వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్థాన్, బంగ్లాదేశ్ చొరబాటుదారులను తరిమేయండి: మహారాష్ట్రలో పోస్టర్, రాజ్ థాకరే, అమిత్ ఫొటోలు..

|
Google Oneindia TeluguNews

పౌరసత్వ సవరణ చట్టానికి మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) మద్దతు ప్రకటించగా మహారాష్ట్రలో కొత్త పోస్టర్లు వెలిశాయి. దేశం నుంచి పాకిస్థాన్, బంగ్లాదేశీయులను తరిమివేయాలని అందులో రాశారు. అయితే పోస్టర్‌పై ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ థాకరేతోపాటు ఆయన కుమారుడు అమిత్ థాకరే ఫోటోలు కూడా ఉండటం విశేషం.

పోస్టర్ కలకలం

పోస్టర్ కలకలం


మహారాష్ట్రలోని రాయిఘడ్ జిల్లా పన్వెల్ ప్రాంతంలో పోస్టర్లు కనిపించాయి. ‘బంగ్లాదేశీయులు దేశం విడిచి వెళ్లాలని, లేదంటే ఎమ్మెన్నెస్ శైలిలో తామే దేశం నుంచి పంపిస్తామని పోస్టర్‌లో‌' పేర్కొన్నారు. ఆ పోస్టర్ స్థానికంగా చర్చకు దారితీసింది. పోస్టర్ ఎవరూ వేసిందో తెలియరాలేదు.. కానీ రాజ్ థాకరే అమిత్ థాకరే ఫోటోలు ఉండటంతో ఎమ్మెన్నెస్ మద్దతుదారుల పని అని భావన వ్యక్తమవుతోంది.

పార్టీ జెండా ఆవిష్కరణ

పార్టీ జెండా ఆవిష్కరణ


గత గురువారం ఎమ్మెన్నెస్ పార్టీ జెండాను రాజ్ థాకరే ఆవిష్కరించారు. కాషాయ రంగులో ఉన్న పార్టీ జెండాకు శివాజీ కాలంలో ఉపయోగించిన రాజముద్రను వాడతామని రాజ్ థాకరే ప్రకటించారు. సీఏఏ, ఎన్ఆర్సీకి అనుకూలంగా ఈ నెల 9వ తేదీన నిరసన ప్రదర్శన చేపడుతామని పేర్కొన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చినవారికి వ్యతిరేకంగా ఆందోళన చేపడుతామని తెలిపారు. ఈ క్రమంలో పన్వెల్‌లో పోస్టర్ వెలియడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అభివృద్ధి కోసం

అభివృద్ధి కోసం

2006లో రాజ్‌థాకరే ఎమ్మెన్నెస్ పార్టీని స్థాపించారు. ముంబై మహా రాష్టీయులకే చెందాలనే ప్రాంతీయ నినాదంతో పార్టీని స్థాపించారు. తొలుత పార్టీ జెండాలో కాషాయం, నీలం, ఆకుపచ్చ రంగులు ఉండేవి. దాని స్థానంలో కాషాయం, శివాజీ మహారాజ రాజముద్రను ముదించారు. కాషాయం, నీలం, ఆకుపచ్చ రంగులు అంటే హిందువులు, దళితులు, ముస్లింల ప్రతీక.. మహారాష్ట్ర అభివృద్ధి కోసమే ఎమ్మెన్నెస్ ఆవిర్భవించింది.

అనుకూలం

అనుకూలం


దేశవ్యాప్తంగా సీఏఏకు వ్యతిరేకంగా ఉద్యమిస్తోన్న సమయంలో ఎమ్మెన్నెస్ తాము అనుకూలమని ఆందోళన చేయడానికి సిద్ధమవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతు ఇస్తూ.. ముందడుగు వేస్తోంది.

English summary
Maharashtra Navnirman Sena chief Raj Thackeray declared his support to the Narendra Modi government over eviction of Bangladeshi and Pakistani infiltrators.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X