• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆశ్రమంలో అత్యాచారం..! ఆశారాం బాపు కుమారుడికి జీవిత ఖైదు

|

సూరత్ : దైవాంశ సంభూతుడిగా అభివర్ణించుకున్న ఆశారాం బాపు ఆశ్రమంలో అరాచకాలు వెలుగుచూశాయి. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న అభియోగాలతో జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. తండ్రి బాటలోనే ఆయన తనయుడు నారాయణ్ సాయి కూడా ఆరోపణలు ఎదుర్కొన్నాడు. మహిళలను లైంగికంగా వేధించారనే కారణాలతో.. మంగళవారం సూరత్ కోర్టు ఆయనకు కూడా జీవిత ఖైదు విధించింది.

తండ్రి దారిలోనే..!

తండ్రి దారిలోనే..!

ఆశారాం బాపు అత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. తాజాగా ఆయన కుమారుడు నారాయణ్ సాయి కూడా రేప్ కేసులో దోషిగా తేలాడు. దీనికి సంబంధించి సూరత్ కోర్టు ఈ నెల 26 నాడు తీర్పు వెలువరించింది. అదే క్రమంలో మంగళవారం (30.04.2019) నాడు జైలుశిక్ష ఖరారు చేసింది. 2013లో అతడిపై నమోదైన అత్యాచారం కేసులో ఆరేళ్లుగా విచారణ కొనసాగి తుదితీర్పు వచ్చింది.

సూరత్‌కు చెందిన ఓ మహిళ నారాయణ్ సాయిపై రేప్ కేసు ఫైల్ చేశారు. 2002 నుంచి 2005 వరకు మూడు సంవత్సరాలు తాను ఆశ్రమంలో ఉన్నప్పుడు తండ్రీకొడుకులిద్దరు అత్యాచారం చేశారనేది ప్రధాన ఆరోపణ. 2013లో పోలీసులను ఆశ్రయించిన సదరు మహిళలు.. నారాయణ్ సాయి తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

హాజీపూర్ సీరియల్ కిల్లర్.. లిఫ్ట్ ఇచ్చి హత్యాచారాలు.. నిందితుడి ఇంటికి నిప్పు

ఎన్నెన్నో ఆరోపణలు..!

ఎన్నెన్నో ఆరోపణలు..!

లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినప్పటి నుంచి నారాయణ్ సాయి పరారీలో ఉన్నాడు. అయితే అప్పట్లో పోలీసులు జరిపిన దర్యాప్తులో మరో వివాదస్పద సంఘటన వెలుగులోకి వచ్చింది. నారాయణ్ సాయికి అమ్మాయిలను సరఫరా చేసిందనే ఆరోపణలతో పోలీసులు అతని సహాయకురాలు గంగను అరెస్ట్ చేశారు. నారాయణ్ సాయి గంగతో శారీరక సంబంధం పెట్టుకోవడంతో వారికి ఓ చిన్నారి జన్మించినట్లు పోలీసులు తేల్చారు. తర్వాత కొంత కాలానికి నారాయణ్ సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదలావుంటే తాజాగా ఈ కేసులో గంగ, జమున, హనుమాన్‌ అనే వ్యక్తులను కూడా కోర్టు దోషులుగా పేర్కొంది. మోనికా అనే మహిళను నిర్ధోషిగా తేల్చింది.

 ఆధ్యాత్మిక ప్రవచనాలు.. అత్యాచార ఆరోపణలు

ఆధ్యాత్మిక ప్రవచనాలు.. అత్యాచార ఆరోపణలు

అహ్మదాబాద్ లోని సబర్మతీ నది తీరాన యోగా, ఆధ్యాత్మికతకు మారుపేరుగాంచింది ఆశారాం బాపు ఆశ్రమం. అక్కడకు వెళ్లే భక్తులకు పురాణా, ఇతిహాసాల గురించిన ప్రవచనాలు చెప్పడంలో ఆయన దిట్ట. అయితే ఆ ఆశ్రమంలో చదువుకునే ఇద్దరు విద్యార్థులు 2008, జులై 4వ తేదీన కనిపించకుండా పోయి ఆ మరుసటి రోజే శవాలై కనిపించారు. ఆ జంట హత్యల్లో ఆశారాం బాపు హస్తమున్నట్లు కేసు నమోదైంది. తదనంతరం అత్యాచార ఆరోపణలు అతడిని జైలు జీవితానికి పరిమితం చేశాయి.

ఆశ్రమం పేరిట ఆశారాం బాపు అరాచకాలు చేశాడనే వాదనలున్నాయి. మైనర్ బాలికలను కూడా రేప్ చేసినట్లు ఆరోపణలున్నాయి. పైగా అత్యాచారం చేయడం పాపం కాదని చెబుతుండేవాడట. చివరకు ఓ రేప్ కేసులో దోషిగా తేలడంతో ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. తండ్రి బాటలోనే ఇప్పుడు తనయుడు కూడా అత్యాచారం కేసులో దోషిగా తేలడంతో జీవిత ఖైదు పడింది.

English summary
Self-styled godman Asaram Bapu Son Narayan Sai on Tuesday was convicted by a local court in Gujarat’s Surat city in rape case charges. Narayan Sai was arrested in December 2013 from Haryana’s Pipli village near Kurukshetra after 2 victims had levelled rape allegations against him and his father Asaram. According to the reports, one woman had accused Narayan Sai of repeated sexual assaults, when she was living in Asaram’s Surat ashram between 2002 and 2005. Finally Surat Court given Life Time Prison judgement to narayan sai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more