వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ హవా: బిజెపికి తిరుగులేని మెజార్టీ, సింగిల్ లార్జెస్ట్ పార్టీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: లోకసభ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నాయి. పలు ప్రీపోల్, ఎగ్జిట్ పోల్ సర్వేలు ఎన్డీయేదే మెజార్టీ అని చెబుతున్నాయి. థర్డ్ ఫ్రంట్ వస్తుందని ఆ ఫ్రంట్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. మోడీ ప్రధాని అవుతారా? లేక అంచనాలు తారుమారు అవుతాయా అనే ఉత్కంఠ అందరిలోను నెలకొంది. దేశవ్యాప్తంగా 543 లోకసభ స్థానాల్లో, మూడు రాష్ట్రాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది.

Live Lok Sabha Results 2014

సంకీర్ణ యుగమని నమ్ముతున్న ఈ కాలంలో మోడీ హవాతో బిజెపి రికార్డ్ బద్దలు కొట్టింది. మిత్ర పక్షాల అవసరం లేకుండానే బిజెపి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే స్థానాలను గెలుచుకుంది. కేవలం బిజెపి దాదాపు మూడు వందలు స్థానాలు, ఎన్డీయే మూడు వందల ముప్పై స్థానాల వరకు గెలుచుకుంటోంది.

ఎన్డీయే కూటమి మూడువందలకు పైగా స్థానాలలో విజయం సాధించగా, కాంగ్రెసు పార్టీ డబుల్ డిజిట్ దాటే పరిస్థితి కూడా కనిపించడం లేదు.

బోజ్‌పురి నటుడు, బిజెపి నేత మనోజ్ తివారీ విజయం సాధించారు.

భాగల్ పూర్‌లో బిజెపి నేత షాన్ వాజ్ హుస్సేన్ ఓడిపోయారు. కనౌజ్ నుండి అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ గెలుపొందారు. మోడీకి శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే అభినందనలు తెలిపారు.

సల్మాన్ ఖుర్షీద్ తన ఓటమిని అంగీకరించారు.

తేజ్‌పూర్ నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థి రామ్ ప్రసాద్ శర్మ గెలుపొందారు.

ఘోర వైఫల్యం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ మే 19న భేటీ కానుంది.

హర్యానాలో బిజెపి ఏడు సీట్లలో గెలుపొందింది. జెడియు ఒక్క స్థానంలో గెలిచింది.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ అభ్యర్థి వైయస్ విజయమ్మ విశాఖలో బిజెపి అభ్యర్థి కంభంపాటి హరిబాబు చేతిలో 90వేలకు పై చిలుకు ఓట్లతో గెలుపొందారు.

అమేథీలో రాహుల్ గాంధీ స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. కేవలం పదిహేడు వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. స్మృతి ఇరానీ గట్టి పోటీనిచ్చారు.

నరేంద్ర మోడీకి అభినందనలు తెలిపేందుకు లాలూ ప్రసాద్ యాదవ్ నిరాకరించారు.

కురుక్షేత్రలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ జిందాల్ ఓడిపోయారు.

మహదేవ్ పురలో శరద్ యాదవ్ పైన ఆర్జెడీ అభ్యర్థి పప్పు యాదవ్ గెలిచారు

టిడిపి గుంటూరు అభ్యర్థి గల్లా జయదేవ్ గెలుపొందారు.

రాజంపేటలో పురంధేశ్వరి ఓటమి చెందారు. పెద్దపల్లిలో వివేక్, మహబూబాబాద్‌లో బలరాం నాయక్ ఓడిపోయారు.

