వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ పూజారి ఢిఫరెంట్.. ఆశీర్వాదం ఎలా ఇస్తాడో తెలుసా..! (VIDEO)

|
Google Oneindia TeluguNews

ఒడిశా : ఒక్కొక్కరి నమ్మకం ఒక్కోలా ఉంటుంది. దానికి తగ్గట్టుగా కొంతమంది స్వాములు, పూజారులు అలాగే ప్రవర్తిస్తుంటారు. దేవుళ్ల తర్వాత అంతటి స్థానం పూజారులదే అనడంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదనే రీతిలో ఒడిశాలో జరిగిన ఘటన నిరూపిస్తోంది. ఓ ఆలయ పూజారి ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భిన్నమైన ఆశీర్వాదం ఇచ్చి వివాదస్పదంగా మారారు.

ఒడిశాలోని ఖుర్దా జిల్లా బన్‌పూర్‌లో ఓ ఆలయ పూజారి తంతుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాను పూజారిగా విధులు నిర్వహిస్తున్న ఆలయానికి వచ్చిన భక్తులకు డిఫరెంట్ ఆశీర్వాదం ఇచ్చి సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. దసరా పండుగ సందర్భంగా జరిగిన ఈ ఘటన కాస్తా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

leg blessings gesture by priest in odisha viral video

చిత్తూరులో కలకలం.. ముగ్గురు స్టూడెంట్స్ అదృశ్యం..!చిత్తూరులో కలకలం.. ముగ్గురు స్టూడెంట్స్ అదృశ్యం..!

దసరా నాడు వాహన పూజలు చేయించుకోవడానికి వచ్చిన కొందరు భక్తులకు అక్కడి పూజారి విభిన్నంగా ఆశీస్సులు అందించడం చర్చానీయాంశమైంది. భక్తుల తలపై కాలు పెట్టి ఆశీస్సులు ఇవ్వడం కొందరిని నివ్వెర పరిచింది. అదంతా మామూలే అన్నట్లుగా ఆయన ఇలా ఆశీర్వాదం ఇవ్వడం.. అదంతా ఎవరో వీడియో తీయడం చకచకా జరిగి పోయింది. అది కాస్తా నెట్టింట్లోకి చేరడంతో వైరల్‌గా మారింది.

పూజారి తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు పూజారి ఇలా ఆశీర్వాదం ఇవ్వడం కామన్ అన్నట్లుగా మాట్లాడుతుంటే మరికొందరేమో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదలావుంటే సదరు పూజారి కూడా తాను చేసినదాంట్లో తప్పేమీ లేదంటున్నారు. పైగా ఇది తరతరాలుగా వస్తోన్న ఆచారమని వాదిస్తున్నారు. సంప్రదాయాలు తెలియని వారే ఇలా దృశ్యాలు చిత్రీకరించి ఏదో చేద్దామని చూడటం భావ్యం కాదంటున్నారు.

English summary
A priest placing his feet on the devotees’ heads and back to bless them, has now gone viral on social media. The incident reportedly took place after Vahana Puja (worshipping vehicles) on Vijaya Dashami at the Paltan ground in Banpur of Khurda district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X