వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"మహిళలను ఉంపుడు గత్తెలుగా చూస్తున్నారు "సహజీవనాన్ని నిషేధించండి : మావవ హక్కుల సంఘం

|
Google Oneindia TeluguNews

రాజస్థాన్ మానవ హక్కుల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. సమాజంలో కొనసాగుతున్న సహజీవన సంబంధాలను నిషేధించాలని రాజస్థాన్ ప్రభుత్వంతో పాటు కేంద్రానికి సూచించింది. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది. సహజీవన సంబంధాల్లో మహిళను లైంగికచర్యలకు వాడుకుని, ఉంపుడుగత్తెల్లా చూస్తున్నారని బెంచ్ అభిప్రాయపడింది. ఇటివల సహజీవనానికి సంబంధించిన కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని తెలిపింది. దీంతో వాటిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పింది.

ఆధునిక సమాజంలో పుట్టుకువచ్చిన సహజీవనాలు

ఆధునిక సమాజంలో పుట్టుకువచ్చిన సహజీవనాలు

ఆధునిక సమాజంలో మానవ సంబంధాలు ,వాటి విలువలు కాలానికి అనుగుణంగా మారుతున్నాయి. ఈనేపథ్యంలోనే పెళ్లి అనే బంధం నుండి సహజీవనం అనే సరికొత్త విధానంతో ఆడమగ ఏకమవుతున్నారు. దీంతో ఇద్దరి జవీతాల్లో ఒకరిపై ఒకరు పెత్తనం చేసుకునే అవకాశం ఉండదు. ఎన్ని రోజులు ఇద్దరికి ఇష్టం ఉంటే అన్ని రోజులు కలిసి కాపురం చేయచ్చోనే సౌలభ్యం సహజీవనంలో ఉంది. ఇలా సమాజంలో ఉన్నత వర్గాల్లోతోపాటు, మేధావి వర్గాల్లో కొంతమంది సహజీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇక ఇది చట్టబద్దం కూడ కావడంతో సమాజంలో రోజురోజుకు ఈ సహజీవన బంధాలు పెరుగుతున్నాయి.

మహిళ స్వేఛ్చను కాపాడేందుకు...

మహిళ స్వేఛ్చను కాపాడేందుకు...

ముఖ్యంగా సహజీవనాలు మహిళలను పెళ్లి,కుటుంభం అనే బంధం నుండి బయటపేడేసేందుకు సహజీవనం ఉపయోగపడుతుందనే అభిప్రాయం సమాజంలో నెలకొని ఉంది. మహిళలలతో పాటు,పురుషులకు కూడ ఇది సహజీవనం ఆమోదయోగ్యంగా ఉన్నంత కాలం ఎలాంటీ ఇబ్బందులు లేకుండా దాన్ని కొనసాగించవచ్చు. ముఖ్యంగా ఈ సహజీవన చట్టం మహిళలకు పూర్తి స్వేచ్చ ,హక్కులు కల్పిస్తుందనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో గత కొద్ది సంవత్సరాలుగా సహజీవన బంధాలు దేశంలో కొనసాగుతున్నాయి.

సహజీవనంలో కూడ మహిళలకు అన్యాయమే...

సహజీవనంలో కూడ మహిళలకు అన్యాయమే...

కాని సహజీవన సంబంధాలు మహిళలకు ఎక్కువ స్వేఛ్చను ఇస్తాయనే భావన గత కొద్ది రోజులుగా తోలగిపోతున్నట్టు పలువురి మహిళల అనుభవాల తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే మహిళలను కేవలం లైంగిక చర్యల కోసమే వారితో సహజీవనం కొనసాగిస్తూ.. మహిళలను పనిమనుషుల్లా చూస్తున్నారని రాజస్థాన్ మానవహక్కుల సంఘం అభిప్రాయపడింది..ఇందులో భాగంగానే ఇటివల సహజీవనానికి సంబంధించిన కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని తెలిపింది. దీతో వాటిని నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

English summary
Live-in relationships should be prohibited and women in such relationships are "akin to concubines", said the chief of Rajasthan Human Rights commission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X