సాయంత్రం ఐదు గంటల వరకు ఎన్డీయే 88 సీట్లను గెలుచుకొని, మరో 224 సీట్లలో ముందంజలో ఉంది. యూపిఏ 12 సీట్లు గెలుచుకొని, మరో 45 సీట్లలో ముందంజలో ఉంది. ఇతరులు 22 సీట్లు గెలుచుకొని 162 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

మోడీ గెలిచినందుకు బిజెపి నాయకురాలు, టీవీ నటి స్మృతి ఇరానీ అభినందనలు తెలిపారు. అమేథీలో బిజెపి, కాంగ్రెసు పార్టీల మధ్యనే పోటీ కనిపించిందన్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ చండీగఢ్ అభ్యర్థి గుల్ పనాగ్ తన ఓటమిని అంగీకరిస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

గోండా నియోజకవర్గం నుండి పోటీ చేసిన కేంద్రమంత్రి బేణి ప్రసాద్ వర్మ బిజెపి అభ్యర్థి కీర్తి వర్ధన్ సింగ్ చేతిలో ఓడిపోయారు.

ఉత్తర ప్రదేశ్‌లో బిజెపి దూసుకు పోతోందని, 80 స్థానాలకు గాను 73 స్థానాల్లో తాము ముందంజలో ఉన్నామని అమిత్ షా చెప్పారు.

జబల్బూర్ నుండి బిజెపి అభ్యర్థి రాకేష్ సింగ్, కాన్పూర్ నుండి మురళీ మనోహర్ జోషీ, ఖజురహో నుండి నాగేంద్ర సింగ్ గెలుపొందారు.

అమృత్ సర్‌లో గెలుపొందిన అమరీందర్ సింగ్‌కు బిజెపి అభ్యర్థి అరుణ్ జైట్లీ అభినందనలు తెలిపారు.

పంజాబ్‌లో తమ పార్టీ గెలుపు తనను ఆశ్చర్చపరిచిందని, అదే సమయంలో ఢిల్లీలో ఓటమి తనను అసంతృప్తికి గురి చేసిందని ఎఎపి సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

విశాఖలో వైయస్ విజయమ్మ ఓడిపోయారు. రాజంపేటలో పురంధేశ్వరి వెనుకంజలో ఉన్నారు.

ఈస్ట్ ఢిల్లీ నుండి బిజెపి అభ్యర్థి మహేష్ గిరి గెలుపొందారు. మొదట వెనుకబడిన ములాయం సింగ్ యాదవ్ గెలుపొందారు.

మధ్యప్రదేశ్‌లో బిజెపి 29 సీట్లకు గాను 25 సీట్లలో గెలిచింది.

బిజెపి అజెండా అభివృద్ధి, సంక్షేమం అని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు.

జార్ఖండ్ లో ఉన్న 14 స్థానాల్లో బిజెపి 11 స్థానాల్లో ముందంజలో ఉంది. పిడిపి నేత మహబుబా ముఫ్తీ అనంత నాగ్ నుండి గెలుపొందారు.

కేంద్రంలో బిజెపి గెలుపు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ బిజెపి కార్యాలయంలో పార్టీ సంబరాలు జరుపుకుంది.

Narenda Modi

బిజెపికి ఆర్ఎల్డీ నేత అమర్ సింగ్ అభినందనలు తెలిపారు.

ఒడిశాలో 21 సీట్లకు గాను బిజెడి 20సీట్లలో ముందంజలో ఉంది.

వెస్ట్ డిల్లీ నుండి పోటీ చేసిన బిజెపి అభ్యర్థి పర్వేష్ వర్మ, నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుండి పోటీ చేసిన మనోజ్ తివారి గెలుపొందారు.

బిజెపి గుజరాత్‌లోని 26 సీట్లలో గెలిచింది. మీరట్ నుండి పోటీ చేసిన నగ్మా ఓడిపోయారు.

గులాం నబీ ఆజాద్, సల్మాన్ ఖుర్షీద్, నవీన్ జిందాల్‌లు ఓడిపోయారు.

మలింద్ దేవరా, ప్రఫుల్ పటేల్‌లు ఓడిపోయారు

బిజెపికి చెందిన మేనకా గాంధీ పిలిబిత్ నుండి, కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా గుణ నుండి గెలుపొందారు.

