వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్‌లో పూర్తిస్థాయి ఆంక్షల ఎత్తివేయాలంటే పాక్‌ పై ఆధారపడి ఉంది: అజిత్ దోవల్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కశ్మీర్‌లో అల్లర్లకు పాల్పడుతున్న 2500 మందిని భద్రతాదళాలు అదుపులోకి తీసుకున్నాయని జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత వీరు అల్లర్లకు పాల్పడుతుండటంతో వారిని అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. అయితే అందులో చాలామందిని విడుదల చేశామని చెప్పారు అజిత్ దోవల్. విడుదల చేసే ముందు అదుపులో ఉన్న వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి విడుదల చేసినట్లు దోవల్ తెలిపారు. హింసను ప్రేరేపించేవారిని అదుపులోకి మాత్రమే తీసుకున్నామని వారిపై ఎలాంటి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించలేదని చెప్పారు.

ఇక కశ్మీర్ లోయలో ఎలాంటి అట్రాసిటీ కేసులు నమోదు కాలేదని అక్కడ శాంతి భద్రతలను జమ్మూ కశ్మీర్ పోలీసులు మరియు కేంద్ర భద్రతా బలగాలు పర్యవేక్షిస్తున్నాయని దోవల్ వివరించారు. ఇక అక్కడ ఉగ్రవాదులతో పోరాడేందుకే భారత జవాన్లు మోహరించి ఉన్నారని చెప్పారు. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దును మెజార్టీ కశ్మీరీలు స్వాగతించారని మళ్లీ గుర్తు చేశారు దోవల్. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీరీలు మంచి అవకాశాలు వస్తాయని ఎదురుచూస్తున్నారని అదే సమయంలో భవిష్యత్తు కూడా బాగుంటుందని భావిస్తున్నట్లు దోవల్ చెప్పారు. ఇక ఆర్థికంగా కూడా కశ్మీర్ అభివృద్ధి జరుగుతుందని దీంతో ఉద్యోగావకాశాలు వస్తాయని యువత భావిస్తున్నట్లుగా దోవల్ చెప్పారు. అయితే కొందరు మాత్రమే పాకిస్తాన్ ప్రభావంతో కశ్మీర్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని వారే అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని దోవల్ మండిపడ్డారు.

Ajit doval

జమ్మూ కశ్మీర్‌లో మొత్తం 199 పోలీస్‌ స్టేషన్‌లు ఉండగా అందులో 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో వచ్చే ప్రాంతాల్లోనే ఆంక్షలు ఉన్నాయని చెప్పారు. మిగతా చోట్ల ఎలాంటి ఆంక్షలు విధించలేదని స్పష్టం చేశారు అజిత్ దోవల్. అంతేకాదు ఆంక్షలు ఎత్తివేసిన ప్రాంతాల్లో 100శాతం టెలిఫోన్‌ లైన్లు పనిచేస్తున్నాయని మరోసారి స్పష్టం చేశారు. అంతేకాదు పూర్తి స్థాయిలో ఆంక్షలు ఎత్తివేయాలనేది పాకిస్తాన్‌ నడవడికపై ఆధారపడి ఉంటుందన్నారు. సరిహద్దు వెంబడి పాకిస్తాన్‌కు చెందిన కమ్యూనికేషన్ టవర్లను తాము గుర్తించినట్లు దోవల్ చెప్పారు. పాకిస్తాన్ గట్టి చర్యలు తీసుకుంటే భారత్‌లోకి ఉగ్రవాదులు చొరబడే అవకాశం లేదని చెప్పారు. కశ్మీర్‌లో ఉన్న కొందరికి తమ కమ్యూనికేషన్ టవర్ల ద్వారా సంకేతాలను పాక్ పంపుతోందని ఆ చర్యను ఉపసంహరించుకుంటే పూర్తిగా ఆంక్షలు ఎత్తివేస్తామని అజిత్ దోవల్ వెల్లడించారు.

English summary
National Security Advisor Ajit Doval, on Saturday, said that Pakistan is trying to create trouble in Kashmir by spreading false propaganda, adding at least 230 Pakistani terrorists were spotted in the Valley recently.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X