వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియో వైరల్: నివాస ప్రాంతాల్లో దర్జాగా సంచరించిన సింహాల గుంపు..భయాందోళనలో ప్రజలు

|
Google Oneindia TeluguNews

గుజరాత్ : గుజరాత్‌లో నడిరోడ్డుపై ఏడు సింహాలు హల్చల్ చేశాయి. ఈ ఘటన జునాగడ్‌లో చోటుచేసుకుంది. అయితే ఈ సింహాలు రోడ్డుపైకి ఎక్కడి నుంచి వచ్చాయో అర్థంకావడం లేదు. నడిరోడ్డుపై నడుస్తున్న ఈ సింహిం గుంపు అక్కడే ఉన్న సీసీ కెమెరాలకు చిక్కాయి. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జునాగడ్‌లోని ఓ నివాస ప్రాంతంలో ఈ ఏడు సింహాలు చాలా దర్జాగా నడుస్తున్నాయి. అది అర్థరాత్రి సమయం కావడంతో ప్రజలు ఎవరూ రోడ్డుపైన లేరు. ఒక వేళ ఆ సమయంలో ఎవరైనా ఈ సింహాలకు కనిపించి ఉండి ఉంటే వారి ప్రాణాలు గాల్లో కలిసేవి. అయితే ఈ సింహాలు జునాగడ్‌కు సమీపంలోని గిర్నార్ వన్యప్రాణుల అభయారణ్యం నుంచి వచ్చినట్లు సమాచారం. ఇక కొందరైతే ఇంట్లో నుంచే వీడియోను తీశారు.

Lions walk freely in residential area in Gujarat, Video goes viral

సింహాలు తమ నివాస ప్రాంతంలో తిరుగుతున్నాయని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు అక్కడి స్థానికులు. గిర్నార్ అభయారణ్యంలో ఉన్న సింహాలు ఇలా నగరం నడిబొడ్డుకు రావడం సహజమే అని చెప్పారు అధికారులు. అలా నగరంలో సంచరించిన తర్వాత తిరిగి అడవుల్లోకి వెళ్లిపోతాయని స్పష్టం చేశారు. రాత్రివేళల్లో బయటకు వస్తాయని ఆ తర్వాత తిరిగి అడవుల్లోకి వెళ్లిపోతాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇక ఆ కారిడార్ అటవీప్రాంతంతో అనుసంధానమవుతుంది కాబట్టే అడవి మృగాలు ఎక్కువగా జనవాసాల్లోకి వస్తుంటాయని చెప్పారు. వీటి కదలికలపై అటవీశాఖ నిత్యం ఓ కన్నేసి ఉంటుంది. ఏదైనా ప్రమాదం సంభవిస్తుందని తెలిస్తే వాటిని పట్టుకుని తిరిగి అడవుల్లోకి వదిలేస్తామని చెప్పారు.

గత నెలలో గిర్ అడవుల్లో ఓ సింహం గడ్డి తినడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ వీడియో వైరల్ అవడంతో మాంసాహారి అయిన సింహం, ఇలా గడ్డి తినడంపై నెటిజెన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే గడ్డిని తిన్న ఆ సింహం వెంటనే బయటకు కక్కేసింది. అయితే గడ్డి తినడం వల్ల సింహాలకు కడుపు నొప్పి వేస్తుందని అటవీశాఖ అధికారులు తెలిపారు. జీర్ణం కానీ ఆహారం ముందుగా తీసుకుని ఉంటే దాన్ని బయటకు కక్కేందుకు గడ్డిని సింహాలు తింటాయని అధికారులు తెలిపారు. గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లాలో ఉన్న కంభా అడవుల్లో ఈ దృశ్యాన్ని రికార్డు చేశారు.

English summary
A pride of seven lions was spotted roaming fearlessly on a road in Gujarat's Junagadh. A video of the big cats strolling on the street is doing rounds on social media.The video shows seven lions roaming freely in a residential area in Junagadh late in the night. The lions had come from the Girnar Wildlife Sanctuary located nearby the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X