హైదరాబాదులో వెనుకంజలో ఉన్న అసదుద్దీన్ ఓవైసీ ముందుకొచ్చారు. అసద్ 39వేల మెజార్టీతో ఉన్నారు.

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అరుణ్ యాదవ్..నందకుమార్ చౌహాన్ చేతిలో ఓడిపోయారు.

త్రివేండ్రంలో మొదట వెనుకబడిన శశిథరూర్ గెలుపొందారు. ఝాన్సీలో ఉమా భారతి యాభై వేల మెజార్టీతో గెలుపొందారు

మెదక్ లోకసభకు పోటీ చేసిన కెసిఆర్ మూడు లక్షలకు పైచిలుకు ఓట్లతో గెలుపొందారు.

వడోదరలో మోడీకి 5,70, 128 ఓట్ల మెజార్టీ వచ్చింది.

రాయ్ బరేలీ నుండి సోనియా గాంధీ గెలుపొందారు. ససరం నుండి మీరా కుమార్ ఓడిపోయారు.

మన్మోహన్ సింగ్ బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.

రాహుల్ గాంధీ 23వేల మెజార్టీతో ఉన్నారు. బారామతి నియోజకవర్గం నుండి ఎన్సీపీ అభ్యర్థి సుప్రీయా సూలే ముందంజలో ఉన్నారు.

ఈ నెల 21న మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఎన్డీయే 338, యూపిఏ 60, ఇతరులు 145 స్థానాల్లో గెలిచారు లేదా ముందంజలో ఉన్నారు.

తెలంగాణలో తెరాస 10, టిడిపి, బిజెపి కూటమి 3, కాంగ్రెస్ 2, సీమాంధ్రలో టిడిపి, బిజెపి కూటి 17, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 8 స్థానాల్లో ముందంజలో ఉంది.

బిజెపి అభ్యర్థులు జ్యోతి దర్వే, సుమిత్రా మహాజన్, రాకేష్ సింగ్‌లు గెలుపొందారు.

జమ్ము కాశ్మీర్ లో బిజెపి రెండు సీట్లలో ముందంజలో ఉంది.

ముంబయిలో బిజెపి అభ్యర్థి పూనమ్ మహాజన్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రియా దత్ పైన గెలిచే దిశలో సాగుతున్నారు.

ఢిల్లీలో బిజెపి అన్ని స్థానాలలో ముందంజలో ఉంది.

ప్రస్తుతం దేశం అవినీతికి వ్యతిరేకంగా ఓటు వేసిందని ఎల్ కె అద్వానీ అన్నారు.

అమేథీలో రాహుల్ గాంధీ దాదాపు రెండు లక్షల ఆధిక్యంలో ఉన్నారు.

వారణాసి, వడోదరలో గెలిచిన అనంతరం మోడీ ఇంటికి వెళ్లి తల్లి ఆశీస్సులు తీసుకున్నారు.

హైదరాబాదు లోకసభకు అనూహ్యంగా అసదుద్దీన్ ఓవైసీ పైన బిజెపి అభ్యర్థి 26వేలకు పై చిలుకు ఓట్ల మెజార్టీతో ఉన్నారు.

హసన్ నుండి దేవేగౌడ గెలుపొందారు. మల్లికార్జున ఖర్గే గుల్బర్గా నుండి గెలుపొందారు.

మొదట వెనుకబడిన సుశీల్ కుమార్ షిండే గెలుపొందారు.

ఒంగోలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపీ అభ్యర్థి వైవి సుబ్బారెడ్డి గెలుపొందారు.

వరంగల్ లోకసభ స్తానానికి తెరాస అభ్యర్థి కడియం శ్రీహరి గెలుపొందారు.

మీరట్‌లో ప్రముఖ నటి నగ్మా వెనుకంజలో ఉన్నారు. దేశవ్యాప్తంగా 35 మంది కేంద్రమంత్రులు ఓటమి బాటలో పయనిస్తున్నారు. హైదరాబాదులో మజ్లిస్ పార్టీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీకి బిజెపి అభ్యర్థి చెమటలు పట్టిస్తున్నారు.

