• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Lockdown: బ్రాందీ షాపుల మందు కిలోమీటరు క్యూ, తాగుబోతులకు గంగజాతర, ఒకేఒక్క క్వాటర్ దేవుడా !

|

బెంగళూరు/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) లో ఎవరైనా చాలా సంతోషంగా ఉన్నారంటే ఇప్పుడు మాత్రం కొందరు ఉన్నారు. కరోనా కాలంలో చాలా సంతోషంగా ఉన్నా వారిలో ముందు వరుసలో మందుబాబులు ఉన్నారు. సోమవారం నుంచి లిక్కర్ విక్రయాలకు ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 40 రోజుల నుంచి నాలుక పిడచకట్టుకుపోయిన మందుబాబులు సోమవారం వేకువ జామున నుంచి బ్రాందీ షాపుల ముందు బారులు తీశారు. కలియుగ వైకుఠ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనానికి ఎలా క్యూలో బారులు తీరుతారో అలాగే ఇప్పుడు బ్రాందీ షాపుల ముందు తాగుబోతులు బారులు తీరారు. సాయంత్రంలోపు ఒకేఒక్క క్వాటర్ బాటిల్ దొరికితే చాలు దేవుడా ? అంటూ మండుటెండలో తాగుబోతులు కిలోమీటరు పొడవు క్యూలో నిలబడుతున్నారు.

సోషల్ మీడియాలో 100 మంది అమ్మాయిలు, ఆంటీల టార్గెట్, ల్యాప్ టాప్ లో రహస్యాలు, గుండా యాక్ట్, బెండ్ !

 తాగుబోతులకు పండగే పండగ

తాగుబోతులకు పండగే పండగ

మందుబాబులకు సోమవారం పండగ వచ్చినట్లు అయ్యింది. దేశంలో ఎన్నడు లేని విధంగా 40 రోజులకు పైగా బ్రాందీ షాప్ లు మూతపడ్డాయి. ఒక్కసారిగా బ్రాందీ షాప్ లు తెరుచుకోవడంతో మందుబాబులకు పండుగ వచ్చినట్లు అయ్యింది. పండుగ రోజు ఎంత సంతోషంగా ఉంటారో అంతకంటే ఎక్కువగా చాలా సంతోషంగా ఉన్నారు మందుబాబులు.

 వంద పడుగలు ఒకేసారి వస్తే !

వంద పడుగలు ఒకేసారి వస్తే !

40 రోజుల తరువాత బ్రాందీ షాపుల ముందు క్యూలో నిలబడిన తాగుబోతులు మా వంతు వచ్చే వరకు స్టాక్ ఉండాలని, అది ఎంత టైం అయినా పర్వాలేదని దేవుడుని వేడుకుంటున్నారు. సోమవారం క్యూలో ముఖాలకు మాస్కులు వేసుకుని తమను ఎవ్వరూ గుర్తు పట్టలేరులే అంటూ మందుబాబులు చాలా సంతోషంగా ఉన్నారు. సోమవారం మందు బాబులకు ఒకే సారి వంద పండగలు వచ్చినట్లు అయ్యింది.

 ఒకేఒక్క క్వాటర్, మాకే లక్కీచాన్స్ ఇవ్వు దేవుడా !

ఒకేఒక్క క్వాటర్, మాకే లక్కీచాన్స్ ఇవ్వు దేవుడా !

కర్ణాటకలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం విక్రయించడానికి అక్కడి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సోమవారం వేకువ జామున 4 గంటల నుంచి బెంగళూరు నగరంతో పాటు కర్ణాటకలోని అన్ని బ్రాందీ షాపుల ముందు మందుబాబులు క్యూ కట్టారు. బ్రాందీ, విస్కీ, బీరు తాగడానికి ఒకేఒక్క క్వాటర్, మాకు లక్కీచాన్స్ ఇవ్వు దేవుడా ! అంటూ మందుబాబులు క్యూలైన్లలో నిలుచుకుని దేవుడిని ప్రార్థించుకుంటూ కనపడుతున్నారు.

 కిలోమీటరు క్యూ లైన్

కిలోమీటరు క్యూ లైన్

మద్యం కొనుగోలు చెయ్యడానికి వచ్చే మందు బాబులకు ప్రభుత్వం కొన్ని షరుతులు విధించింది. ముఖానికి కచ్చితంగా మాస్క్ ఉండాలని, బ్రాందీ షాపుల ముందు నిలబడే వ్యక్తులు ఒక్కొక్కరు ఆరు అడుగుల దూరం పాటించాలని తదితర షరతులు పెట్టింది. ఒక్కొక్కరికి ఆరు అడుగుల దూరం ఉండటంతో మందు బాబులు నిలబడిన క్యూలైన్లు కిలోమీటరు పొడవు ఉన్నాయి. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో అయితే ఎంత దూరం చేస్తూ అంత దూరం వరకు మందుబాబులు క్యూలో నిలబడి ఉన్న విషయం గుర్తించిన స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

 బ్యారికేడ్లు పెట్టినా తలనొప్పి

బ్యారికేడ్లు పెట్టినా తలనొప్పి

కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా బ్రాందీ షాపుల ముందు భారీగా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరు సమాన దూరం పాటించడానికి ముందుగానే ముగ్గుపిండితో సర్కిల్స్, బాక్స్ లు వేశారు. అయినా ఎక్కడ లిక్కర్ చిక్కుతుందో చిక్కదో అనే ఆందోళనతో మందుబాబులు ఎగబడటంతో బ్రాందీ షాపు యజమానులతో పాటు పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

  Watch Indian Navy Salutes Tribute to Corona Warriors on Land, Air and Sea
   కిక్కు ఎక్కితే ఎలా ఉంటుందో ?

  కిక్కు ఎక్కితే ఎలా ఉంటుందో ?

  40 రోజుల తరువాత మందు బాబుల గొంతుల్లోకి క్వాటర్ బ్రాందీ, లేదా విస్కీ వెళ్లిన తరువాత ఆ కిక్కు ఎలా ఉంటుందో ? చెప్పడం ఎవ్వరికీ సాధ్యం కాదు. క్వారర్ బ్రాందీ కడుపులోకి వెళ్లిన తరువాత కరోనా వైరస్ గురించి, లాక్ డౌన్ గురించి మందుబాబులు ఏం మాట్లాడుతారో ? ఎలా ప్రవర్థిస్తారో ? అనే విషయం బయటకురానుంది. మొత్తం మీద మందుబాబులు బ్రాందీ షాపుల ముందు మండుటెండలో కిలోమీటర్ల పొడవు క్యూలో నిలబడి ఉన్న ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  English summary
  Coronavirus Lockdown: Liquor Supply Begins In Karnataka After 40 Days, Drinkers Celebration at Vine Store Across the India.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more