Leena: నిన్న స్మోకింగ్ కాళి, ఇప్పుడు స్మోకింగ్ శివుడు, పార్వతి, లీనా ఏం చెయ్యాలని అనుకుంది ?. దేవుళ్లతో గేమ్స్
చెన్నై/బెంగళూరు: దేశవ్యాప్తంగా కలకలం రేపిన స్మోకింగ్ కాళి పోస్టర్ వ్యవహారంలో తమిళనాడుకు చెందిన ఫిల్మ్ మేకర్ లీనా మణిమేఖలై మీద హిందూ సంఘ, సంస్థలు మండిపడుతున్నాయి. కాళి మాతను అవమానించిన తమిళనాడుకు చెందిన ఫిల్మ్ మేకర్ లీనా మణిమేఖలై బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆమె మీద హిందూ సంఘ, సంస్థలు మండిపడుతున్నాయి. ఈ వివాదం సద్దుమనగకముందే లీనా మణిమేఖలై మరో వివాదానికి తెరతీసింది. శివుడు, పార్వతి వేషంలో ఉన్న ఇద్దరు సిగరేట్ తాగుతున్న ఫోటో సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడం కలకలం రేపింది. లీనా మణిమేఖలై హిందూ దేవుళ్లు, హిందూ మనోభావాలు దెబ్బ తియ్యాలని కంకణం కట్టుకుందని సోషల్ మీడియాలో ఆమె మీదమండిపడుతున్నారు.
Actress:
మామ
మీద
లైంగిక
వేధింపుల
కేసు
పెట్టిన
ప్రముఖ
నటి,
ముఖం
పచ్చడి,
రజనీ,
సూర్యతో
!

స్మోకింగ్ కాళి పోస్టర్ వివాదం
తమిళనాడుకు చెందిన ఫిల్మ్ మేకర్ లీనా మణిమేఖలై సోషల్ మీడియాలో కాళిమాత సిగరేట్ తాగుతున్న ఫోటో ఒకటి విడుదల చేసి వివాదానికి తెరలేపింది. దేశంలో కలకలం రేపిన స్మోకింగ్ కాళి పోస్టర్ వ్యవహారంలో తమిళనాడుకు చెందిన ఫిల్మ్ మేకర్ లీనా మణిమేఖలై మీద హిందూ సంఘ, సంస్థలు మండిపడుతున్నాయి.

బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్
కాళి మాతను అవమానించిన తమిళనాడుకు చెందిన ఫిల్మ్ మేకర్ లీనా మణిమేఖలై బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆమె మీద హిందూ సంఘ, సంస్థలు మండిపడుతున్నాయి. అయితే లీనా మణిమేఖలై మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అయితే లీనా మణిమలై రూపోందించిన డాక్యుమెంటరీ పోస్టర్ వ్యవహారంలో కెనడాకు చెంది ఆగా ఖాన్ మ్యూజియం మాత్రం క్షమాపణలు చెప్పింది.
శివుడు, పార్వతి సిగరేట్ తాగుతున్న ఫోటో పోస్టు చేసిన లీనా
స్మోకింగ్ కాళి పోస్టర్ వివాదం సర్దుమనగకముందే ఫిల్మ్ మేకర్ లీనా మణిమేఖలై మరో వివాదానికి తెరతీసింది. శివుడు, పార్వతి వేషంలో ఉన్న ఇద్దరు సిగరేట్ తాగుతున్న ఫోటో సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడం కలకలం రేపింది. లీనా మణిమేఖలై హిందూ దేవుళ్లు, హిందూ మనోభావాలు దెబ్బ తియ్యాలని కంకణం కట్టుకుందని సోషల్ మీడియాలో ఆమె మీదమండిపడుతున్నారు. ఈ వివాదం ఇంకా ఎక్కడికి దారితీస్తుందో అని సామాన్య ప్రజలు అంటున్నారు.