కరీంనగర్ లోకసభకు పోటీ చేస్తున్న పొన్నం ప్రభాకర్ వెనుకబడ్డారు.

వరంగల్ లోకసభ తెరాస అభ్యర్థి కడియం శ్రీహరి రెండు లక్షలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ఎనిమిదో రౌండ్ ముగిసే సరికి మెదక్ లోకసభలో కెసిఆర్ మెజార్టీ లక్షకు పైగా ఉంది.

రాయ్ బరేలీలో సోనియా గాంధీ పద్నాలుగు లక్షలకు పైగా మెజార్టీతో ఉన్నారు.

ఇప్పటి వరకు ఎన్డీయే గెలుచుకున్నవి, ఆధిక్యంలో ఉన్నవి 334, యూపిఏ 66, ఇతరులు 143. సిపిఐ 8, సిపిఐ 1, తృణమూల్ 33, అన్నాడిఎంకె 36, సిపిఐ 1, ఎస్పీ 8, ఎన్సీపి 3, బిఎస్పీ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

రాజంపేటలో పురంధేశ్వరి 18వేల ఆధిక్యంలో ఉన్నారు.

బిజెపి అభ్యర్థులు మేనకా గాంధీ, ఉమాభారతిలు ముందంజలో ఉన్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ బోణీ కొట్టింది. పంజాబీ కమెడియన్ భగవంత్ మన్ సంగ్రూర్ నుండి గెలుపొందారు. రాయ్ బరేలోలీ సోనియా గాంధీ లక్షకు పైగా ఓట్లతో మెజార్టీలో ఉన్నారు.

అమేథీలో రాహుల్ గాంధీ 14వేల ఓట్ల మెజార్టీతో ఉన్నారు.

మధురలో హేమమాలిని ముందంజలో ఉన్నారు. విశాఖలో వైయస్ విజయమ్మ వెనుకంజలో ఉన్నారు.

వారణాసిలో మోడీ గెలుపొందారు. కేజ్రీవాల్ రెండో స్థానంలో నిలిచారు. నాగపూర్ నుండి నితిన్ గడ్కరీ విజయం సాధించారు.

ఎన్డీయే విజయం దిశగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో మోడీని ఈ నెల 18వ తేదీని బిజెపి ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకునే అవకాశముంది.

రాజస్థాన్‌లో 25 స్థానాలలో బిజెపి ముందంజలో ఉంది.

ములాయం సింగ్ యాదవ్ నాలుగు వందల ఓట్ల మెజార్టీతో ముందుకొచ్చారు.

కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ముందుకొచ్చారు. స్మృతి ఇరానీ ఆయనకు గట్టి పోటీనిస్తున్నారు.

బిజెపి నేత హర్షవర్ధన్ చాందీనీ చౌక్ నుండి గెలుపొందారు. విదిష నుండి సుష్మా స్వరాజ్ గెలుపొందారు.

కాన్పూర్ లో బిజెపి నేత మురళీ మనోహర్ జోషీ దూసుకెళ్తున్నారు. ఆయన 32వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు.

బిజెపి నేత అరుణ్ జైట్లీ 28వేలకు పై చిలుకు ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు.

అసోంలో కాంగ్రెసు పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ రాజీనామా చేసే అవకాశముంది.

చండీగఢ్ నుండి బిజెపి అభ్యర్థి కిరణ్ ఖేర్ ముందంజలో ఉన్నారు. చండీవరా నుండి కమల్ నాథ్ ముందంజలో ఉన్నారు.

టోంక్ సవాయి నుండి అజహరుద్దీన్, బర్మేర్ నుండి స్వతంత్ర అభ్యర్థి జశ్వంత్ సింగ్ లు ముందంజలో ఉన్నారు. గాంధీ నగర్ నుండి అద్వానీ గెలుపొందారు.

