వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంగారకుడిపై చిన్న కీటకాలు: జీవం ఉందని చెబుతున్న శాస్త్రవేత్తలు

|
Google Oneindia TeluguNews

అంగారక గ్రహంపై జీవం ఉందా లేదా అన్నదానిపై గత కొన్నేళ్లుగా శాస్త్రవేత్తల మధ్య బేదాభిప్రాయాలు తలెత్తాయి. కొందరు అంగారకుడిపై జీవనం ఉంది అని అంటే మరికొందరు మాత్రం అది సాధ్యం కాదని వాదిస్తున్నారు. ఇదిలా ఉంటే అమెరికాలోని ఓహియో యూనివర్శిటీ శాస్త్రవేత్తలు మాత్రం అంగారకుడిపై జీవం ఉంది అని చెబుతున్నారు. ఇందుకు నిదర్శనం ఆ గ్రహంలో ఓ కీటకం ఉన్నట్లు తమ పరిశీలనలో తేలిందని వెల్లడించారు.

 మార్స్‌ పై జీవం ఉందంటున్న ఓహియో యూనివర్శిటీ సైంటిస్టులు

మార్స్‌ పై జీవం ఉందంటున్న ఓహియో యూనివర్శిటీ సైంటిస్టులు

అంగారకుడిపై జీవం ఉందని వాదిస్తున్నారు ఓహియో యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. పలు మార్స్ రోవర్స్ నుంచి వచ్చిన చిత్రాలను జాగ్రత్తగా పరిశీలించిన మీదట అక్కడ కొన్ని పురుగులు ఉన్నట్లు తాము కనుగొన్నామని ప్రొఫెసర్ ఎమిరిటస్ విలియం రోమోసర్ చెప్పారు. అంగారకుడిపై కనిపించిన కీటకాలు తేనెటీగల రూపంలో ఉన్నట్లు ప్రొఫెసర్ వెల్లడించారు. ఈ పురుగులను పరిశీలించగా వాటికి రెక్కలున్నాయని చెప్పారు. అంతేకాదు కాళ్లు కూడా ఉన్నాయని అవి బాగానే ఎగురుతున్నట్లుగా ఫోటోలో ఉన్నాయని చెప్పారు.

అంగారకుడిపై ఉన్న ఫోటోల పరిశీలన

అంగారకుడిపై ఉన్న ఫోటోల పరిశీలన

మార్స్ గ్రహంపై రోవర్లు నిత్యం పరిశోధనలు చేస్తున్నాయని చెప్పిన రోమోసర్‌ అక్కడ ఏమైనా ఖనిజాలు ఉన్నాయా అనేదానిపై పరిశోధనలు చేస్తున్నాయని చెప్పారు. అయితే చాలా ఫోటోలలో పురుగులు, సరీసృపాలు ఉన్నాయని రోమోసర్ వివరించారు. చాలా ఫోటోల్లో వెన్నెముకలేని శరీరభాగాలు అంటే కాళ్లు, కొమ్ములు, రెక్కలు కలిగిన కీటకాలను గమనించినట్లు చెప్పారు.అంతేకాదు ఓ పురుగు ఎగిరి కిందకు ల్యాండ్ అయ్యే ముందు తీసిన ఓ ఫోటో కూడా ఇందుకు బలం చేకూరుస్తోందని రోమోసర్ చెప్పారు. ఇక ఫోటోలను అత్యంత జాగ్రత్తతో పరిశీలించినట్లు చెప్పిన రోమోసర్... ఫోటోలకు సంబంధించి బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్, శాచురేషన్, ఇన్వర్షెన్‌లాంటి పారామీటర్లలో ఎలాంటి మార్పు చేయలేదని స్పష్టం చేశారు.

 తేనెటీగలతో పోలి ఉన్న కీటకాలు

తేనెటీగలతో పోలి ఉన్న కీటకాలు

ఇక ఫోటోలో ఉన్న కీటకాల కదలికలను, ఎగరడాన్ని, వాటి పొజిషన్‌ను, మెరిసే కళ్లను పరిశీలిస్తే కచ్చితంగా అక్కడ జీవం ఉంది అనే కంక్లూజన్‌కు వచ్చినట్లు రోమోసర్ చెప్పారు. అంగారకుడి పై గమనించిన కీటకాలు భూమిపై ఉన్న కీటకాలతో సరిపోలాయని చెప్పారు. అంటే ఒక జత కొమ్ములు, ఆరు కాళ్లు ఉన్నట్లు చెప్పారు. ఈ కీటకాలు అచ్చు తేనెటీగల్లా ఉన్నాయని చెప్పారు. ఈ తేనెటీగల్లా ఉండే కీటకాలు అక్కడి అంగారకుడిపై ఉన్న గుహల్లో నివాసం ఏర్పరచుకుని ఉంటాయని చెప్పారు. అదే సమయంలో పాముతో పోలిఉండే శిలాజ జీవిని కూడా కనుగొన్నట్లు ఆయన చెప్పారు.

English summary
As scientists scramble to determine whether there is life on Mars, a researcher from Ohio University in US believes that there is evidence of insect-like creatures on the red planet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X