వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేయకుంటే ఏమౌతుంది, ఎందుకు? వారికి ఊరట

ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీలోగా బ్యాంకు ఖాతాలతో ఆధార్‌ను లింక్ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శనివారం మరోసారి స్పష్టం చేసింది.లేదంటే డిసెంబర్ 31 తేదీ తర్వాత బ్యాంకు ఖాతాలు స్తంభించిపోతాయన

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీలోగా బ్యాంకు ఖాతాలతో ఆధార్‌ను లింక్ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శనివారం మరోసారి స్పష్టం చేసింది.

ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి: మరోసారి స్పష్టం చేసిన ఆర్బీఐ ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి: మరోసారి స్పష్టం చేసిన ఆర్బీఐ

లేదంటే డిసెంబర్ 31 తేదీ తర్వాత బ్యాంకు ఖాతాలు స్తంభించిపోతాయని వెల్లడించింది. బ్యాంకు ఖాతాలతో ఆధార్ నెంబర్ అనుసంధానంపై తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని ఆర్టీఐ కింద చెప్పినట్లు మీడియాలో వార్తలు రావడంతో ఆర్బీఐ వివరణ ఇచ్చింది.

తప్పనిసరిగా చేయాలి

తప్పనిసరిగా చేయాలి

ఈ సంవత్సరం జూన్‌ 1న అధికారిక గెజిట్‌లో ప్రకటించిన అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం (రికార్డుల నిర్వహణ) రెండో సవరణ నిబంధనలు 2017 ప్రకారం బ్యాంకు ఖాతా ఉన్న ప్రతి వ్యక్తి, అధీకృత సంతకందారు, కంపెనీలు, భాగస్వామ్య సంస్థలు తమ బ్యాంకు ఖాతాకు తమ ఆధార్ నంబర్‌ను తప్పనిసరిగా అనుసంధానం చేయాలని ఆర్బీఐ పేర్కొంది.

అందుకే ఆధార్ - బ్యాంక్ అకౌంట్ లింక్

అందుకే ఆధార్ - బ్యాంక్ అకౌంట్ లింక్

తదుపరి ఆదేశాల కోసం వేచిచూడకుండా బ్యాంకులు ఈ నిబంధన అమలు చేయాలని ఆర్బీఐ కోరింది. దేశంలో అక్రమ నగదు లావాదేవీలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోందని, ఒక పరిమితి దాటిన బ్యాంకు ఆర్థిక లావాదేవీలకు ఇప్పటికే పాన్ నెంబర్ పేర్కొనడాన్ని తప్పనిసరి చేశారని, అయితే కొంతమంది రెండు మూడు పాన్‌ నంబర్లతో బురిడీ కొట్టిస్తున్నట్టు వార్తలు రావడంతో ఇప్పుడు ఆధార్‌ నెంబర్‌నూ బ్యాంక్‌ ఖాతాలకు అనుసంధానం చేయాలని నిర్ణయించింది.

నల్లధనాన్ని సమర్థవంతంగా గుర్తించవచ్చు

నల్లధనాన్ని సమర్థవంతంగా గుర్తించవచ్చు

దీంతో దేశంలో నల్లధన చలామణినీ మరింత సమర్థవంతంగా గుర్తించవచ్చని ప్రభుత్వం భావిస్తోందని, కొత్తగా బ్యాంకు ఖాతాలు ప్రారంభించాలన్నా రూ.50,000 మించిన ఆర్థిక లావాదేవీలు జరపాలన్నా ఆధార్ నెంబర్‌ కోట్‌ చేయడాన్ని ప్రభుత్వం ఇప్పటికే తప్పనిసరి చేసిందని, ఈ సంవత్సరం జూన్‌లోనే దీనిపై ఉత్తర్వులు జారీ అయ్యాయి,. ఇప్పటికే బ్యాంకు ఖాతాలు ఉన్న వ్యక్తులు ఈ ఏడాది డిసెంబర్‌ 31లోగా ఈ పని పూర్తి చేయాలి.

అనుసంధానం చేయకుంటే

అనుసంధానం చేయకుంటే

ఈ ఏడాది డిసెంబర్‌ 31లోగా ఖాతాదారులు తమ ఆధార్‌ సంఖ్యను బ్యాంక్‌ ఖాతాతో అనుసంధానం చేయకపోతే వారి ఖాతాలూ స్తంభించిపోతాయి. మళ్లీ వారి ఆధార్‌ నంబర్‌, పాన్‌ కార్డు వివరాలు సమర్పించేంత వరకు ఇదే పరిస్థితి. వీటిని సమర్పిస్తే మళ్లీ బ్యాంకు ఖాతా ఆపరేట్‌ చేసేందుకు అనుమతిస్తారు.

వారికి మినహాయింపు

వారికి మినహాయింపు

చిన్న ఖాతాదారులకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. ఎలాంటి ఎస్‌బి ఖాతాలను చిన్న ఖాతాగా పరిగణిస్తారో కూడా ప్రభుత్వం వివరణ ఇచ్చింది. సంవత్సరంలో రూ.లక్షకు మించి ఖాతాలో జమకాని ఖాతాలు, నెలవారీ నగదు ఉపసంహరణ, బదలీలు సగటున రూ.10,000 మించని ఖాతాలు, ఖాతాలో ఎప్పుడూ నగదు బ్యాలెన్స్‌ రూ.50,000 మించని ఖాతాలను చిన్న ఖాతాలుగా పరిగణిస్తారు. అంటే దాదాపుగా జన్‌ ధన్‌ ఖాతాలేవీ ఈ పరిధిలోకి రావు.

English summary
Reserve Bank of India on Saturday said linkage of biometric identity number Aadhaar with bank accounts is mandatory. The RBI clarification followed media reports quoting a reply to a Right to Information+ (RTI) application that suggested the apex bank has not issued any order for mandatory Aadhaar linkage with bank accounts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X