వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌కు గుడ్ న్యూస్: పైలట్ అభినందన్‌ను శుక్రవారం విడుదల చేయనున్న పాకిస్తాన్

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: భారత్ పాక్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి. బుధవారం భారత గగనతలంలోకి వచ్చిన పాక్ యుద్ధ విమానాలు భారత్‌కు చెందిన రెండు యుద్ధ విమానాలను కూల్చామని పాక్ చెబుతోంది. అదే సమయంలో భారత్ కూడా పాక్ యుద్ధ విమానాన్ని కూల్చినట్లు చెబుతోంది. ఇక విషయం సీరియస్‌గా మారుతుండటంతో ప్రధాని నరేంద్ర మోడీ గురువారం భధ్రతపై క్యాబినెట్ కమిటీతో సమావేశం కానున్నారు. పాక్ అధీనంలో ఉన్న పైలట్ అభినందన్ వర్ధన్‌ను తిరిగి సురక్షితంగా భారత్‌కు ఎలా రప్పించాలనేదానిపై చర్చించే అవకాశం ఉంది.

Live updates:PM Modi to chair CCS Meeting at his residence

Newest First Oldest First
7:26 PM, 28 Feb

రెండు రోజుల్లో 35 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది: ఆర్మీ
7:25 PM, 28 Feb

పాకిస్తాన్‌ యుద్ధ విమానం శకలాలను అధికారికంగా ప్రదర్శించిన త్రివిధ దళాలు
7:23 PM, 28 Feb

అభినందన్ వర్ధమాన్ కోసం మేము కూడా ఎదురు చూస్తున్నాం: రవికపూర్
7:20 PM, 28 Feb

పాకిస్తాన్ భారత గగనతలంలోకి వచ్చి దాడులు చేసే ప్రయత్నం చేశాయి...కానీ భారతవైమానిక దళం ఈ దాడులను సమర్ధవంతంగా తిప్పికొట్టింది
7:19 PM, 28 Feb

పాకిస్తాన్ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది: ఆర్మీ
7:18 PM, 28 Feb

కచ్చితంగా జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలపై దాడి చేశాం. అయితే ఎంతమంది ఉగ్రవాదులు మృతి చెందారో ఇప్పుడప్పుడే కచ్చితంగా చెప్పలేము:రవికపూర్
7:17 PM, 28 Feb

యుద్ధ వాతావరణానికి తెరలేపిందే పాకిస్తాన్.ఎలాంటి దాడులనైనా తిప్పి కొట్టగలిగే సత్తా భారత ఆర్మీకి ఉంది: సురీందర్ భాల్
7:15 PM, 28 Feb

పాక్ మిలటరీ స్థావరాలను టార్గెట్ చేసింది. అయితే సరైన సమయంలో స్పందించడంతో నష్టం జరగకుండా చూశాం: రవికపూర్
7:14 PM, 28 Feb

భారత మిలటరీ స్థావరాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు
7:13 PM, 28 Feb

భారత నేవీ ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది: రేర్ అడ్మిరల్ డీఎస్ గుజ్రాల్
7:12 PM, 28 Feb

భారత్ పై కానీ భారత ప్రజలపై కానీ దాడులకు పాల్పడితే తగిన గుణపాఠం చెబుతాం: మేజర్ జనరల్ సురీందర్ భాల్
7:11 PM, 28 Feb

పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఫిబ్రవరి 26న పాల్పడటంతో భారత్ ఆ దాడులను తిప్పి కొట్టింది: మేజర్ జనరల్ సురీందర్ భాల్
7:10 PM, 28 Feb

వింగ్ కమాండర్ అభినందన్ రాక కోసం ఎదురుచూస్తున్నాం:ఎయిర్ వైస్ మార్షల్ రవికపూర్
7:09 PM, 28 Feb

పాకిస్తాన్ ఎఫ్ 16 యుద్ధ విమానాలను వినియోగించలేదని బుకాయిస్తోంది. మా దగ్గర అందుకు రుజువులు ఉన్నాయి: ఎయిర్ వైస్ మార్షల్ రవికపూర్
7:09 PM, 28 Feb

