వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిన్నమ్మకు ఝలక్: శశి వర్గం ఇచ్చిన సంతకాలు సరిచూడాలి, గవర్నర్

తాను ముఖ్యమంత్రి కావడానికి 134 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారని చెబుతున్న శశికళ నటరాజన్ సమర్పించిన సంతకాలు సరైనవో ? కాదో ? సరిచూడాలని గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు భావిస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తాను ముఖ్యమంత్రి కావడానికి 134 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారని చెబుతున్న శశికళ నటరాజన్ సమర్పించిన సంతకాలు సరైనవో ? కాదో ? సరిచూడాలని గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు భావిస్తున్నారు. ఆమెకు నిజంగా ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారా అని పరిశీలిస్తున్నారు.

గురువారం రాత్రి దాదాపు అరగంట పాటు శశికళ తన వర్గీయులతో కలిసి గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావుతో తన వాదన వినిపించడంతో పాటు పది అంశాలతో కూడిన ప్రజంటేషన్ కూడా ఇచ్చారు. తనను శాసనసభాపక్ష నేతగా ఎలా ఎన్నుకున్నారో అనే విషయం గవర్నర్ కు శశికళ చెప్పారని తెలిసింది.

శశికళ కథ క్లోజ్: రిసార్ట్ లో ఎమ్మెల్యేలు, దుమ్ములేపిన మన్నార్ గుడి గ్యాంగ్శశికళ కథ క్లోజ్: రిసార్ట్ లో ఎమ్మెల్యేలు, దుమ్ములేపిన మన్నార్ గుడి గ్యాంగ్

జయలలితకు అత్యంత విశ్వాసపాత్రుడిగా, రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసి ఆమె కోసం పదవిని వదలుకున్న ప్రస్తుత అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అంతకు ముందే గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసి పలు విషయాలపై చర్చించారు.

List of AIADMK MLAs in hand, Sasikala meets TN Governor, stakes claimto form govt

శశికళ ఖాళీ కాగితం మీద ఎమ్మెల్యేల దగ్గర సంతకాలు తీసుకున్నారని, తరువాత ఆమె తనకు ఇష్టం వచ్చినట్లు రాసుకున్నారని, కొన్ని సంతకాలు ఫోర్జరీ కూడా చేశారని పన్నీర్ సెల్వం గవర్నర్ దగ్గర ఆరోపించారని పన్నీర్ వర్గీయులు చెప్పారు.

రాజీకి వచ్చిన శశికళ: పన్నీర్ సెల్వం ఇంటికి పరుగు తీసి వెళ్లి !రాజీకి వచ్చిన శశికళ: పన్నీర్ సెల్వం ఇంటికి పరుగు తీసి వెళ్లి !

ఈ విషయాన్ని గవర్నర్ విద్యాసార్ రావు కూడా సీరియస్ గా తీసుకున్నారని తెలిసింది. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, అన్నాడీఎంకే సీనియర్ నాయులను దగ్గర పెట్టుకుని ఆ పార్టీ ఎమ్మెల్యేలు చేసిన సంతకాలు సరైనవో ? కాదో ? సరిచూడాలని గవర్నర్ విద్యాసాగర్ రావు నిర్ణయించారు.

అంతే కాకుండ సంతకాలు ఫోర్జరీ అయ్యాయనే ఆరోపణలు పరిశీలించడానికి ఫోరెన్సిక్ నిపుణులను పంపించాలని గవర్నర్ యోచిస్తున్నట్లు సమాచారం. తనకు ఎంత మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉందో నిరూపించడానికి ఐదు రోజులు అవకాశం ఇవ్వాలని పన్నీర్ సెల్వం గవర్నర్ కు మనవి చేశారు.

ఆట మొదలైంది: పన్నీర్ కు 22 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు !ఆట మొదలైంది: పన్నీర్ కు 22 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు !

శశికళ మాత్రం తనకు 134 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, తాను సీఎం కావడానికి అవకాశం ఇవ్వాలని గవర్నర్ కు మనవి చేశారు. అయితే 134 మందిలో ఇప్పటికే పన్నీర్ సెల్వం దగ్గర ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రత్యక్షంగా మీడియాలోనే వచ్చిందని తమిళ ప్రజలు అంటున్నారు.

అదే నిజం అయితే శశికళ ఇచ్చిన ఎమ్మెల్యే సంఖ్య తప్పువుతుంది. అందుకే అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సంతకాలు సరైనవా ? కాదా ? అనే అంశాన్ని పరిశీలించాలని పన్నీర్ సెల్వం గవర్నర్ దగ్గర రేపారని తెలిసింది. ఇప్పటికే గవర్నర్ ఎమ్మెల్యేల సంతకాలు సరైనవా ? కాదా ? అని పరిశీలించాడానికి అధికారులతో చర్చిస్తున్నారని సమాచారం.

English summary
Sasikala Natarajan visited Jayalalithaa's memorial at Chennai's Marina Beach before she met the Governor and had tears in her eyes as she offered rose petals and placed a list of 134 legislators in a large envelope there.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X