పదకొండు గంటల వరకు ఎన్డీయే 325, యూపిఏ 67, అన్నాడిఎంకె 35, సిపిఐ 6, సిపిఎం 7, బిఎస్పీ 8, ఎన్సీపి 6, జెడియు 4, బిజెడి 13, ఎఎపి 4, డిఎంకె 1, ఎస్పీ 9 స్థానాల్లో ముందంజలో ఉంది.

వడోదరలో నరేంద్ర మోడీ కాంగ్రెసు అభ్యర్థి మదుసూధన్ మిస్రీ పైన గెలుపొందారు.

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెసు పార్టీ కేవలం నాలుగు స్థానాల్లోనే ముందంజలో ఉంది.

తమిళనాడులో అన్నాడిఎకె పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. 32 స్థానాల్లో జయ పార్టీ ముందంజలో ఉండగా, బిజెపి 2 స్థానాల్లో ముందంజలో ఉంది.

ములాయం సింగ్ యాదవ్, సల్మాన్ ఖుర్షీద్‌లు వెనుకంజలో ఉన్నారు.

స్మృతి ఇరానీతో పోటీలో వెనుకబడ్డ రాహుల్ గాంధీ ముందుకొచ్చారు.

వారణాసిలో నరేంద్ర మోడీ 23వేలకు పైగా చిలుకు ఓట్లతో ముందంజలో ఉన్నారు. కేజ్రీవాల్ రెండో స్థానంలో ఉన్నారు.

షోలాపూర్‌లో సుశీల్ కుమార్ షిండే వెనుకంజలో ఉన్నారు. గాంధీ నగర్ లో అద్వానీ ముందంజలో ఉన్నారు. అజంగడ్ లో ములాయం సింగ్ వెనుకంజలో ఉన్నారు. యూపిలోని ఫరూకాబాదులో సల్మాన్ ఖూర్షీద్ వెనుకంజలో ఉన్నారు. రబ్రీదేవి వెనుకంజలో ఉంది.

వడోదరలో బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఘన విజయం సాధించారు.

యడ్యూరప్ప ఘన విజయం సాధించారు.

ఉదంపూర్ లో గులాం నబీ ఆజాద్ ముందుంజలో ఉన్నారు. శ్రీనగర్ లో ఫరూక్ అబ్దుల్లా వెనుకంజలో ఉన్నారు. త్రివేండ్రంలో శశి థరూర్ వెనుకంజలో ఉన్నారు.

మోడీ గెలుపు కోసం ఆయన తల్లి ప్రత్యేకంగా పూజలు చేశారు.

మీరా కుమార్ దాదాపు పదివేల ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు. అనంత నాగ్‌లో మొహబూబియా ముఫ్తి ముందంజలో ఉన్నారు. అమృత్ సర్‌లో అమరీందర్ సింగ్ బిజెపి అభ్యర్థి అరుణ్ జైట్లీ కంటే ముందంజలో ఉన్నారు.

మెదక్ లోకసభకు పోటీ చేసిన కెసిఆర్ 21వేల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. అమేథీలో రాహుల్ గాంధీ కంటే స్మృతి ఇరానీ మూడు వందల ఓట్ల మెజార్టీతో ఉన్నారు. వారణాసిలో మోడీ రెండువేలకు పైగా ఓట్లతో ముందంజలో ఉన్నారు. కేజ్రీవాల్ రెండో స్థానంలో కొనసాగుతున్నారు.

దేశవ్యాప్తంగా ఎన్డీయే 307, యూపిఏ 73, ఇతరులు 157 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. సీమాంధ్రలో జగన్ పార్టీ 12, టిడిపి 11, బిజెపి 1, తెలంగాణలో తెరాస 12, బిజెపి 1, టిడిపి 2, కాంగ్రెస్ 1 స్థానంలో ముందంజలో ఉన్నాయి.

