వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనాన్ని చూసి వణికిన చిరుత: చెట్టుపైకెక్కి కూర్చుంది

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

కోల్‌కత్తా: పశ్చిమబెంగాల్‌‌లోని జల్పాయ్‌గురి జిల్లాలో చిరుత కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.... జిల్లాలోని దూపుగురి గ్రామంలోకి చిరుత వచ్చి ఇరుక్కుపోయింది. చిరుత సృష్టించిన అలజడితో గ్రామస్థులంతా కంగారు పడ్డారు. చివరకు అటవీశాఖ అధికారులు దానిని అతికష్టం మీద బంధించారు.

తొలుత చిరుతను చూసిన జనం భయబ్రాంతులకు గురయ్యారు. ఆ తర్వాత చిరుత జనాన్ని చూసి వణికిపోయింది. ముఖ్యంగా కొందరు యువకులు కర్రలతో చిరుతని తరమడంతో ఒక చెట్టుఎక్కి కూర్చుంది. వెంటనే సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది రంగంలోకి దిగారు.

గ్రామంలోకి చిరుత ప్రవేశించిందని తెలియడంతో తండోపతండాలుగా గ్రామస్థులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో చిరుత మరింత భయపడిపోయింది. చివరకు మత్తుమందు పూసిన తూటాలను ప్రయోగించడంతో అది స్పృహ తప్పింది. అనంతరం చిరుతను వలలో బంధించిన సిబ్బంది అడవిలో వదిలిపెట్టారు.

Leopard climbs up tree, tranquilised, released in forest

చిరుతని పట్టుకునేందుకు జల్పాయ్‌గురి డీఎఫ్ఓ ఉమారాణి స్వయంగా రంగంలోకి దిగారు. స్వయంగా ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షించారు. సోనకాలి అటవీప్రాంతం నుంచి చిరుత గ్రామంలోకి వచ్చిందని ఆవిడ తెలిపారు. అడవులు అంతరించి పోతుండటంతోనే గత్యంతరం లేక వన్యప్రాణులు గ్రామాల్లోకి వస్తున్నాయి.

వన్యప్రాణులను జనాన్ని చంపడమో, జనం చేతులో చావడమో జరుగుతుంది. జంతువుల దుస్థితిపై జంతు ప్రేమికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

English summary
A leopard was spotted up a tree in Dhupguri town in West Bengal's Jalpaiguri district early this morning sending residents into a tizzy, a wildlife official said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X