వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘లా’ విద్యార్థినిపై లైంగికదాడి : 11 మందికి జీవితఖైదు,

|
Google Oneindia TeluguNews

న్యాయ విద్యార్థినిపై లైంగికదాడి చేసిన 11 మందికి రాంచీ కోర్టు సోమవారం శిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో గత నెల 26వ తేదీన 11 మందిని న్యాయస్థానం దోషులుగా ప్రకటించి.. తీర్పును సోమవారానికి వాయిదావేసింది. 11 మందికి జీవితఖైదు విధిస్తున్నట్టు జిల్లా జడ్జీ నవ్‌నీత్ కుమార్ తన తీర్పులో పేర్కొన్నారు. కుల్‌దీప్ ఒరాన్, నవీన్ ఓరాన్, బసంత్ కచ్చప్, రవీ ఒరాన్, రోహిత్ ఒరాన్, సునీల్ మందా, రిషి ఒరాన్ సహా 11 మందికి న్యాయస్థానం శిక్ష విధించింది.

 Life term to 11 people in law student rape case..

గతేడాది నవంబర్ 26వ తేదీన తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి లా విద్యార్థి తిరిగి వస్తోన్నారు. రాంచీలో గల నేషనల్ లా వర్సిటీ నుంచి వారి స్కూటీలో పెట్రోల్ అయిపోయింది. అటుగా వస్తోన్న వాహనంలో సాయం అడగగా వారు యువతిని తమ వాహనంలోకి బలవంతంగా తీసుకెళ్లారు. సమీపంలోని ఇటుక బట్టిలోకి తీసుకెళ్లి లైంగికదాడి చేశారు. యువతిని తీసుకొచ్చింి 8 మంది కాగా.. మరో నలుగురు చేరి, యువతిపై లైంగికదాడి చేశారు.

నిందితులపై నవంబర్ 17వ తేదీన యువతి ఫిర్యాదు చేసింది. ఈ కేసులో పోలీసులు 16 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 12 మంది లైంగికదాడి చేసినట్టు గుర్తించారు. ఫోరెన్సిక్ ల్యాబిరేటరీ రిపోర్ట్ కూడా 12 మంది లైంగికదాడి చేసినట్టు పేర్కొన్నది. వీరిలో ఒకడు యువతిపై రెండుసార్లు లైంగికదాడికి తెగబడ్డాడు. మరొకడు మైనర్ కావడంతో.. అతని నేర విచారణను జువైనల్ కోర్టు చేపట్టనుంది.

English summary
Ranchi court on Monday awarded life term to 11 convicts in the rape case of a law student.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X