సిపిఐ 9, సిపిఎం 8, తడణమూల్ 20, బిఎస్పీ 7, జెడియు 2, బిజెడి 3, ఎఎపి 5, అన్నాడిఎంకె 34, డిఎంకె 65, ఎస్పీ 10 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రెండు గంటలకు విలేకరుల సమావేశంలో మాట్లాడే అవకాశముంది. ఎల్జేపీ అధనేత రామ్ విలాస్ పాశ్వాన్ హాజీపూర్‌లో ముందంజలో ఉన్నారు. బాంద్రా-గోండియా నుండి ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ ముందంజలో ఉన్నారు.

కాంగ్రెస్ నాయకురాలు నగ్మా మీరట్‌లో ముందంజలో ఉన్నారు. ఎఎపి లీడర్ షాజియా ఇల్మీ ఘజియాబాదులో లీడింగులో ఉన్నారు. చండీగఢ్ లో బిజెపి నేత కిరణ్ ఖేర్ ముందంజలో ఉన్నారు. కిరణ్ ఖేర్ పైన కాంగ్రెసు నుండి పవన్ బన్సాల్, ఎఎపి నుండి గుల్ పనాగ్ పోటీ చేశారు.

కాన్పూర్ లో మురళీ మనోహర్ జోషీ ముందంజలో ఉన్నారు. రాహుల్ గాంధీ అమేధీలో వెనుకంజలో ఉన్నారు. ఎఎపి నేత రాఖీ బిర్లా నార్త్ వెస్ట్ ఢిల్లీలో ముందంజలో ఉన్నారు. ఒరిస్సాలో బిజెడి 3, బిజెపి 2, కాంగ్రెస్ ఒక్క సీటులో ముందంజలో ఉన్నాయి. సుల్తాన్ పుర్ లో బిజెపి నేత వరుణ్ గాంధీ గెలుపొందారు. అహ్మదాబాదులో నటుడు పరేష్ రావల్ ముందంజలో ఉన్నారు.

దేశవ్యాప్తంగా ఎన్డీయే 290, కాంగ్రెస్ 80, ఇతరులు 141 స్థానాల్లో, తృణమూల్ 30, ఎస్పీ 11, జెడిు 2, బిజెడి 3, ఏఏపి 7, అన్నాడిఎంకె 32, డిఎంకె 5, సిపిఐ 5, సిపిఎం 10, ఎన్సీపి 6 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

ముంబైలో సంజయ్ దత్ సోదరి ప్రియాదత్ వెనుకంజలో ఉన్నారు. కాశ్మీర్ నుండి గులాం నబీ ఆజాద్ వెనుకంజలో ఉన్నారు. అరుణ్ జైట్లీ వెనుకంజలో ఉన్నారు. సోనియా గాంధీ ముందంజలో ఉన్నరు.

సతారాంలో మీరా కుమార్ వెనుకంజలో ఉన్నారు. ఎన్డీయే 281, యూపిఏ 81, తృణమూల్ 29, బిఎస్పీ 7, ఎన్సీపీ 4, జెడియు2, ఎఎపి 7, అన్నాడిఎంకె 35, డిఎంకె 5, ఎస్పీ 9 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

అమేథీలో రాహుల్ గాంధీ కంటే నటి, బిజెపి అభ్యర్థి స్మృతి ఇరానీ ముందంజలో ఉంది. ఆర్ఎల్డీ అధినేత అజిత్ సింగ్ ఓడిపోయారు. బిజ్నూర్‌లో జయప్రద ముందంజలో ఉన్నారు.

ఆధిక్యంలో మెజార్టీకి చేరువలో ఎన్డీయే ఉంది. 271 స్థానాల్లో ఎన్డీయే, 80 స్థానాల్లో యూపిఏ, 133 స్థానాల్లో ఇతరులు ఉన్నారు. సీమాంధ్రలో జగన్ పార్టీ 10, టిడిపి 8, బిజెపి రెండు స్థానాల్లో, తెలంగాణలో తెరాస 10, కాంగ్రెస్ 4, బిజెపి, టిడిపిలు ఒక్కోచోట ఆధిక్యంలో ఉన్నారు.

