వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాట్ ఏ ఛాలెంజ్: మోడీకి అమిత్ షాలకు మమతా విసిరిన సవాల్ ఏంటో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా ఛాలెంజెస్ పెరిగిపోతున్నాయి. అంటే ఒక సవాలు ఇవ్వడం మిగతావారు అది చేసి చూపించి ఆ వీడియోను పోస్టు చేయడం లాంటివి జరుగుతున్నాయి. ఇది రాజకీయాలకు కూడా పాకిపోయింది. ఇప్పటి వరకు సినిమా సెలబ్రిటీలు మాత్రమే ఈ సోషల్ మీడియా ఛాలెంజెస్‌లో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా తమ ప్రత్యర్థులకు సవాళ్లు విసురుతున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంస్కృతంలో మంత్రాలను జపించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాలకు సవాల్ విసిరారు.

Lets see who knows more Sanskrit: Mamata Banerjee throws mantra-chanting challenge at PM Modi

ప్రధాని మోడీ, అమిత్ షాలు మమతా బెనర్జీపై హిందుత్వ పేరుతో రాజకీయ విమర్శలు చేశారు. మమతా బెనర్జీ బెంగాల్‌లో దుర్గా పూజను అడ్డుకున్నారని వారు విమర్శించారు. అయితే దీనిపై స్పందించారు మమతా బెనర్జీ. "పూజ అంటే కేవలం నుదిటిపై తిలకం పెట్టుకోవడం కాదు అమిత్ బాబు, ప్రధాని మోడీ బాబు... మంత్రాలు చదవడంలో నాతో పోటీ పడండి. ఎవరికి ఎక్కువగా సంస్కృతంలో మంత్రాలు వస్తాయో తేల్చుకుందాం" అంటూ కోల్‌కతాలో జరిగిన బహిరంగ సభలో మమతా సవాల్ విసిరారు.

ఇండోర్ బరిలో కాంగ్రెస్ తరపున బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్..?ఇండోర్ బరిలో కాంగ్రెస్ తరపున బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్..?

ఇదిలా ఉంటే బెంగాల్‌లో అమిత్ షా పర్యటన ఉన్న ప్రతీ సందర్భంలో మమతా బెనర్జీ అడ్డంకులు సృష్టించారని బీజేపీ వాదిస్తోంది. ఆయన అడుగుపెడితే రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పుతాయనే నెపం చూపుతున్నారని బీజేపీ ధ్వజమెత్తింది. రాజకీయ హత్యల గురించి బీజేపీ మాట్లాడుతోందని .... 99 మంది టీఎంసీ కార్యకర్తలు బెంగాల్‌లో మృతి చెందారంటే ఇందుకు కారణం తాము మోడీ అమిత్ షాలపై పోరాటం చేస్తున్నందునే అని అనుకోవచ్చా అని ఆమె ప్రశ్నించారు. ఇక బెంగాల్‌లో ఈ సారి బీజేపీ పట్టుబిగించాలని చూస్తున్న నేపథ్యంలో అక్కడి రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇక బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికలు అన్ని ఏడు దశల్లో జరగనున్నాయి.

English summary
West Bengal Chief Minister Mamata Banerjee on Tuesday threw a Sanskrit mantra-chanting challenge at Prime Minister Narendra Modi and Bharatiya Janata Party (BJP) chief Amit Shah.PM Modi and Amit Shah have repeatedly perused Hindutva politics and ridiculed the Opposition for allegedly falling prey to foreign dynamics especially Mamata, who they accused of blocking Durga Puja in West Bengal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X