకోవాల్సి ఉంటుంది. వెబ్ ఆధారిత డిజిటల్ మీడియాను మాత్రం క్రమబద్ధీకరించడం జరగలేదు.
ఎలక్ట్రానిక్ మీడియా ఎయిర్ వేవ్స్ ఉపయోగిస్తుందని, ఇది ప్రజా ఆస్తి, అందువల్ల అన్ని సహేతుకమైన ఆంక్షలకు బాధ్యత వహిస్తుందని గతంలో విచారణ సమయంలో గమనించిన బెంచ్ యొక్క సమస్యలను పరిష్కరించడానికి కూడా అఫిడవిట్ కోరింది. వెబ్ ఆధారిత డిజిటల్ మీడియా లక్షల సంఖ్యలో ఉన్నాయని, వాటి కట్టడి చేయడం అవసరమని పేర్కొంది.

English summary
Digital media is "completely uncontrolled" and is rampantly tarnishing reputations of people apart from spreading venomous hatred and violence, the central government has submitted in the Supreme Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X