దేశవ్యాప్తంగా ఎన్డీయే 256, యూపిఏ 73, ఇతరులు 134 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తంగా ఆరుచోట్ల ముందంజలో ఉంది. అస్సాంలో బిజెపి 3 స్థానాల్లో ముందంజలో ఉంది. బర్మూర్ నుండి జశ్వంత్ సింగ్ వెనుకంజలో ఉన్నారు. సరన్‌లో రబ్రీదేవి ముందంజలో ఉన్నారు. సీమాంధ్రలో టిడిపి 8, జగన్ పార్టీ 10, తెలంగాణలో తెరాస 11, కాంగ్రెసు 3, టిడిపి 2, బిజెపి 1 స్థానంలో ముందంజలో ఉన్నాయి. నిజామాబాదులో మధుయాష్కీ ముందంజలో ఉన్నారు. సికింద్రాబాదులో బండారు దత్తాత్రేయ ముందంజలో ఉన్నారు.

అమృత్ సర్‌లో అరుణ్ జైట్లీ ముందంజలో ఉన్నారు.

నిజామాబాద్ లోకసభలో కల్వకుంట్ల కవిత ముదంంజలో ఉన్నారు.

విశాఖలో విజయమ్మ ఆధిక్యంలో ఉన్నారు. దేశవ్యాప్తంగా ఎన్డీయే 222, యూపిఏ 70, ఇతరులు 122 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. విజయవాడలో టిడిపి అభ్యర్థి కేశినేని నాని ముందంజలో ఉన్నారు.

క్రికెటర్ మహమ్మద్ కైఫ్ పుల్పూర్‌లో ముందంజలో ఉన్నారు. దేశవ్యాప్తంగా ఎన్డీయే 215, యూపిఏ 69, ఇతరులు 104 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

కనౌజ్‌లో డింపుల్ యాదవ్ ముందంజలో ఉన్నారు. అమేథీలో రాహుల్ కంటే నటి స్మృతి ఇరానీ ముందంజలో ఉన్నారు.

ఎన్డీయే 204, యూపిఏ 72, ఇతరులు 79 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో సీమాంధ్రలో జగన్ పార్టీ 8, టిడిపి 3 స్థానాల్లో, తెలంగాణలో తెరాస 7, కాంగ్రెస్ 2, టిడిపి 1 స్థానంలో ముందంజలో ఉంది. మహబూబాబాద్ లోకసభలో తెరాస ఆధిక్యంలో ఉంది.

శ్రీకాకుళం, నర్సారావుపేట లోకసభల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధిక్యంలో ఉంది. మెదక్ లోకసభలో కెసిఆర్ ఆధిక్యం. ఎన్డీయే 170, యూపిఏ 65 స్థానాల్లో, ఇతరులు 72 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

చాందినీ చౌక్‌లో బిజెపి అభ్యర్థి హర్షవర్ధన్ ముందంజలో ఉన్నారు. ఎపిలో బిజెపి రెండు చోట్ల ముందంజలో ఉంది. ఇప్పటి వరకు ఎన్డీయే 145, యూపిఏ 48, తృణమూల్ 13, ఎస్పీ 4, అన్నాడిఎంకె 1 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

రాజంపేటలో పురంధేశ్వరి ముందంజలో ఉంది. తెలంగాణలో తెరాస మూడు, కాంగ్రెసు 1 స్థానంలో ముందంజలో ఉండగా, సీమాంధ్రలో టిడిపి రెండు, వైయస్సార్ కాంగ్రెసు మూడు స్థానాల్లో ముందంజలో ఉంది.

కుల్పూర్ లో మహమ్మద్ కైఫ్, నాందెడ్‌లో అశోక్ చవాన్‌లు ముందంజలో ఉన్నారు. ఎన్డీయే 122, యూపిఏ 44 స్థానాల్లో ముందంజలో ఉంది.

