• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మత స్వేచ్ఛను హరించడం సరికాదు : జై శంకర్‌తో మైక్ పొంపియా.. ట్రంప్, మోడీ సమర్థ నేతలని ప్రశంసలు

|

న్యూఢిల్లీ : దేశంలో మత స్వేచ్చకు భంగం కలిగించొద్దని అమెరికా అభిప్రాయపడింది. ఇటీవల దేశంలో వరుసగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో అమెరికా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంది. మంగళవారం భారత పర్యటనకొచ్చిన అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పొంపియో మత స్వేచ్చ గురించి విదేశాంగ మంత్రి జై శంకర్‌తో చర్చించడం చర్చకు దారితీసింది.

దాడులు సరికాదు ..

భారతదేశం .. ఉప ఖండం. ఇక్కడ విభిన్న జాతులు, మతాలు, సంస్కృతుల వారు ఉంటారు. అయితే ఇటీవల కొన్నిచోట్ల గో రక్షకులమని హిందువుల దాడులకు దిగడం కలకలం రేపుతుంది. ఈ క్రమంలోనే బుధవారం పొంపియో దేశంలో మత స్వేచ్చ అంశాన్ని చర్చించడం ఆసక్త కలిగిస్తోంది. దీంతో దేశంలో అన్ని మతాల వారు ఒక్కటేనని సంకేతాలకు అమెరికా ఇచ్చింది. గతేడాదికి సంబంధించి మతం పేరుతో జరిగిన దాడుల వివరాలను అంతర్జాతీయ మత స్వేచ్చ విభాగం నివేదిక విడుదల చేసిన వారం రోజుల తర్వాత పొంపియో ఈ అంశాన్ని తెరపైకి తేవడం హాట్ టాపిక్‌గా మారింది.

 Lets Speak Out: Pompeo Talks About Religious Freedom, Draws Parallel Between Trump and Modi

హక్కులు హరిస్తారా ..

దేశంలో గతేడాది హిందు సంస్థలు రెచ్చిపోయాయి. ముఖ్యంగా ముస్లింలపై దాడికి తెగబడ్డాయి. దేశంలో అన్ని మతాలు , ప్రాంతాలు వారు ఉండి .. ఉపఖండంగా పేరొందితే .. ఈ ఘర్షణలు ఏంటని పొంపియో ప్రశ్నించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. వారి హక్కులను హరించడం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు పొంపియో. దీంతోపాటు ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను పొగడ్తలతో ముంచెత్తారు పొంపియో. ఇద్దరు సమర్థమైన నేతలని .. దేశ ప్రయోజనాల కోసం ఎంతటి కీలకమైన నిర్ణయం తీసుకుంటారని స్పష్టంచేశారు. ఆ నిర్ణయాలతో దేశానికి తలెత్తే ప్రమాదం గురించి భయపడకుండా ముందడుగు వేసి .. విజయం సాధిస్తారని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
US Secretary of State Mike Pompeo on Wednesday called for speaking "strongly" in favour of religious freedom rights and asserted that the world is worse off when they are compromised. His remarks assume significance as they come days after the State Department, in its annual 2018 International Religious Freedom Report released last week, alleged that mob attacks by violent extremist Hindu groups against minority communities, particularly Muslims, continued in India in 2018.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more