వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ ఆరోపణలు అబద్ధమని కాగ్‌ రిపోర్ట్‌తో మరోసారి రుజువైంది: జైట్లీ

|
Google Oneindia TeluguNews

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంపై కాంగ్రెస్ ప్రచారం చేస్తున్న ఆరోపణలు అబద్ధమని మరోసారి రుజువయ్యాయని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. విపక్షాలు ఎంతలా అబద్ధాలు ప్రచారం చేశాయో కాగ్ నివేదికతో మరోసారి ప్రస్ఫుటం అయ్యిందన్నారు జైట్లీ. పార్లమెంటు సమావేశాల చివరిరోజున రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలుకు సంబంధించిన అన్ని అంశాలను కాగ్ తన నివేదికలో పేర్కొంది. ఎన్డీఏ హయాం కింద 2016లో జరిగిన ఒప్పందం ప్రకారం విమానాల కొనుగోలు 2.86శాతం తక్కువకే జరుగుతోందని కాగ్ వెల్లడించింది.

2007లో యూపీఏ హయాంలో జరిగిన ఒప్పందంలో ఉన్న ధర కంటే ఎన్డీఏ హయాంలో జరిగిన ఒప్పందంలోని ధరే తక్కువగా ఉందని కాగ్ పేర్కొంది. ఇక రాఫెల్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని... కోర్టు తీర్పును కూడా విపక్షాలు గౌరవించలేదని... మళ్లీ కాగ్ రిపోర్టు కూడా మోడీ సర్కార్‌కు క్లీన్ చిట్ ఇచ్చిందని గుర్తు చేశారు అరుణ్ జైట్లీ. సుప్రీంకోర్టు తప్పుగా చూశారు ఇప్పుడు కాగ్ నివేదికను కూడా తప్పుగా చూస్తారేమో అని సెటైర్ వేశారు అరుణ్ జైట్లీ.

Lies of Congress exposed by CAG report on Rafale: Arun Jaitley

సుప్రీంకోర్టు తప్పు, కాగ్ నివేదిక తప్పు ఇక కాంగ్రెస్ వారసత్వం చెప్పేదే కరెక్టు అనేలా విపక్షాలు వ్యవహరిస్తాయేమో అని ఎద్దేవా చేశారు జైట్లీ. సత్యమేవ జయతే.. సత్యం ఎప్పటికీ గెలుస్తుంది అంటూ ట్వీట్ చేసిన జైట్లీ కాగ్ రిపోర్టు కూడా సత్యాలనే వెలికి తీసిందని చెప్పారు. 2016లో మోడీ సర్కార్ రాఫెల్ ఒప్పందం కుదుర్చుకుందని 2007లో మన్మోహన్ సర్కార్‌తో పోలిస్తే ఈ విమానాలు తక్కువ ధరకే వస్తున్నాయని కాగ్ నివేదిక చెబుతోందని జైట్లీ నొక్కి చెప్పారు. మహాజూట్‌బంధన్ చెప్ప అబద్ధాలు ప్రజాస్వామ్యంలో నిలవలేదని సెటైర్ వేసిన జైట్లీ.... దేశానికి ప్రతిసారి అబద్ధాలు చెప్పేవారిని దేశ ప్రజలు ఎలాంటి శిక్ష విధించాలి..? అంటూ ప్రశ్నిస్తే మరో ట్వీట్ చేశారు జైట్లీ.

English summary
Union Minister Arun Jaitley Wednesday said the lies of the Congress and opposition parties stand exposed by the CAG report on Rafale, which reaffirms the dictum that truth shall prevail.The Comptroller and Auditor General (CAG) report on Rafale, tabled in the Rajya Sabha, said that the deal negotiated by the NDA in 2016 was 2.86 per cent cheaper than what was negotiated by the UPA in 2007.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X