వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Leopard in home?: నివాసంలో దూరిన జంతువు, స్థానికుల గుండె గుబేల్, బయటకు రావొద్దు: పోలీసులు

|
Google Oneindia TeluguNews

చండీగఢ్ సెక్టార్ 5 నివాస ప్రాంతంలో చిరుతపులి లాంటి జంతువు కనిపించింది. దీంతో అక్కడున్న స్థానికుల గుండె గుబేల్ మంది. చిరుతపులి లాంటి జంతువు ఉన్నందున.. జనం ఇంట్లోంచి బయటకు రావొద్దని పోలీసులు కోరారు. ఆ జంతువు కచ్చితంగా చిరుతపులి అని పోలీసులు అంటుండగా.. వన్యప్రాణి కార్యకర్తలు మాత్రం విభేదిస్తున్నారు.

సోమవారం ఉదయం చిరుతపులి లాంటి జంతువు కనిపించింది. దీంతో ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. వన్యఫ్రాణి అధికారులను పిలిపించారు. ఇంటినుంచి బయటకు రావొద్దని కోరామని సెక్టార్ 3 పోలీసు స్టేషన్ ఇన్ స్పెక్టర్ జస్పాల్ సింగ్ తెలిపారు. ఎక్కడినుంచి వచ్చిందో తెలియదు కానీ.. సెక్టార్ 5లో గల ఒక ఇంటిలోకి జంతువు ప్రవేశించిందని తెలిపారు.

Leopard-Like Animal Seen In Posh Chandigarh Area; Stay Home..

ఆ సమయంలో ఎవరికీ ఎలాంటి హానీ తలపెట్టలేదని పేర్కొన్నారు. వణ్యప్రాని అధికారులు దానిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఆ జంతువు సమీపంలో గల అడవీ నుంచి వచ్చిందని భావిస్తున్నారు.

వైరస్ వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో జనం ఇళ్లకే పరిమితం కాగా.. ఎడారుల్లో వన్యప్రాణలు సంచరిస్తున్నాయి. సెక్టార్ 5 వద్ద దుప్పుల గుంపు వెళుతున్న దృశ్యాన్ని తాను చూశానని పోలీసు అధికారి జస్పాల్ సింగ్ తెలిపారు.

English summary
leopard-like animal was spotted in Chandigarh's Sector 5 residential area on Monday morning, following which police made announcements in the area asking people to stay indoors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X