• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనాతో కలిసి జీవించాల్సిందే: నీట్, జేఈఈ పరీక్షలపై సుప్రీంకోర్టు సంచలనం: తుది నిర్ణయం ఇదే

|

న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్), జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)పై దేశ అత్యున్నత న్యాయస్థానం కొద్దిసేపటి కిందట సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. వచ్చేనెల ఈ రెండు పరీక్షలను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఈ పరీక్షలను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటీషన్లను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఫలితంగా- వచ్చేనెల నీట్, జేఈఈ పరీక్షలు యధాతథంగా కొనసాగడం ఖాయమైంది.

  Cancel Exams - NSUI | కాలేజీలు ఓపెన్ చేయొద్దు, HRC కి ఫిర్యాదు

  భారత్‌లో కరోనా కాటుకు 50 వేలమందికి పైగా బలి: విచ్చలవిడిగా: వైరస్ ఎపిక్ సెంటర్‌గా

  కరోనా ముప్పు వల్ల

  కరోనా ముప్పు వల్ల

  ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ పరీక్షలను నిర్వహించడం సరికాదని, వాటిని వాయిదా వేయాలంటూ పిటీషన్లు సుప్రీంకోర్టులో దాఖలు అయ్యాయి. దేశంలో కరోనా వైరస్ రోజురోజుకూ బలపడుతోందని, వేల సంఖ్యలో రోజువారీ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయంటూ పలువురు ఆందోళనలు వ్యక్తం చేశారు. పరీక్షలను వాయిదా వేసేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలను జారీ చేయాలంటూ విజ్ఙప్తి చేశారు. 11 రాష్ట్రాలకు చెందిన 11 మంది విద్యార్థులను ఈ నెల 6వ తేదీన పిటీషన్లను దాఖలు చేశారు.

  విచారణకు వచ్చిన 12 నిమిషాల్లోనే..

  విచారణకు వచ్చిన 12 నిమిషాల్లోనే..

  ఈ పిటీషన్లు సోమవారం మధ్యాహ్నం సుప్రీంకోర్టు సమక్షానికి విచారణకు వచ్చాయి. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు దీనిపై విచారణ ఆరంభమైంది. న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టారు. జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ రెండు వేర్వేరు పిటీషన్లు దాఖలు అయ్యాయని చెప్పారు. దీనిపై వాదనలను ఆలకించారు. ఎన్టీఏ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, విద్యార్థుల తరఫున అడ్వొకేట్ అలఖ్ తమ వాదనలను వినిపించారు. ఈ సందర్భంగా జస్టిస్ అరుణ్ మిశ్రా కీలక వ్యాఖ్యలను చేశారు.

  కొంతకాలం పాటు వాయిదా..

  కొంతకాలం పాటు వాయిదా..

  ఈ సందర్భంగా విద్యార్థుల తరఫున న్యాయవాది అలఖ్ తన వాదనలను వినిపించారు. తాము నిరవధికంగా నీట్, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలని కోరట్లేదని అన్నారు. కొంతకాలం పాటు మాత్రమే వాయిదా వేయాలని కోరుతున్నామని చెప్పారు. ఈ లోగా కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందనే ఆశ ఉందని అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి తన ప్రసంగంలోనూ కరోనా వ్యాక్సిన్ గురించి ప్రస్తావించారని చెప్పారు. దీనిపై తుషార్ మెహతా మాట్లాడుతూ.. పరీక్షలను నిర్వహించడానికి కేంద్రం సన్నద్ధంగా ఉందని అన్నారు.

  కరోనాతో కలిసి జీవించాల్సిందే..

  కరోనాతో కలిసి జీవించాల్సిందే..

  విచారణ సందర్భంగా ఈ పరీక్షలను వాయిదా వేయాలంటూ విద్యార్థుల తరఫు న్యాయవాది వాదించారు. ఆయన వాదనలతో జస్టిస్ అరుణ్ మిశ్రా ఏకీభవించలేదు. కరోనా వైరస్‌తో కలిసి జీవించడాన్ని అలవర్చుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు. పరీక్షలను వాయిదా వేసినంత మాత్రాన సరిపోతుందా? అని ప్రశ్నించారు. కరోనా వల్ల ఏర్పడిన సంక్షోభ పరిస్థితుల్లోనూ జీవితం అనేది ముందుకు సాగాల్సి ఉంటుందని అన్నారు. పరీక్షలను వాయిదా వేయాల్సిన పరిస్థితే వస్తే.. దేశం చాలా నష్టపోతుందని అరుణ్ మిశ్రా అన్నారు. ఓ విద్యా సంవత్సరాన్ని విద్యార్థులు కోల్పోతారని, అది శ్రేయస్కరం కాని చెప్పారు.

  విద్యార్థుల భవిష్తత్తు ప్రమాదకరంగా..

  విద్యార్థుల భవిష్తత్తు ప్రమాదకరంగా..

  నీట్, జేఈఈ పరీక్షలు దేశానికి ఓ మార్గదర్శకాన్ని చేస్తాయని, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యుత్తు మాత్రమే కాదు.. దేశం కూడా దానిపై ఆధారపడి ఉందని అరుణ్ మిశ్రా అన్నారు. అలాంటి పరీక్షలను కరోనా కారణంగా వాయిదా వేయాలనుకోవడం సరికాదని అన్నారు. ఈ పిటీషన్లను కొట్టి వేస్తున్నట్లు చెప్పారు. కరోనా పేరు చెప్పి..ఎక్కడికక్కడే నిలిచిపోవడం మంచిది కాదని అన్నారు. పరీక్షలను వాయిదా వేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేసినట్టవుతుందని వ్యాఖ్యానించారు. సరిగ్గా 12 నిమిషాల్లోనే ఈ పిటీషన్లపై తన వాదనను ముగించారు.

  English summary
  Supreme Court on Monday dismissed a petition seeking the postponement of the National Eligibility cum Entrance Test (NEET) and Joint Entrance Examination (JEE), scheduled to be held in September 2020.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X