వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి: మరోసారి స్పష్టం చేసిన ఆర్బీఐ

ఆధార్‌ నంబర్‌తో బ్యాంక్‌ ఖాతాలను అనుసంధానం చేసుకోవడం తప్పనిసరి అని, డిసెంబర్‌ 31 లోగా ప్రతి బ్యాంక్‌ ఖాతాదారుడు.. తన ఖాతాను ఆధార్‌ నెంబర్‌తో అనుసంధానం చేసుకోవాలని ఆర్బీఐ స్పష్టం చేసింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ముంబై : ఆధార్‌ నంబర్‌తో బ్యాంక్‌ ఖాతాలను అనుసంధానం చేసుకోవడం తప్పనిసరి అని రిజర్వ్‌ బ్యాంక్‌ ఇండియా శనివారం మరోసారి స్పష్టం చేసింది. ఆధార్‌ నెంబర్‌తో బ్యాంక్‌ ఖాతాలను అనుసంధానం చేయాల్సిన అవసరం లేదంటూ వస్తున్న కథనాలను ఆర్బీఐ తీవ్రంగా ఖండించింది.

చట్టవ్యతిరేక లావాదేవీలను నియంత్రించే క్రమంలో బ్యాంక్‌ ఖాతాను ఆధార్‌ నెంబర్‌తో అనుసంధానం చేయాల్సిందేనని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం - 2017 ప్రకారం ఇది తప్పనిసరి అని ఆర్బీఐ పేర్కొంది.

aadhaar-banking

మనీలాండరింగ్‌ నిరోధక చట్టం - 2017ను అనుసరించి అన్ని బ్యాంకులు తదుపరి ఆదేశాల కోసం ఎదురుచూడకుండా.. అనుసంధాన ప్రక్రియను పూర్తి చేయాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశించింది.

డిసెంబర్‌ 31 లోగా ప్రతి బ్యాంక్‌ ఖాతాదారుడు.. తన ఖాతాను ఆధార్‌ నెంబర్‌తో అనుసంధానం చేసుకోవాలని రిజర్వ్‌ బ్యాంక్‌ స్పష్టం చేసింది.

English summary
Reserve Bank of India on Saturday said linkage of biometric identity number Aadhaar with bank accounts is mandatory. The RBI clarification followed media reports quoting a reply to a Right to Information (RTI) application that suggested the apex bank has not issued any order for mandatory Aadhaar linkage with bank accounts. These rules have statutory force and, as such, banks have to implement them without awaiting further instructions, it said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X