• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇక జస్టిస్ రమణ చేతికి న్యాయ దండం -బాగా పనిచేశా, సంతృప్తిగా పదవీ విరమణ: జస్టిస్ బోబ్డే భావోద్వేగం

|

''భారత సర్వోన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా నా వంతు కృషి చేశాను. ఇప్పుడు పరిపూర్ణ సంతృప్తితో పదవీ విరమణ చేస్తున్నాను. జడ్జిగా 21 ఏళ్ల సుదీర్ఘ అనుభవం నాది. ఆనందం, సద్భావన నాకు బాగా ఇష్టమైన జ్ఞాపకాలు. గతంలో చాలా సార్లు సెర్మోనియల్ బెంచ్ లో సభ్యుడగా ఉన్నాను కానీ చివరి రోజున నాలో మిశ్రమ భావాలున్నందున విషయాలను స్పష్టంగా చెప్పలేకపోతున్నా..'' అంటూ భావోద్వేగానికి గురయ్యారు చీఫ్ జస్టిస్ బోబ్డే.

కరోనా విలయం: సుప్రీం సంచలనం -దేశంలో ఎమర్జెన్సీ -మోదీ సర్కారుకు ప్రణాళిక ఉందా? పూర్తి లాక్‌డౌన్?

కరోనా విలయం: ఎన్నికలు యథాతథం -కేసీఆర్ సర్కారు పట్టు, ఎస్ఈసీ ప్రకటన -రద్దుకు హైకోర్టు నో చెప్పడంతో

సీజేఐ బోబ్డే పదవీ విరమణ

సీజేఐ బోబ్డే పదవీ విరమణ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డే శుక్రవారం పదవీ విరమణ చేశారు. వీడ్కోలు సభను నిరాడంబరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ బోబ్డే భావోద్వేగ ప్రసంగం చేయగా, కరోనా వేళ సీజేఐగా ఆయన తలపెట్టిన పనులు అమోఘమంటూ ప్రభుత్వ న్యాయ అధికారులు ప్రశంసించారు.

వర్చువల్ విచారణలో వింతలు..

వర్చువల్ విచారణలో వింతలు..

‘‘న్యాయం కోసం నిబద్ధతతో పనిచేయాలనే సంకల్పంతో నేను బార్ నుంచి బయలుదేరాను. కోర్టులో న్యాయమూర్తిగా చాలా సంతోషించాను. అద్బుతమైన వాదనలు, ఆకట్టుకునే ప్రదర్శనలు, లాయర్లు, న్యాయ అధికారుల మంచి ప్రవర్తన చూశాను. కరోనా కాలంలో వర్చువల్ గా చేపట్టిన విచారణల్లో కొన్ని గమ్మత్తు విషయాలు గమనించాను. జడ్జిలు, లాయర్లు తమ ఇళ్లలో కూర్చొని వాదించేటప్పుడు వారి వెనకాలే గోడలపై వేలాడే పెయింటింగ్స్, బొమ్మలు, శిలలు, కొన్ని సార్లు తుపాకులు, గన్స్ కూడా కనిపించేవి. సొలిసిటర్ జనరల్ మెహతా కూర్చునే చోట పెయింట్ ఇప్పుడు తొలగించినట్లుగానూ నేను గుర్తించాను. ఏది ఏమైనా సీజేఐగా నా వంతు కృషి చేసి, సంతృప్తిగా వెళ్లిపోతున్నాను..'' అని జస్టిస్ బోబ్డే చెప్పారు. చివరిగా..

