బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పాఠశాలలోకి చిరుతపులి, వ్యక్తి పోరాటం! (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులోని విబ్జియార్ పాఠశాలలోకి ఆదివారం వేకువజామున నాలుగు గంటలకు చిరుతపులి వచ్చింది.

దానిని బంధించేందుకు 12 నుంచి 13 గంటలు పట్టింది. చిరుతను బంధించే క్రమంలో పలువురు గాయపడ్డారు.

గాయాలైన వారిలో వైల్డ్ లైఫ్ ఆక్టివిస్ట్, కన్సర్వేషనిస్ట్ సంజయ్ గుబ్బి, చీఫ్ కన్సర్వేషనిస్ట్ డ్రైవర్ బెన్నాలు కూడా ఉన్నారు. వారిని వెంటనే అపోలో ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ఎట్టకేలకు అధికారులు చిరుతపులిని బంధించారు.

చిరుతపులి

చిరుతపులి

బెంగళూరులోని విబ్జియార్‌ పాఠశాలలోకి ఆదివారం వేకువజామున నాలుగు గంటల సమయంలో ఓ చిరుత ప్రవేశించింది. దీన్ని పట్టుకొనే క్రమంలో ఐదుగురు అటవీ శాఖ సిబ్బంది, ఓ టీవీ కెమెరామెన్‌ కూడా గాయపడ్డారు.

చిరుతపులి

చిరుతపులి

పాఠశాలలోకి చిరుత ప్రవేశించినట్లు ఉదయం ఆరు గంటల సమయంలో కాపలా సిబ్బంది సీసీ కెమేరాల ద్వారా గుర్తించి పోలీసులు, అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు.

చిరుతపులి

చిరుతపులి

పాఠశాల ముందు, వెనుక ఉన్న ద్వారాల వద్ద బోన్లు పెట్టి, ఆయా విభాగాల్లో వలలు ఏర్పాటు చేశారు. పాఠశాల గదుల నుంచి మూడుసార్లు బయటకు వచ్చిన చిరుత అక్కడి సిబ్బంది, గుమిగూడిన స్థానికులను చూసి మళ్లీ లోనికి వెళ్లిపోయింది.

చిరుతపులి

చిరుతపులి

సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల సమయంలో పాఠశాల ఆవరణలోని ఈతకొలను వద్దకు రాగా, మత్తు మందుతో కూడిన రెండు రౌండ్ల కాల్పులు జరిపారు.

చిరుతపులి

చిరుతపులి

ఆ వెంటనే స్పృహ కొల్పోతోందని భావించి దగ్గరకు వెళ్లిన సంతోష్‌ అనే ఒక టీవీ కెమెరామెన్‌, ఐదుగురు అటవీ శాఖ సిబ్బందిపై చిరుత దాడి చేయడంతో వారికి గాయాలయ్యాయి.

చిరుతపులి

చిరుతపులి

ఈ ఘటనలో సంతోష్‌ ఎడమకాలు ఎముక విరిగిపోయింది. చివరకు చిరుత పాఠశాల మరుగుదొడ్డి గది వద్ద స్పృహ తప్పి పడిపోయింది.

చిరుతపులి

చిరుతపులి

అటవీ సిబ్బంది వలల సహాయంతో పట్టుకుని బన్నేరుఘట్ట అటవీ విభాగానికి తరలించారు. గాయపడ్డ అందర్నీ ఆసుపత్రికి తరలించారు.

English summary
After a 13 hour long operation Leopard caught alive at Vibgyor School at Kundalahalli near Whitefield, Bengaluru on Sunday. During the operation Leopard attacked two people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X