విదిషలో సుష్మా స్వరాజ్ ముదంంజలో ఉన్నారు. ఇప్పటి వరకు ఎన్డీయే 104, యూపిఏ 46 స్థానాల్లో ముందంజలో ఉంది. మధురలో హేమమాలిని వెనుకంజలో ఉన్నారు.

ఎన్డీయే 101 స్థానాల్లో, యూపిఏ 46 స్థానాల్లో ముందంజలో ఉంది. తెలంగాణలో తెరాస మూడు లోకసభ స్థానాల్లో ముందంజలో ఉంది.

వారణాసిలో మోడీ, రాయ్ బరేలీలో సోనియా గాంధీ, అమేథీలో రాహుల్ గాంధీ ముందంజలో ఉండగా, పిలిబిత్‌లో మేనకా గాంధీ వెనుకంజలో ఉన్నారు. లక్నోలో రాజ్ నాథ్ సింగ్ ముందంజలో ఉన్నారు.

ఎనిమిదిన్నర గంటల వరకు బిజెపి 75, యూపిఏ 38 స్థానాల్లో ముందంజలో ఉంది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టిఎంసి తొమ్మిది స్థానాల్లో ముందంజలో ఉంది. తమిళనాడులో జయలలిత పార్టీ ఒక స్థానంలో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. యుపిలో ఎస్పీ మూడు స్థానాల్లో, తెలంగాణలో తెరాస, ఎపిలో టిడిపి ఒక్కో స్థానంలో ముందంజలో ఉంది.

ఒడిశాలో బిజెడి ఐదు స్థానాల్లో, కేరళలో యూడిఎఫ్ తొమ్మిది స్థానాల్లో ముందంజలో ఉంది. బీహార్లో బిజెపి నాలుగు స్థానాల్లో ముందంజలో ఉంది.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ త్రివేండ్రంలో వెనుకంజలో ఉన్నారు. ఎన్డీయే 46, యూపిఏ 21 స్థానాల్లో ముందంజలో ఉంది.

బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే 31 స్థానాల్లో ముందంజలో ఉండగా, కాంగ్రెసు నేతృత్వంలోని యూపిఏ 12 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు ఒక స్థానంలో ముందంజలో ఉన్నారు.

7 స్థానాలలో బిజెపి ముందంజ, రెండు స్థానాల్లో కాంగ్రెసు ఆధిక్యం.

తాను కచ్చితంగా విజయం సాధిస్తానని న్యూఢిల్లీ బిజెపి అభ్యర్థి మీనాక్షి లేఖిని చెప్పరు.

ఎనిమిది గంటలకు సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తున్నారు. ఎనిమిదిన్నర గంటలకు ఈవిఎం ఓట్లను లెక్కిస్తారు.

ఉత్తర ప్రదేశ్, మంగళూర్‌లలో 144 సెక్షన్ విధించారు. గెలిచిన తర్వాత ఊరేగింపులు వంటి వాటిని ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో బహిష్కరించారు.

వారణాసి లోకసభకు పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ తన గెలుపుపై ధీమాతో ఉన్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) తరఫున పోటీ చేసిన ప్రముఖ నటి గుల్ పనాగ్ చండీగఢ్‌లోని పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు.

బిజెపి మాజీ ప్రధాని నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. తాను తప్పకుండా విజయం సాధిస్తానని, అఖండ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్ మాట్లాడుతూ.. తమ పార్టీ ప్రచారాన్ని బిజెపి ప్రచారంతో పోల్చుకోమని చెప్పారు.

బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రంలోని గాంధీ నగర్ నుండి, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఢిల్లీ నుండి ఎన్నికల ఫలితాలను వీక్షిస్తున్నారు.

ఓట్ల లెక్కింపు అనంతరం ప్రతి ఈవిఎం నుండి ప్రింట్ అవుట్ ఇవ్వాలని ఈసి నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఫలితాలు కొంత
ఆలస్యమయ్యే అవకాశముంది.

English summary
Stay tuned for the live updates of the 16th Lok Sabha election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X