వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్ సచివాలయం క్యాంపస్‌లోకి ప్రవేశించిన చిరుత: ఎలా వెళ్లిందంటే (వీడియో)

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే గుజరాత్ సచివాలయంలోకి చిరుతపులి ప్రవేశించింది. ఈ సంఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. సెక్యూరిటీ కళ్లు గప్పి గేటు దాటి అది లోపలకు వచ్చింది. చిరుతపులి లోపలకు రావడంతో అందరినీ కలవరపాటుకు గురి చేసింది.

<strong>ఐశ్వర్యతో కలిసి జీవించలేను, పెళ్లి వద్దని ఇంట్లో చెబితే వినలేదు: విడాకులపై తేజ్ ప్రతాప్</strong>ఐశ్వర్యతో కలిసి జీవించలేను, పెళ్లి వద్దని ఇంట్లో చెబితే వినలేదు: విడాకులపై తేజ్ ప్రతాప్

అహ్మదాబాదులో ఉన్న సచివాలయం గేటు కింద నుంచి ఆ చిరుతపులి లోపలకు పోయింది. ఇందుకు సంబంధించి వీడియో సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సోమవారం వేకువజామునే ఈ చిరుత సచివాలయం క్యాంపస్‌లోకి ప్రవేశించింది.

లోనికి వెళ్లకుండా ఉద్యోగుల నిలిపివేత

లోనికి వెళ్లకుండా ఉద్యోగుల నిలిపివేత

చిరుత సచివాలయం క్యాంపస్‌లోకి వచ్చిన నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది... ఉద్యోగులను ఎవరిని కూడా సచివాలయం క్యాంపస్‌లోనికి అనుమతించలేదు. ఉదయం నుంచి ఉద్యోగులు సచివాలయానికి వస్తారు. అలాగే సందర్శకులు కూడా వస్తారు. సెక్యూరిటీ సిబ్బంది అందరినీ నిలిపివేసింది. చిరుతను గుర్తించి, తరలించే వరకు ఎవరినీ అనుమతించేది లేదని చెప్పారు.

వేకువజామున 3 గంటలకు

సదరు చిరుత సోమవారం వేకువజామున మూడు గంటల ప్రాంతంలో గేటు కింద నుంచి సచివాలయం క్యాంపస్ లోనికి వచ్చింది. ఈ చిరుత సమీపంలోని ఇంద్రోడా పార్క్ నుంచి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. సచివాలయంలోని గేట్ 7 నుంచి ఆ చిరుత ప్రవేశించింది.

మెయిన్ బిల్డింగ్

మెయిన్ బిల్డింగ్

చిరుత గేటు కింద నుంచి వస్తూ, పోతూ అలా రెండుమూడుసార్లు సీసీ కెమెరాకు చిక్కింది. గుజరాత్ ప్రభుత్వానికి సంబంధించి అన్ని పనులు జరిగే భవనంలోకే ఇది ప్రవేశించినట్లుగా తెలుస్తోంది. అన్ని మంత్రిత్వ శాఖలు ఇదే భవనం నుంచి పని చేస్తాయని తెలుస్తోంది.

ముఖ్యమంత్రి అసహనం

ముఖ్యమంత్రి అసహనం

ఇదిలా ఉండగా, అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే గుజరాత్ సచివాలయంలోకి చిరుతపులి రావడం భద్రతా సిబ్బంది వైఫల్యమైనని ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది.

English summary
A leopard has entered the Sachivalaya compound in Gandhinagar early morning today. The state secretariat has been shutdown completely and no employees have been allowed to enter the premises until the leopard is located and rescued.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X