 జస్టిస్ రమణ చేతికి న్యాయ దండం

జస్టిస్ రమణ చేతికి న్యాయ దండం

సీజేఐ పదవిలో తన వంతు కృషి చేశానని చెప్పిన జస్టిస్ ఎస్ఏ బోబ్డే.. ఇకపై బారోన్(న్యాయదండాన్ని) జస్టిస్ ఎన్వీ రమణ చేతికి అప్పగిస్తున్నానని అన్నారు. భారత 48వ సీజేఐగా జస్టిస్ రమణ సర్వోన్నత న్యాయస్థానానికి నాయకత్వం వహిస్తారని, కచ్చితంగా కోర్టును చక్కగా లీడ్ చేస్తారని ఆశిస్తున్నట్లు బోబ్డే అన్నారు. శుక్రవారం బోబ్డే పదవీ విరమణ చేయడంతో, తదుపరి సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ శనివారం(ఏప్రిల్ 24న) ప్రమాణం చేస్తారు. రాష్ట్రపతి భవన్ లోని దర్బారు హాలులో ప్రెసిడెంట్ రామ్ నాథ్ కొవింద్.. జస్టిస్ రమణ చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో జస్టిస్ రమణ ప్రమాణ కార్యక్రమం నిరాడంబరంగా జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కీలక శాఖల మంత్రులు, రమణ కుటుంబీకులు మాత్రమే వేడుకలో పాలుపొచుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక..

 ఏడాదిలో 50వేల కేసులు పూర్తి

ఏడాదిలో 50వేల కేసులు పూర్తి

జస్టిస్ బోబ్డే పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాలు కీలక వ్యాఖ్యలు చేశారు. గతేడాది కరోనా విలయం తలెత్తిన సందర్భంలో దేశం మొత్తంలాగే కోర్టులు సైతం లాక్ డౌన్ కు గురయ్యే పరిస్థితిలో వర్చువల్ విచారణలు ప్రారంభించడం ద్వారా జస్టిస్ బోబ్డే న్యాయ వ్యవస్థ పనిని సజీవంగా కొనసాగించగలిగారని, గడిచిన ఏడాది కాలంలో వర్చువల్ పద్దతిలోనే 50వేల పైచిలుకు కేసుల విచారణ పూర్తయ్యాయంటే ఆ ఘనత బోబ్డేకే దక్కుతుందని అటార్నీ జనరల్ అభిప్రాయపడ్డారు. జస్టిస్ బోబ్డే సమర్థుడైన న్యాయమూర్తిగానే కాకుండా గొప్ప మానవతావాదిగా, హాస్య చతురుడిగానూ సుప్రీం చరిత్రలో నిలిచిపోతారని సొలిసిటర్ జనరల్ మెహతా అన్నారు. కాగా,

సీజేఐ పదవీ కాలం మూడేళ్లుండాలి..

సీజేఐ పదవీ కాలం మూడేళ్లుండాలి..

జస్టిస్ బోబ్డే పదవీ విమరణ సందర్భంగా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సీనియర్ లాయర్ వికాస్ సింగ్ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బోబ్డే వయసు 65ఏళ్లేనని, న్యాయ వ్యవస్థకు ఇంకా సేవలందించగల సత్తా ఆయనకుందని, అసలు సీజేఐ పదవీ కాలాన్న రిటైర్మెంట్ వయసుతో కాకుండా, కనీసం 3ఏళ్లు పదవిలో ఉండేలా రాజ్యాంగ సవరణ అవసరమని సింగ్ అన్నారు. సీజేఐగా బోబ్డే తన చివరి రోజు కూడా కరోనా విలయంపై విచారణలు చేశారని సింగ్ గుర్తుచేశారు. 1956, ఏప్రిల్ 24న నాగపూర్ లో జన్మించిన ఎస్ఏ బోబ్డే అదే నాగపూర్ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్ఎల్‌బీ డిగ్రీలు పొందారు. 1978లో మహారాష్ట్ర బార్ కౌన్సిల్ లో చేరి న్యాయవాద వృత్తిని ఆరంభించారు. 2000 ఏడాదిలో బాంబే హైకోర్టు అదనపు జడ్జిగా ప్రమోట్ అయిన బోబ్డే, 2021లో మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమితులయ్యారు. 2013లో సుప్రీంకోర్టు జడ్జిగా చేరి, 2019 నవంబర్ లో సీజేఐ అయ్యారు. ఇవాళ జస్టిస్ బోబ్డే రిటైర్మెంట్ తో రేపు కొత్త సీజేఐగా జస్టిస్ రమణ బాధ్యతలు స్వీకరిస్తారు.

English summary
Outgoing Chief Justice of India (CJI) Sharad Arvind Bobde on Friday said he was leaving the Supreme Court with “happiness, goodwill and very fond memories” and the satisfaction of having done his best. “I leave with the satisfaction that I did my best. I hand over the baton to Justice N V Ramana (48th CJI) who will I am sure will very ably lead the court,” Bobde said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X