బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరు శివార్లలో కారుపై సింహాల దాడి, ప్రాణాలు ! (వీడియో)

బెంగళూరు నగర శివార్లలోని బన్నేరుఘట్ట జాతీయ ఉద్యానవనం సఫారీలో వెళుతున్న ఓ కారుపై రెండు సింహాలు దాడి చెయ్యడంతో వాహనంలో ఉన్న వారు ప్రాణభయంతో వణికిపోయారు.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలోని బన్నేరుఘట్ట జాతీయ ఉద్యానవనం సఫారీలో వెళుతున్న ఓ కారుపై రెండు సింహాలు దాడి చేస్తున్న చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం రేపాయి.

సఫారీ కోసం వినియోగించిన ఇన్నోవా కారు అద్దాలకు ఇనుప వల లేకపోవడంతో దానిలో వెలుతున్న వారు ప్రాణభయంతో వణికిపోయారు. అయితే కారులో ఉన్న వారు చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు.

అదే సమయంలో భద్రతా సిబ్బంది అక్కడి చేరుకుని కారులో ఉన్న వారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటన సోమవారం జరిగిందని సోషల్ మీడియాలో కథనాలు ప్రసారం అయ్యాయి.

బన్నేరుఘట్ట జాతీయ ఉద్యానవనం అధికారులు మాత్రం ఇది ఎన్నడో జరిగిన ఘటన అని అంటున్నారు. ఎటువంటి ఇనుప వల లేకుండా సఫారీలోకి కారు ఎలా వెళ్లింది ? సింహాలు వాహనాల వద్దకు ఎలా వచ్చాయి ? అని దర్యాప్తు చేస్తున్నామని అధికారులు చెప్పడం కొసమెరుపు.

English summary
Lion attack car in Bannerghatta Nationl Park near Bengaluru City.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X