వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ శోభ...గ్రీన్ క్రిస్మస్ వేడుకలకే ప్రాధాన్యం

|
Google Oneindia TeluguNews

క్రిస్మస్ పండుగకు ఇంకా రెండు వారాల సమయం ఉండగానే ప్రపంచవ్యాప్తంగా అప్పుడే క్రిస్మస్ శోభ కనిపిస్తోంది. ఇప్పటికే పలు చర్చీలను అలంకరించడం జరిగింది. రోజుకో ప్రత్యేక కార్యక్రమం చర్చీల్లో నిర్వహిస్తున్నారు. ఇక క్రైస్తవులకు అతి పెద్ద పండగ క్రిస్మస్ కావడంతో ఇప్పుడే వారి ఇళ్లను అలంకరించేశారు. అంతేకాదు ఇంట్లో క్రిస్మస్ చెట్టు, ఇంటిపైన స్టార్‌తో అత్యంత అందంగా వారి ఇళ్లను ముస్తాబు చేశారు. ఇక క్రిస్మస్ సమయంలో జరిగే క్రిస్మస్ కారోల్స్ కూడా ప్రారంభమయ్యాయి. క్రీస్తు జననాన్ని గుర్తుచేసుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు సంబురాలు చేసుకుంటున్నారు.

క్రిస్మస్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది క్రీస్తు పుట్టుక. ఇక డిసెంబర్ మాసం మొత్తం ఒక్క క్రైస్తవులదే అన్నట్లుగా వాతావరణం ఉంటుంది. ఈ సమయం క్రైస్తవులకు ఎంతో స్పెషల్. వంటకాల నుంచి కేక్ మేకింగ్ వరకు అంతా ప్రత్యేకమే. అయితే ఈ సారి క్రిస్మస్ కాస్త ప్రత్యేకంగా జరుపుకోవాలని క్రైస్తవులు భావిస్తున్నారు. మారుతున్న వాతావరణంను దృష్టిలో ఉంచుకుని గ్రీన్ క్రిస్మస్‌గా ఈ ఏడాది జరుపుకోవాలని క్రెైస్తవులు భావిస్తున్నారు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుపై ఈ క్రిస్మస్ సీజన్‌ ద్వారా అవగాహన కల్పించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎకో ఫ్రెండ్లీ సెలబ్రేషన్స్‌కు నాంది పలకనున్నారు.

Lets celebrate Green Christmas..here are few ways to celebrate it

కాలుష్యం లేకుండా.. గ్రీన్ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునేందుకు 10 చిట్కాలు ఇలా ఉన్నాయి.

* క్రిస్మస్ జంపర్లకు గుడ్ బై చెప్పేద్దాం. ఎందుకంటే అందులో సాధారణంగా ప్లాస్టిక్ ఉంటుంది. ఆ క్రిస్మస్ జంపర్లు మహా అంటే ఒకసారి లేదా రెండు సార్లు ధరిస్తాము. అయితే తప్పకుండా ధరించాల్సిందే అని అనుకుంటే కొత్తది కాకుండా పాతదే ధరించడం మంచిది. లేదా సెకండ్ హ్యాండ్‌లో కొని ధరించడం మంచిది

* క్రిస్మస్‌ సందర్భంగా ఇళ్లల్లో ఉంచుకునే క్రిస్మస్ ట్రీ ప్లాస్టిక్‌ది కాకుండా నిజమైన చెట్టునే పెట్టుకుంటే బాగుంటుంది. ప్లాస్టిక్ చెట్టును మరో పదేళ్ల పాటు వినియోగిస్తాం. నిజమైన చెట్లను కొన్ని షాపులు అద్దెకు ఇస్తాయి.

* ఇళ్లను అలంకరించేందుకు ఎల్‌ఈడీ బల్బులు వాడండి. ప్లాస్టిక్‌తో కూడిన హోమ్ డెకొరేషన్స్‌కు స్వస్తి పలకండి. ఎల్‌ఈడీ బల్బులు పండగ అయ్యాక కూడా ఉపయోగపడతాయి. అదే ప్లాస్టిక్ డెకరేషన్స్ పండగ అయిపోయాకా పడేయాల్సి వస్తుంది. దీనివల్ల కాలుష్యం కూడా పెరుగుతుంది.

* ఇక ఆహారం విషయానికొస్తే క్రిస్మస్ అంటేనే నాన్‌వెజ్. అయితే వెజిటేరియన్ ఆహారం తీసుకుంటే మంచిది. టర్కీ క్రిస్మస్ డిన్నర్ నుంచి సాధారణ వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటే వాతావరణంపై కూడా పెద్దగా ప్రభావం చూపదు.

* ఇక క్రిస్మస్ సందర్భంగా పటాకులకు దూరంగా ఉండటం మంచింది. ఎందుకంటే దీని వల్ల వాతావరణం పాడవుతుంది. అధిక కాలుష్యం వెలువడుతుంది. అది ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు.

* క్రిస్మస్ గిఫ్ట్‌లు కూడా ఎక్కువగా కొనొద్దు. ఒకటో రెండో కానుకలు కొంటే సరిపోతుంది.అనవసరపు గిఫ్ట్స్ వల్ల డబ్బులు వృథా తప్ప వచ్చేదేమీ లేదు. ఇక గిఫ్ట్స్‌ను ప్లాస్టిక్ కవర్లతో చుట్టొద్దు. గిఫ్టులను ప్యాక్ చేసేందుకు క్యాలెండర్లు, వ్రాపింగ్ పేపర్, ఇతరత్ర వస్తువులను వినియోగించొద్దు. ఎందుకంటే వీటి వల్ల పునరుత్పత్తి జరగదు. అదే న్యూస్ పేపర్‌తోనో లేక పార్శిల్ పేపర్‌తోనో గిఫ్టులను ప్యాక్ చేయడం మంచిది

* ఇక క్రిస్మస్‌కు ఇంటికొచ్చే స్నేహితులు బంధువులతో వాతావరణంపై చర్చించండి. ఎలాంటి వాతావరణంలో ఉంటున్నామో అవగాహన తీసుకురండి. ఇదంతా భోజనంకు అంతా కలిసి కూర్చున్నప్పుడు మాట్లాడటం మంచిది. అంతేకాదు వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులపై ఆరోగ్యకరమైన చర్చ నిర్వహించండి

ఇలాంటి చిట్కాలు పాటించి హెల్తీ క్రిస్మస్‌ను జరుపుకోవడమే కాదు... వాతావరణంను కూడా కాపాడిన వాళ్లమవుతాము.

English summary
Christmas is a time of plenty - and the season of abundant food, gifts and merriment creates a hefty climate impact and millions of tons of waste each year.As awareness about climate change grows, many people are aiming to cut waste and enjoy an eco-friendly celebration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X