వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియో వైరల్: ఈ చిరుతను చితకబాది చంపేశారు.. అంతకు ముందు ఏం జరిగిందంటే..?

|
Google Oneindia TeluguNews

చిత్రదుర్గ: ఒక జంతువును చంపితే చట్టరీత్యా నేరం.. అదే జంతువు మనుషులపై దాడి చేసి చంపితే..? దీనికి సమాధానం లేదు. అయినా మనిషి మాత్రం క్రూర మృగాల నుంచి తనను కాపాడుకునే ప్రయత్నంలో ఆ జంతువుపై దాడి చేసి చంపేస్తున్నాడు. దీంతో భవిష్యత్తులో ఆ జంతువులు కేవలం పుస్తకాలకే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఒక చిరుతకు మనిషికి జరిగిన పోరాటంలో చిరుతను చితకబాదారు మనుషులు. దీంతో ఆ చిరుత పులి మృతి చెందింది. ఈ ఘటన చిత్రదుర్గ జిల్లాలోని కురుబరహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది.

leopard

కురుబరహళ్లి గ్రామంలోకి ప్రవేశించిన చిరుత ఇద్దరు గ్రామస్తులపై దాడి చేసింది. గత రెండు రోజులుగా దానిమ్మపండ్ల తోటలో ఈ చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు గమనించారు. గత రెండ్రోజుల్లో ఇద్దరిపై దాడి చేసి గాయపరిచింది. ఇక అప్పటి నుంచి ఆ చిరుత కోసం గ్రామస్తులు కాపుకాశారు. ఎప్పుడొస్తుందా దాన్ని ఎప్పుడు చంపుదామా అని మాటువేశారు.పాపం ఈ చిరుతకు గ్రామస్తులు తనను చంపుదామని స్కెచ్ వేసినట్లు తెలియదు. అలవాటుగానే దానిమ్మ తోటలోకి ప్రవేశించింది. ఓ చెట్టుపైకి ఎక్కింది. దీన్ని గ్రామస్తులు గమనించారు.

ముందుగా దానిపైకి రాళ్లు రువ్వారు. చెట్టుపైన నుంచి కిందకు దిగగానే దాన్ని చంపేద్దామని డిసైడ్ అయ్యారు. ఇక ఈ ఘట్టం మొత్తాన్ని ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్‌లో రికార్డు చేశాడు. రాళ్లు రువ్వడంతో అది చెట్టుపైనుంచి కిందకు దిగింది. ఓ వ్యక్తిపై దాడి చేసేందుకు అతని వెంట పరుగులు తీసింది. ఇక చిరుత వెనుక గ్రామస్తులు కర్రలు,కత్తులు తీసుకుని పరుగులు తీశారు. అప్పటి వరకు అణిచివేసుకున్న కోపాన్ని ఒక్కసారిగా ప్రదర్శించారు. చిరుతపై దాడి చేశారు. ఆ దెబ్బలకు తట్టుకోలేకపోయిన క్రూర జంతువు కన్నుమూసింది. అప్పటికీ అధికారులు అక్కడే ఉన్న వారు ప్రేక్షకుల్లా చూస్తూ మౌనంగా ఉండిపోయారు. మే నెలలో కూడా ఇలాంటి ఘటనే అస్సోంలో జరిగింది. గ్రామస్తులు ఓ చిరుతను వెంబడించి చితకబాది దాని కనుగుడ్లు పీకేశారు.దాని కాళ్లకున్న గోర్లను తీసేసి తలకిందులుగా కొన్నిరోజుల పాటు వ్రేలాడదీశారు.

English summary
A leopard was beaten to death by the villagers of Chitradurga distritct of Karnataka state after it had injured two locals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X