వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముగిసిన గుజరాత్ రెండో దశ ఎన్నికల పోలింగ్: క్యూలో ఉన్నవారు ఓటు వేయొచ్చు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Gujarat Elections Updates : Polling underway for Phase-II రెండో దశ ఎన్నికల పోలింగ్ | oneindia

గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికలు గురువారం(డిసెంబర్ 14న) ఉదయం 8గంటలకు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరిగింది. లైన్లో ఉన్న వారికి ఆ తర్వాత ఓటు వేసేందుకు అనుమతించారు. మొత్తం 182స్థానాలకు గానూ తొలి దశలో 89 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగగా.. రెండో దశలో 14జిల్లాలోని 93 నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ జరిగింది.

- గుజరాత్‌లో రెండో దశ పోలింగ్ సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. ఇప్పటికే క్యూలో నిలబడ్డ వారికి ఓటు వేసేందుకు అనుమతించారు.

- ఓటు వేసిన అనంతరం ప్రధాని మోడీ రోడ్ షోగా వెళ్లడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

- ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి.

- మధ్యాహ్నం 2గంటలకు వరకు 47.40శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.

- జమల్పూర్ ఖడియాలో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

- మధ్యాహ్నం 12గంటల వరకు 29.80శాతం పోలింగ్ అయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

- గురువారం మధ్యాహ్నం 12.15గంటల ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోడీ.. అహ్మదాబాద్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లతోపాటు వరుసలో నిల్చుని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు మోడీ. అనంతరం ఓటు వేసిన గుర్తున్న వేలును చూపుతూ కారులో రోడ్ షోగా వెళ్లారు.

- ఉదయం 11గంటల ప్రాంతంలో గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భరత్ సింగ్ సోలంకి ఆనంద్‌లోని 201 పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

- గుజరాత్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ బీబీ స్వాయిన్.. గాంధీ నగర్‌లో ఓటు వేశారు.

- భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

- ఉదయం 10.30గంటల ప్రాంతంలో గుజరాత్ డిప్యూటీ సీఎ నితిన్ పటేల్.. మెహసాన్స్ కడిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవాభాయి పటేల్‌పై పోటీ చేస్తున్నారు.

- సంఖేడా ప్రాంతంలోని ఛోటా ఉదయపూర్ సోధాలియా గ్రామంలో ఓ ఈవీఎం పనిచేయకపోవడంతో 50నిమిషాలపాటు పోలింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత ఈవీఎంను సరి చేయడంతో పోలింగ్ ప్రారంభమైందని పోలింగ్ అధికారి గౌరంగ్ రాణా తెలిపారు.

Live updates: Gujarat assembly elections 2017, second phase polling begins

- ఉదయం 10గంటల ప్రాంతంలో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ వెజల్పూర్ పోలింగ్ బూత్ వద్ద వరుసలో నిల్చుని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారీ సంఖ్యలో తరలివచ్చి ఓటు వేయాలని ఈ సందర్భంగా జైట్లీ ఓటర్లకు పిలుపునిచ్చారు.

- ఉదయం 9.30గంటల ప్రాంతంలో సీనియర్ నేత శంకర్ సింగ్ వాఘేలా వాసన్ గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

- తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదంటూ అహ్మదాబాద్ సమీపంలోని ఓ గ్రామ ప్రజలు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు.

- ఉదయం 9.10గంటల ప్రాంతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తన ఓటు హక్కును నారాయణపురాలో వినియోగించుకున్నారు.

- ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరా బెన్ పోలింగ్ కేంద్రానికి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుజరాత్ రాష్ట్రం ఎప్పుడూ బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నట్లు 95ఏళ్ల హీరా బెన్ ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మీడియాకు తెలిపారు.

- పటేళ్ల ఉద్యమ నేత హార్దిక్ పటేల్ తల్లిదండ్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

- గురువారం ఉదయం 9గంటల వరకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.

-గురువారం ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.

రెండో దశలో మొత్తం 851మంది అభ్యర్థులు తలపడుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.

Live updates: Gujarat assembly elections 2017, second phase polling begins

ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రధాని మోడీ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గుజరాత్ రాష్ట్రంలో ప్రచారం హోరెత్తించారు. కాగా, తొలి దశ ఎన్నికలు డిసెంబర్ 9న ముగిసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 18న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.

English summary
After a high-voltage campaign, stage is set as Gujarat gears up for the second phase of elections December 14th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X