వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డబ్బు డ్రా చేసేందుకు వెళ్లగా.. ఏటీఎంలో చిరుతపులి పిల్ల

|
Google Oneindia TeluguNews

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి జిల్లా థంగ్ ప్రాంతంలో ఆదివారం నాడు ఓ చిరుతపులి పిల్ల అటవీ ప్రాంతంలో నుంచి దారి తప్పి జనావాసాల్లోకి వచ్చిది. అది ఓ ఏటీఎం కేంద్రంలో తలదాచుకుంది. డబ్బులు తీసుకోవడానికి వెళ్ళిన వారికి ఏటీఎంలో చిరుతపులి పిల్ల కనిపించింది.

దీంతో వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో ఏటీఎం కేంద్రం వద్దకు చేరుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే ఆ చిరుతపులి పిల్లను కాపాడి సురక్షితంగా జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు.

Leopard cub Get into the ATM for avoid cold

థంగ్ ప్రాంతంలోని ఆ ఏటీఎంలోకి పన్నెండున్నర గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎంకు వెళ్లారు. అతను పులి పిల్లను చూసి కేకలు వేస్తూ బయటకు వచ్చారు. దీంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకున్నారు. ఏటీఎంలో దూరిన పులిపిల్లను బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేశారు.

ఆ తర్వా అటవీ శాఖ అధికారులను పిలిచారు. వారితో పాటు ఓ ట్యాక్సీ డ్రైవర్ దానిని బయటకు తీసుకు వచ్చారు. అక్కడ ఉన్న వాహనాన్ని ఎక్కించి అడవిలో వదిలారు. కాగా, చలి కారణంగా ఆ చిరుతపులి పిల్ల ఏటీఎంలో తలదాచుకుందని భావిస్తున్నారు.

English summary
Leopard cub Get into the ATM for avoid cold in Himachal Pradesh on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X