పాకిస్తాన్ భారత మిలటరీ స్థావరాలను టార్గెట్‌గా దాడులు చేసింది: ఎయిర్ వైస్ మార్షల్ రవికపూర్
7:08 PM, 28 Feb

ఉదయం ఒక మాట సాయంత్రం మరో మాట మార్చింది పాకిస్తాన్: ఎయిర్ వైస్ మార్షల్ రవికపూర్
7:08 PM, 28 Feb

భారత యుద్ధ విమానంను పాక్ కూల్చాయి..అందులో ఒక పైలట్‌ను పాక్ కస్టడీకి తీసుకుంది:ఎయిర్ వైస్ మార్షల్ రవికపూర్
7:07 PM, 28 Feb

భారత వైమానికి దాడుల్లో ఒక పాక్ విమానంను కూల్చాం:ఎయిర్ వైస్ మార్షల్ రవికపూర్
7:07 PM, 28 Feb

పాకిస్తాన్ యుద్ధ విమానాలను ఎదుర్కొనేందుకు మిరాజ్ 2000, సుఖోయ్ యుద్ద విమానాలను వినియోగించాం: ఎయిర్ వైస్ మార్షల్ రవికపూర్
7:05 PM, 28 Feb

త్రివిధ దళాల ఉన్నతాధికారులతో విదేశాంగ ప్రతినిధి రవీష్ కుమార్ మీడియా సమావేశం
7:03 PM, 28 Feb

రాత్రి ప్రధాని మోడీకి ఇమ్రాన్ ఖాన్ ఫోన్ చేసే అవకాశం ఉంది: పాక్ మీడియా
7:02 PM, 28 Feb

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత ప్రధాని నరేంద్ర మోడీల మధ్య రాత్రి ఫోన్ సంభాషణ జరిగే అవకాశం
7:01 PM, 28 Feb

కొన్ని విదేశీ మీడియా సంస్థలు ఎవరూ చనిపోలేదు అని చెబుతున్నాయి భారత్ మీడియా ఏమో చాలా మంది మృతి చెందారు అని చెబుతున్నాయి. ఆపరేషన్‌లో ఎంతమంది మృతి చెందారో చెప్పాల్సిన బాధ్యత ప్రధానిపై ఉంది: మమత
7:00 PM, 28 Feb

భారత్ పాక్ పై దాడుల తర్వాత ప్రధాని మోడీ ఎలాంటి అఖిలపక్ష భేటీలు నిర్వహించలేదు: మమతా బెనర్జీ
6:29 PM, 28 Feb

సమావేశానికి హాజరుకానున్న త్రివిధ దళాల అధినేతలు
6:28 PM, 28 Feb

కాసేపట్లో భద్రతపై క్యాబినెట్ కమిటీ..ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భేటీ
5:06 PM, 28 Feb

ఇరుదేశాల మధ్య శాంతి నెలకొనాలని ఆకాంక్షించే భారత పైలట్‌ను విడుదల చేస్తున్నాం: ఇమ్రాన్ ఖాన్
5:00 PM, 28 Feb

మా పైలట్‌ను యుద్ధ ఖైదీగా పట్టుకునేందుకు పాక్ దగ్గర ఎలాంటి కారణాలు లేవు: భారత్
4:59 PM, 28 Feb

పాక్ కస్టడీలో ఉన్న భారత వింగ్ కమాండర్ అభినందన్ దూకుడు స్వభావం ఉన్న వ్యక్తి కాదు: భారత్
4:38 PM, 28 Feb

అంతర్జాతీయంగా పాక్‌పై వస్తున్న ఒత్తిడి.. ఒత్తిడికి తలొగ్గిన పాక్
READ MORE

English summary
Prime Minister Narendra Modi is scheduled to chair a meeting of the Cabinet Committee on Security (CCS) today, followed by Union Cabinet meeting at his residence. The meeting comes a day after an IAF pilot was captured by Pakistan after an air combat during which the two sides said they shot down each other's warplanes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X